newssting
Radio
BITING NEWS :
తెలంగాణలో నేటి నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కు 1213 సెంటర్లు ఏర్పాటు. నిమ్స్ లో వ్యాక్సినేషన్ ను ప్రారంభించనున్న గవర్నర్ తమిళి సై. * దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ. 11 రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించినట్లు కేంద్రం ప్రకటన. * ఏపీ తమిళనాడు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల వివాదం. పర్మిట్, రికార్డులు సరిగ్గాలేవని బస్సులు సీజ్. * తెలుగు రాష్ట్రాలకు 19 మంది ఐఏఎస్ లను కేటాయించిన కేంద్రం. ఏపీకి 10 మంది, తెలంగాణకు 9 మంది ఐఏఎస్ ల కేటాయింపు. * కృష్ణాజిల్లా మాజీ ఎస్పీఓ నాగశ్రీను ఆత్మహత్యాయత్నం. నాగశ్రీను పరిస్థితి విషమం, గుంటూరు ఆస్పత్రికి తరలింపు. * మధురై అలాంగనల్లూర్ లో ప్రారంభమైన జల్లికట్టు పోటీలు. పోటీలను ప్రారంభించిన సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం. * కొత్త ప్రైవసీ విధానంపై వెనక్కితగ్గిన వాట్సాప్. కొత్త ప్రైవసీ విధానాన్ని మే 15 వరకూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన వాట్సాప్ యాజమాన్యం.

ఆదుకోండి మహాప్రభో

13-01-202113-01-2021 11:07:56 IST
Updated On 13-01-2021 11:55:42 ISTUpdated On 13-01-20212021-01-13T05:37:56.611Z13-01-2021 2021-01-13T05:35:16.072Z - 2021-01-13T06:25:42.146Z - 13-01-2021

ఆదుకోండి మహాప్రభో
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మాట‌లు కోట‌లు దాట‌డం అనే మాట విన్నాం క‌దా. కానీ వైసీపీ విష‌యంలో మాత్రం.. మాట‌లు కోట‌లు కాదు.. కోట్ల‌కి కోట్లు దాటుతాయి. కానీ.. అమ‌లు విష‌యంలో మాత్రం ప‌ట్టింపే ఉండ‌దు. ఎన్ని క‌ష్టాలు ప‌డుతున్నా.. ప్ర‌భుత్వం ప‌ట్టించుకుంటుంది అనే ఆశ పెట్టుకోవడం అంతా అమాయ‌క‌త్వ‌మే అనిపిస్తుంది ఏపీ ప్ర‌జ‌ల‌కి. ఇప్పుడిప్పుడే ఒక్కొక్క‌టిగా అర్దం అవుతోంది.

క‌ర్నూలు అంటే ట‌మాట‌.. ట‌మాట పంట అంటే క‌ర్నూలు అన్న‌ట్లుగా ఉంటుంది. ఎంత న‌ష్టం వ‌చ్చినా.. ప్ర‌తి ఒక్క‌రికీ మంచి ట‌మాట అందించాల‌ని అక్క‌డి రైతులు అంతా ట‌మాట పంట ఫుల్లుగా పండిస్తారు. కానీ.. వారికి ఎప్పుడూ రేటు మాత్రం గిట్ట బాటు కాదు. పెట్టుబ‌డులు, కూలీ ఖ‌ర్చులు అనే విష‌యాన్ని వ‌దిలేస్తే.. క‌నీసం మార్కెట్ కి తీసుకొచ్చే దారి ఖ‌ర్చులు కూడా రావు. వ‌చ్చిన లోడ్ వెన‌క్కి వెళ్ల‌లేదు అక్క‌డ ఉండ‌లేదు.. అమ్ముడు పోదు.. పోనీ పార‌బోసి పోదామంటే డీజిల్ ఖ‌ర్చులు కూడా రావు.

ఇదీ అక్క‌డి రైతుల ప‌రిస్థితి. మ‌రీ దారుణంగా.. పావ‌లా అద్దురూపాయి కేజీ అంటూ.. రైతుని అవమానించ‌డం కూడా క‌ర్నూలు ఏరియాలో మామూలే. కానీ.. రైతుల్నుంచి పంట ద‌ళారీల చేతికి పోగానే మాత్రం రేటు పెరుగుతుంది. వినియోగ దారులు ఇంటికి తీసుకెళ్లే టైంకి పంట రేటు భారీగానే ఉంటుంది. ఇటు రైతు.. అటు కొనుక్కునే వారు న‌ష్ట‌పోతారు. మ‌ధ్య‌లో ద‌ళారీలు ఫుల్లుగా సంపాదించుకుంటారు.

ఈ వ్య‌వ‌స్థ‌కి సొల్యూష‌న్ చూసుకోవ‌డం రైతుల‌తో అయ్యే ప‌ని కాదు. ప‌ట్టించుకుంటే ప్ర‌భుత్వంతో అవుతుంది. కానీ.. ప్ర‌భుత్వం ప‌ట్టించుకుంటుందా అన్న‌దే ప్ర‌శ్న‌. క‌ర్నూలు ట‌మాట గురించి.. అక్క‌డ రైతులపై జ‌రుగుతున్న దోపిడీల గురించి.. పార్టీల‌కీ ప్ర‌భుత్వాల‌కి తెలీదంటే న‌మ్మ‌డానికి ఎవ‌రూ రెడీగా లేరు. ఎన్ని ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నా ప‌ట్టించుకున్న పాపాన పోరు.

అందుకే.. రోడ్డుమీదే పార‌బోసి వెళ్తున్నారు రైతులు. అయినా స‌రే.. ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు గ‌ప్ చుప్ గా ఉంటారు. మ‌రి ముందు నుంచీ ఇస్తున్న హామీల మాటేమిటి సీఎం సార్ అంటే మాత్రం.. జ‌గ‌న్ ఉల‌క‌రు ప‌ల‌క‌రు. రేట్ల‌ని బ్యాలెన్సింగ్ చేయ‌డానికి 3 వేల కోట్లు కేటాయిస్తాం.. రైతుల‌కి రేట్ల విష‌యంలో ప్రాబ్లమ్ రాకుండా చూస్తాం అని.. ఎన్నిక‌ల‌కి ముందైతే పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు. మ‌రి ఇప్పుడు ఎందుకు నోరు మెద‌ప‌డం లేదో.. రెండేళ్ల‌వుతున్నా.. తీరిక దొర‌క‌డం లేదో అఎవ్వ‌రికీ అర్దం కావ‌డం లేదు.

వ్యాక్సిన్ తీసుకుంటానని చెప్పిన ఈటల.. కానీ కుదరలేదు ఎందుకంటే..!

వ్యాక్సిన్ తీసుకుంటానని చెప్పిన ఈటల.. కానీ కుదరలేదు ఎందుకంటే..!

   8 hours ago


కొత్త విగ్రహాల తయారీకి ఆయన డబ్బు ఇస్తే తీసుకోని ప్రభుత్వం

కొత్త విగ్రహాల తయారీకి ఆయన డబ్బు ఇస్తే తీసుకోని ప్రభుత్వం

   9 hours ago


కేసుతో సంబంధమే లేదంటున్న అఖిలప్రియ..?

కేసుతో సంబంధమే లేదంటున్న అఖిలప్రియ..?

   9 hours ago


మమతకు మహిళా ఎంపీ షాక్.. భవిష్యత్తు నిర్ణయంపై సంచలన పోస్టు

మమతకు మహిళా ఎంపీ షాక్.. భవిష్యత్తు నిర్ణయంపై సంచలన పోస్టు

   14 hours ago


వ‌ర‌స్ట్ సీఎంల‌లో కేసీఆర్ ది నాలుగో ప్లేస్.. సి ఓటర్ సర్వే

వ‌ర‌స్ట్ సీఎంల‌లో కేసీఆర్ ది నాలుగో ప్లేస్.. సి ఓటర్ సర్వే

   15 hours ago


అబద్దాలు ఎప్పట్నుంచి మొదలెట్టావు రాహుల్... తోమర్ ఎద్దేవా

అబద్దాలు ఎప్పట్నుంచి మొదలెట్టావు రాహుల్... తోమర్ ఎద్దేవా

   17 hours ago


మైహోంపై దాడుల వెనుక ఒత్తిడి తెచ్చిన నేత ఎవరు?

మైహోంపై దాడుల వెనుక ఒత్తిడి తెచ్చిన నేత ఎవరు?

   17 hours ago


దాడులలో టీడీపీ-బీజేపీ నేతలు.. డీజీపీ పక్కా పొలిటికల్ స్టేట్మెంట్

దాడులలో టీడీపీ-బీజేపీ నేతలు.. డీజీపీ పక్కా పొలిటికల్ స్టేట్మెంట్

   18 hours ago


ముద్రగడ ఇంటికి సోము.. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు?

ముద్రగడ ఇంటికి సోము.. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు?

   19 hours ago


క్రిస్టియానిటీ అంశం తెరమీదకి తెచ్చి జగన్ కు మంచే చేశారా?

క్రిస్టియానిటీ అంశం తెరమీదకి తెచ్చి జగన్ కు మంచే చేశారా?

   19 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle