విగ్రహాల ధ్వంసం ప్రతిపక్షాల కుట్ర... జగన్ కి చెడ్డ పేరు తేవడానికే...
04-01-202104-01-2021 07:36:08 IST
Updated On 04-01-2021 11:18:45 ISTUpdated On 04-01-20212021-01-04T02:06:08.899Z04-01-2021 2021-01-04T02:06:04.396Z - 2021-01-04T05:48:45.246Z - 04-01-2021

అటు తిరిగి ఇటు తిరిగి రామతీర్థం ఇష్యూ ఎటు పోతుందో ఎవ్వరికీ అర్దం కావడం లేదు. లేటెస్ట్ గా హీరో సుమన్ కొత్త కాంట్రవర్సీ తీసుకొచ్చాడు. కొత్త కాంట్రవర్సీ ఏం కాదు కానీ.. ఏదేదో మాట్లాడి ఇంకేదో చెప్పబోయి.. జనం చేత అవునా నిజమా సుమన్ సార్ అనిపించుకుంటున్నారు. తిరుమల దేవస్థానానికి శ్రీవారి దర్శనానికి వెళ్లిన సుమన్.. మీడియాతో మాట్లాడారు. ఏంటి సార్.. విగ్రహాల ధ్వంసం గురించి ఏమంటారు అంటే.. తన అభిప్రాయాన్ని సూటిగా సుత్తి లేకుండా చెప్పే ప్రయత్నం చేశారు. కాకపోతే.. సుమన్ ఎంత సూటిగా చెప్పారో అర్దం అవుతుందిలే అంటున్నారు ఏపీ జనాలు. ఆలయాలను మోడీ రక్షించాలి అంటారు. సీఎం జగన్ రక్షించాలి అంటారు. ప్రభుత్వం శిక్షించాలి అంటారు.. దేవుడు శిక్షిస్తాడు అంటారు. ప్రతి పక్షాలే తప్పు చేశాయి అంటారు. దేవుడే చూసుకుంటాడు అంటారు. ఏంటేంటో అన్నారు. డిప్లమాటిక్ ఆన్సర్ ఇచ్చే ప్రయత్నంలో అసలు ఆన్సర్ ఏంటో క్లారిటీ లేకుండా చేశాడు హీరో సుమన్. నిజమే దేవుడు గొప్పోడు విగ్రహాలు ధ్వంసం చేయకూడదు. ఇదొక్కటే సుమన్ తో అంగీకరించే విషయం. మొత్తానికైతే తప్పు ప్రతిపక్షాల మీద నెట్టే ప్రయత్నం చేశాడు సుమన్. అనవసరంగా ప్రతి పక్షాలు రాద్దాంతం చేస్తున్నాయి అన్నాడు. ప్రభుత్వంపై నెట్టకూడదు అన్నాడు. ప్రతి పక్షాలు ఎవరు తప్పు చేశారో తెలియకుండా ఉండేందుకు ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటున్నారు అన్నాడు హీరో సుమన్. అలాగే.. కోట్ల మంది మనోభావాలతో ముడిపడ్డ విషయం కాబట్టి.. ఆలయాల భద్రత మోడీ తీసుకోవాలి అన్నారు. తర్వాత మళ్లీ జగన్ తీసుకోవాలి అన్నారు. శిక్షించే విషయం కూడా.. కేంద్ర ప్రభుత్వం, అలాగే రాష్ట్ర ప్రభత్వం తీసుకోవాలి అన్నారు. ఫైనల్ గా అయితే.. ప్రభుత్వం తప్పేమీ లేదు.. జగన్ తప్పు కానీ.. జగన్ సర్కార్ తప్పు కానీ.. ఏం లేదు అన్నట్లు చెప్పుకొచ్చారు హీరో సుమన్. సీసీ కెమెరాలు గట్రా పెడితే ఇలాంటి సమస్యలు రావు అంటూ.. ఉత్తమ సలహా ఇచ్చే ప్రయత్నం చేశాడు హీరో సుమన్. అది సరెలే కానీ.. మరి సినిమాల పరిస్థితి ఏంటి సార్ అంటే.. ఇప్పుడిప్పుడు థియేటర్లు ఓపెన్ అవుతున్నయ్.. షూటింగులు స్టార్ట్ అవుతున్నయ్. పూర్తిగా సెట్ రైట్ కావడానికి మూడు నుంచి ఆరు నెలల టైం పడుతుంది అన్నారు. ఈ విషయాన్ని మాత్రం క్లారిటీగా చెప్పాడు సుమన్ అంటున్నారు జనాలు

అమిత్ షాతో ముగిసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ
3 hours ago

తిరుమలలో నిన్న పందులు.. నేడు దొంగలు.. ఏంది సార్ ఇది
4 hours ago

ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్.. ఎలాంటి రాజకీయ కారణాలు లేవంటున్న సజ్జల
5 hours ago

దేవినేని ఉమ విడుదల..!
8 hours ago

ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.. ఎవరెవరు ఉన్నారంటే..!
8 hours ago

'దీదీ'ని ఓడించకపోతే రాజకీయాల్లోంచే తప్పుకుంటా.. సువేందు
8 hours ago

ఏ పార్టీలో అయినా చేరండి.. కానీ రాజీనామా చేయండి.. రజనీ మక్కల్ మన్రం
10 hours ago

బలమేంటో తెలీదా.. లేదంటే బలమే లేదా
12 hours ago

మతం పేరు వర్కవుట్ అవుతుందా.. తెలుగోళ్లు పట్టించుకుంటారా
14 hours ago

ఉన్నదే ముచ్చటగా ముగ్గురు నలుగురు.. మళ్లీ అందులో గ్రూపులా
15 hours ago
ఇంకా