newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!

14-04-202114-04-2021 08:07:50 IST
Updated On 14-04-2021 11:43:08 ISTUpdated On 14-04-20212021-04-14T02:37:50.358Z14-04-2021 2021-04-14T02:37:40.462Z - 2021-04-14T06:13:08.624Z - 14-04-2021

పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఉగాది అంటే.. పంచాంగం, జాతకాలు..! పలువురు స్వామీజీలు పంచాంగ శ్రవణం చేసి.. ఆ తర్వాత పలువురు నాయకుల భవిష్యత్తును గురించి చెబుతూ ఉంటారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి కూడా ప్రతీ ఏడాది పంచాంగ శ్రవణం చేస్తూ ఉంటారు. తాజాగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగాది పండుగ సందర్భంగా శారదాపీఠంలో వేడుకలు ఘనంగా జరిగాయి. గంటల పంచాంగాన్ని స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రలు ఆవిష్కరించారు. స్వరూపానందేంద్ర మాట్లాడుతూ, శార్వరి, వికారిలా కాకుండా ప్లవ నామ సంవత్సరంలో అంతా మంచే జరుగుతుందని కోరుకుందామని అన్నారు. మండే ఎండలు కాసినా.. వానలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండుతాయి. జూలై వరకు కరోనా పట్టి పీడిస్తుంది. కరోనాను పారదోలేందుకు ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ.. ఇల్లే దేవాలయంగా ఇష్టదైవాన్ని ఆరాధించాలని సూచించారు. 

శ్రీ ప్లవ నామ సంవత్సరంలో.. సేనాధిపతి కుజుడు కావడంతో దేశంలో యుద్ధ వాతావరణం నెలకొంటుందని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. పెద్ద నాయకుడికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని చెప్పారు. తెలుగు రాష్ర్టాలపై గ్రహాల అనుకూలత తక్కువగా ఉన్నా.. ముఖ్య మంత్రులు జగన్‌, కేసీఆర్‌ జాతకాలు బాగుండడం కొత్త సంవత్సరంలో శుభ పరిణామమని పేర్కొన్నారు. విశాఖ చినముషిడివాడలోని శారదాపీఠంలో మంగళవారం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర అనుగ్రహ భాషణ చేశారు. తెలుగు రాష్ట్రాలకు ఆర్థిక ఇబ్బందులు ఉండవని, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతాయన్నారు. గ్రహాల అనుకూలతలు లేకున్నా ఇరు తెలుగు రాష్ట్రాలకు మంచి జరుగుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది ఓ పెద్ద నేతకు ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని స్వరూపానందేంద్ర జోస్యం చెప్పారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ ల జాతకాలు బాగున్నాయని చెప్పిన ఆయన ఏపీకి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండబోవని చెప్పారు.

స్వరూపానందేంద్ర చెప్పిన జోస్యంపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఇబ్బందులు ఎదుర్కోబోతున్న ఆ పెద్ద నేత ఎవరనే విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇంతకూ ఆ నేత ఎవరు అన్నది ఆయన ఎలాగూ చెప్పరు కాబట్టి.. ఎవరికి వారు ఊహించేసుకుంటున్నారు. 

గుడ్ న్యూస్.. ఏపీ అంబులెన్స్ లకు అనుమతి ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం

గుడ్ న్యూస్.. ఏపీ అంబులెన్స్ లకు అనుమతి ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం

   7 minutes ago


రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

   30 minutes ago


రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

   41 minutes ago


జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   15 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   17 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   21 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   20 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle