newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

19-04-202119-04-2021 09:14:39 IST
2021-04-19T03:44:39.950Z19-04-2021 2021-04-19T03:07:04.366Z - - 15-05-2021

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

తిరుపతి ఉప ఎన్నిక ముగిసినప్పటికీ తెలుగుదేశం పార్టీ మాత్రం.. ఈ ఉప ఎన్నికలో ఎన్నో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తోంది. పెద్ద ఎత్తున దొంగ ఓటర్లు తిరుపతి ఉప ఎన్నికలో ఓట్లు వేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. ఇక తిరుపతిలో రీపోలింగ్ చేసే వరకూ పోరాటం చేయాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది.  తిరుపతి అసెంబ్లీ స్థానం పరిధిలో రీ పోలింగ్‌కు కోసం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ను సోమవారం మరోసారి కలవాలని ఆ పార్టీ నాయకత్వం నిశ్చయించింది. ఢిల్లీలో ఉన్న ఆ పార్టీ ఎంపీలు ఈసీని కలవనున్నారు. తిరుపతిలో భారీగా దొంగ ఓట్లు వేశారని ఆరోపిస్తున్న టీడీపీ.. శనివారం జరిగిన పోలింగ్‌ను రద్దు చేసి మళ్లీ పోలింగ్‌ జరపాలని డిమాండ్‌ చేస్తోంది. దీనిపై ఈసీ నిర్ణయం ఇంకా వెలువడలేదు. దీనితో మరోసారి కలవాలని నిర్ణయించారు. తాము సేకరించిన సాక్ష్యాలను అదనంగా ఇవ్వాలని కూడా నిశ్చయించారు. దొంగ ఓటర్‌ కార్డుల ముద్రణపై లోతుగా దర్యాప్తు చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరాలని టీడీపీ నిర్ణయించింది. 

తిరుపతి ఉప ఎన్నికలో అధికార వైసీపీ నేతలు అడ్డగోలుగా వ్యవహరించారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శించారు. బయట ప్రాంతాల నుంచి వేలాది మందిని తీసుకువచ్చి దొంగ ఓట్లు వేయించుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని అయ్యన్న పాత్రుడు చెప్పుకొచ్చారు. తిరుపతి ఉప ఎన్నికలో గెలుస్తామన్న ధీమా ఉంటే వైసీపీ భారీ ఎత్తున దొంగ ఓట్ల దందా ఎందుకు చేయాల్సి వచ్చిందని..  మంత్రిగా ఉండి ఇటువంటి పనికిమాలిన పనులు చేయడానికి సిగ్గులేదా అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ ఓట్ల దందాకు డీజీపీనే బాధ్యుడని.. ఇందుకు నైతిక బాధ్యత వహించి డీజీపీ సవాంగ్‌ తన పదవి నుంచి వైదొలగాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రపతి, గవర్నర్‌ కలుగచేసుకొని తిరుపతి పార్లమెంటు స్థానానికి రీ పోలింగ్‌కు ఆదేశించాలని అయ్యన్న కోరారు. తిరుపతి ఉప ఎన్నికలో భారీగా రిగ్గింగ్ చేశారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తూ ఉండగా.. గెలవలేక కావాలనే ఇలాంటి ఆరోపణలు టీడీపీ చేస్తోందని వైసీపీ నాయకులు అంటున్నారు. 

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   13 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   15 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   21 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   21 hours ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   19 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   18 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle