newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

22-04-202122-04-2021 11:13:46 IST
Updated On 22-04-2021 10:31:07 ISTUpdated On 22-04-20212021-04-22T05:43:46.400Z22-04-2021 2021-04-22T03:08:59.239Z - 2021-04-22T05:01:07.469Z - 22-04-2021

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అర్రే.. జనాలు చ‌స్తున్నారు. భ‌యంతో వ‌ణుకుతున్నారు. ప‌నులు లేక జాబులు పోయి.. ఏం చేయాలో అర్దం కావ‌డం లేదు. మ‌రి ఇలాంట‌ప్పుడే క‌దా ప్ర‌భుత్వాలు ఆదుకోవాల్సింది. మ‌రి మామూలు టైంలో చేసేదేంటి. జ‌నాలు ప‌న్నులు క‌డుతుంటే.. వాటిని  కొంప‌ల్లో దాచుకుని కోట్లు కోట్లు కూడ‌బెట్టుకోవ‌డానికి. అహ మామూలు టైంలో ప్ర‌భుత్వాలు ఏం చేస్త‌య్. జ‌నం ప‌న్ను క‌డ‌త‌రు. వాటిని ఉద్యోగ‌స్తుల‌కి జీతాలిస్త‌రు. జ‌నాల కోసం ఖ‌ర్చు పెడ‌త‌రు. లీడ‌ర్లు ఏ మాత్రం దోచుకుంటారో తెలిసిందే క‌దా. అవ‌న్నీ జ‌నం డ‌బ్బుల్నే అటూ ఇటూ తిప్పుతారు.

అంటే జ‌నం డ‌బ్బుని ప్ర‌భుత్వం మేనేజ్ చేస్తుంది. దేనికెంత ఖ‌ర్చు పెట్టాలి అనే ప‌ని చూస్తుంది. మ‌రి దాచుకుంటుంది క‌దా ప్ర‌భుత్వం. స‌హ‌జ వ‌న‌రుల నుంచి వంద‌లు వేల కోట్లు వ‌స్తుంట‌య్ క‌దా. అవ‌న్నీ దోచుకునేవి దోచుకోగా  దాచుకోవాల్సిన‌వి ఉంట‌వి క‌దా. వాటి నుంచి.. ఇలాంటి టైంలో జ‌నం కోసం ఖ‌ర్చు పెట్టాలి. ఇంట్లో ఫ్యామిలీ మెంబ‌ర్స్ కి ఎప్పుడు ఎలాంటి క‌ష్టం వ‌స్తుందో అని.. ఇంటి పెద్ద కాసిన్ని డ‌బ్బులు దాచి పెట్టి.. ట‌యానికి వాటిని తీసి వాడ‌తాడు. అలాగే ప్ర‌భుత్వం కూడా చేయాలి.

కానీ.. కేంద్ర ప్ర‌భుత్వం ఏం చేస్తుంది. జ‌నాలు ఫుల్ గా ప‌న్నులు క‌ట్టిన‌ప్పుడేమో.. పెద్ద ఫోజులు కొట్టింది. ఇప్పుడు క‌ష్టాల్లో ఉంటే చేతులెత్తేస్తుంది. 45  ఏళ్లు నిండిన వారికి ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చిన‌.. 18 ఏళ్లు నిండిన వారికి మాత్రం ఇవ్వ‌డం లేదు. సింపుల్ గా చెప్పాలంటే చేతులెత్తేసింది. ఇక రాష్ట్ర ప్ర‌భుత్వాల మాటేంటి అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు... కొన్ని రాష్ట్రాలు నేరుగా వ్యాక్సిన్ కొని.. జ‌నాల‌కి పంచుతున్న‌య్. 18 ఏళ్లు నిండిన ప్ర‌తి వారికీ వ్యాక్సిన్ ఫ్రీ అంటోంది. కేంద్ర ప్ర‌భుత్వం చేతులెత్తేసినా.. వ్యాక్సిన్ ను మా చేతుల్తో ఫ్రీగా ఇస్తాం అంటోంది.

లాక్ డౌన్ అంతిమ ఆయుధమే.. రాష్ట్రాలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి

ఉత్త‌ర ప్ర‌దేశ్‌, మ‌ధ్య ప్ర‌దేశ్, అస్సాం, చ‌త్తీస్ గ‌ఢ్ రాష్ట్రాలు వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తాం అంటున్నాయి. మిగ‌తా రాష్ట్రాల్లో మాత్రం 18 ఏళ్లు నిండిన ప్ర‌తి వారూ.. వ్యాక్సిన్ వేయించుకోవ‌చ్చు కానీ.. కొనుక్కోవాలి. వ్యాక్సిన్ ని బ‌ట్టి.. రేట్లు వందల్లోనే ఉన్న‌య్. మ‌రి మ‌న తెలుగు రాష్ట్రాలు ఏం చేస్త‌య్. క‌రోనా వ‌చ్చిన ఏ మొన‌గాడు అయినా.. గాంధీకి పోవాల్సిందే అన్న సీఎం కేసీఆర్.. ఇప్పుడు య‌శోధ‌కి చెక‌ప్ ల‌కి వెళ్లారు. ప‌ర్స‌న‌ల్ గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మ‌రి వ్యాక్సిన్ ప‌రిస్థితి ఏంటి సార్ అంటే.. ఏం చెబుతారో ఏమో. త‌న‌కైతే ప‌ర్స‌న‌ల్ ఎక్స్ పీరియ‌న్స్ ఉంది కాబ‌ట్టి.. అలాంటి క‌ష్టం ఏ ఒక్క‌రికీ రాకూడ‌దు అని.. అంద‌రికీ వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తం అంటారా లేదా అన్న‌ది ఇంట్ర‌స్టింగ్ పాయింట్. ఇక జ‌గ‌న్ గురించి తెలిసిందే క‌దా. అన్న కేసీఆర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారా అని చూస్తుంటారు. దాన్ని బ‌ట్టి.. జ‌గ‌న్ కూడా ఫ్రీగా ఇవ్వాలా లేదా అన్న‌ది డిసైడ్ చేసుకుంటారు కావ‌చ్చు.

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   13 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   15 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   21 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   21 hours ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   19 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   18 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle