newssting
Radio
BITING NEWS :
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో 55.69 శాతం పోలింగ్‌ నమోదైనట్టు తెలిపిన ఎన్నికల కమిషన్‌. కరోనా వైరస్‌ భయాలు ఉన్నప్పటికీ పోలింగ్‌ మాత్రం ఇంతకు ముందుకన్నా ఎక్కువే నమోదైనట్టు తెలుస్తోంది. తొలి దశలో 16 జిల్లాల్లో విస్తరించిన 71 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగగా సంబంధిత నియోజకవర్గాల్లో గతంలోకంటే ఈసారి పోలింగ్ శాతం అధికంగా నమోదు * తమ పార్టీ తరఫున బరిలో నిలిచిన రాంజీ గౌతమ్‌ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఏడుగురు ఎమ్మెల్యేలను బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. కీలకమైన రాజ్యసభ ఎన్నికల సమయంలో ఎస్పీ తీర్థం పుచ్చుకోవడానికి వీరు ప్రయత్నిస్తున్నట్టు తెలియగానే ఆమె ఈ నిర్ణయం తీసుకొన్నారు * కార్మిక నాయకుడు, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ముఖ్య సహచరుడు ఎస్‌.బీ మోహన్‌రెడ్డి(78) గురువారం తెల్లవారుజామున మరణించారు. ఆరునెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్‌ రెడ్డి ఆరోగ్యం విషమించగా ఆంధ్రమహిళా సభ దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు * జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని వైకే పొరా ప్రాంతంలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులు జరిపి ముగ్గురు స్థానిక బీజేపీ నేతల ప్రాణాలు తీశారు. పాకిస్థాన్‌ ఇంటెలిజన్స్‌ ఏజెన్సీ మద్దతున్న రెసిస్టంట్‌ ఫ్రంట్‌ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యతవహిస్తూ ప్రకటన చేసిందని పోలీసులు చెప్పారు * తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్‌ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున పెళ్లి బృందానికి చెందిన మినీ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు * డోసుల కొరత కారణంగా.. స్పుత్నిక్‌-వి టీకా మూడో దశ ట్రయల్స్‌ను రష్యా తాత్కాలికంగా నిలిపివేసింది. నవంబరు 10వ తేదీ నుంచి ట్రయల్స్‌ను పునరుద్ధరించనున్నారు. గమలేయా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, రష్యన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి టీకాను రష్యా ఆగస్టు నెలలో నమోదు చేసింది * మద్యం ధరలను క్రమబద్ధీకరిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. సవరించిన ధరలు ప్రీమియం, మీడియం బ్రాండ్లకు వర్తించేలా ఉత్తర్వులిచ్చింది. ఇవి శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో పేర్కొంది * మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలు, ర్యాలీ సందర్భంగా పాతబస్తీలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.

బ్రేకింగ్ : కరోనా మృతదేహాల వద్ద కనిపించని నగలు, సెల్ఫోన్లు

25-09-202025-09-2020 17:06:44 IST
Updated On 25-09-2020 17:27:01 ISTUpdated On 25-09-20202020-09-25T11:36:44.880Z25-09-2020 2020-09-25T11:36:41.063Z - 2020-09-25T11:57:01.465Z - 25-09-2020

బ్రేకింగ్ : కరోనా మృతదేహాల వద్ద కనిపించని నగలు, సెల్ఫోన్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

కరోనా పేషెంట్లకు మెరుగైన చికిత్స చేస్తామని చెప్తూ.. లక్షల్లో ఫీజులు వసూలు చేసి ఆఖరికి '' సారీ పరిస్థితి చేయి దాటిపోయింది '' అని చెప్పడం కార్పొరేట్ ఆస్పత్రులకు పరిపాటిగా మారింది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు కరోనాతో చనిపోయిన వారి బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లను సైతం మాయం చేస్తున్నారు సిబ్బంది. తాజాగా తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో ఇలాంటి ఘటన వెలుగుచూసింది. 

10 రోజుల క్రితం చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లెకి చెందిన వెంకటరత్నం నాయుడు  కరోనా లక్షణాలు కనిపించడంతో నిర్థారణ పరీక్షలు చేయించుకున్నారు. పాజిటివ్ అని తేలడంతో చికిత్స నిమిత్తం తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందాడు వెంకటరత్నం. తండ్రి చనిపోయాడన్న విషయం తెలుసుకున్న కొడుకు, ఇతర కుటుంబ సభ్యులు ఆయనను చూసేందుకు ఆస్పత్రికి వచ్చారు. 

మృతదేహాన్ని చూసిన కొడుకు మహేష్ తన తండ్రి చేతి వేళ్లకు, ఒంటిపై ఉండాల్సిన బంగారు ఆభరణాలు లేకపోవడంతో ఖంగుతిన్నాడు. అనుమానం వచ్చిన అతను ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బందిని ప్రశ్నించగా తమకేమీ తెలియదన్నట్లే చెప్పుకొచ్చారు. సీసీ టీవీ ఫుటేజీల్లో వెంకటరత్నం ఆస్పత్రిలో చేరిన సమయంలో శరీరంపై బంగారు ఆభరణాలున్నట్లు గుర్తించారు. అలాగే మృతుడి చేతివేళ్లకున్న ఉంగరాలను సిబ్బంది దొంగిలిస్తున్న దృశ్యాలు సైతం అందులో రికార్డయ్యాయి. 

కరోనా చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన పేషెంట్ల పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా ? అంటూ బాధిత కుటుంబీకులు వాపోయారు. మానవత్వం మరిచిపోయి మృతదేహాలపై ఉండాల్సిన బంగారు నగలు, సెల్ఫోన్లను దొంగిలించడం దారుణమన్నారు. స్విమ్స్ ఆస్పత్రిలో ఇదొక్కటే కాకుండా ఇంకా చాలా జరిగే ఉంటాయని, బాధిత కుటుంబ సభ్యులు పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల అవన్నీ వెలుగులోకి రాలేదని చెప్తున్నారు పేషెంట్లు. ఏదేమైనా కరోనా మృతుల పట్ల ఇంత దారుణంగా వ్యవహరించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వెంకటరత్నం నాయుడు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. 

 

 

 


Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle