newssting
Radio
BITING NEWS :
భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌ స్‌పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. * ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాకింగ్‌ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ఆరోపణల పరంపరంపై బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్దన్‌ రాథోడ్‌ ఘాటుగా స్పందించారు. ఫోన్‌ నిజంగా హ్యాకింగ్‌ అయ్యిందని రాహుల్‌ గాంధీ భావిస్తే దర్యాప్తు కోసం అదే ఫోన్‌ను సమర్పించే దమ్ముందా? అని సవాలు విసిరారు. * కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. * రాష్ట్రంలో వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవాలని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసై టీ (ఐఆర్‌సీఎస్‌) ప్రతి నిధులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. రాజ్‌భవన్‌ అధికారులు కూడా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా బాధితులకు సాయం అందేలా కృషి చేయాలని ఆమె ఆదేశించారు. * కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్‌, అందుకే అంతగా ఆ రోల్‌లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్‌ తెలిపారు.

సోనూసూద్ సేవలు.. ఎపి రాజకీయాలలో దుమారం..

14-06-202114-06-2021 09:40:37 IST
2021-06-14T04:10:37.397Z14-06-2021 2021-06-14T04:10:31.987Z - - 25-07-2021

సోనూసూద్ సేవలు.. ఎపి రాజకీయాలలో దుమారం..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల కోసం తనవంతు సహాయాన్ని అందిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన సోనూసూద్ ఇప్పటికీ తన సహాయ కార్యక్రమాలని నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఉన్నారు. కరోనా బాధితులు తమని ఆదుకోవాలని అడగడమే ఆలస్యం వారికి కావలసినవి సమకూరుస్తున్నారు. అతడి నుంచి సాయం పొందిన వాళ్లలో తెలుగువాళ్లు సైతం చాలా మందే ఉన్నారు. తెలుగు సినిమాలలో విలన్ పాత్రల ద్వారా తెలుగు వారికి పరిచయమైన సోనూసూద్ ఇక్కడి ప్రజలపై తన అభిమానాన్ని వీలయినప్పుడల్లా బాహాటంగానే ప్రకటిస్తారు. ఏపీ, తెలంగాణలను తన సెకండ్ హోమ్ అంటూ ఇక్కడి వారిపై ప్రత్యేక ప్రేమని వ్యక్తం చేస్తుంటాడు. అయితే ఇప్పుడు సోనూసూద్ చేసిన సేవా కార్యక్రమాల ద్వారా ఎపి రాజకీయాలలో చిన్న కుదుపు వచ్చింది. 

తాజాగా సోనూసూద్ ఎపి ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పొగడ్తలతో ముంచెత్తారు. దీనికి చంద్రబాబు సైతం సోనూసూద్ ప్రశంసించారు. ఈ విషయం లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు రుసరుసలాడుతున్నట్లుగా తెలుస్తోంది. అంతే కాదు  ఏపీలో రెండు ఆక్సిజన్ ప్లాంట్లు పెడతానని సోనూసూద్ ప్రకటించడం కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకి కోపం తెప్పిస్తోంది. సోనూసూద్ ఏర్పాటు చేసే ఆక్సిజన్ ప్లాంట్ల ద్వారా ఎక్కడ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందోనని వారు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. అందుకే సోనూసూద్ మీద వైకాపా సోషల్ మీడియా టీం ఎటాక్ మొదలుపెట్టింది. సోషల్ మీడియాలో సోనూసూద్ పై నెగిటివ్ పోస్ట్ లు పెట్టడం ప్రారంభించింది. అయితే సోనూసూద్ ని రాజకీయ పార్టీలు విమర్శించడం కొత్తేమీ కాదు, సోనూ సేవా కార్యక్రమాలపై ఇప్పటికే బిజెపి, శివసేన పార్టీలు సైతం విమర్శల దాడికి దిగాయి. సోనూ పబ్లిసిటీ కోసం మాత్రమే ఇవన్నీ చేస్తున్నాడని ఒకరికి సహాయం అందించి వందమందికి సహాయం చేసినట్లుగా ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్నాడని ఆరోపించాయి. తనపై వచ్చిన విమర్శలని పట్టించుకోకుండా తానూ చేస్తున్న సేవాకార్యక్రమాలని చేసుకుంటూ వెళ్తున్నారు సోనూసూద్. కాగా సోనూ టిడిపి అధినేత పై అనుకూల కామెంట్లు చేయడం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు సోనూసూద్ పై నెగిటివ్ ప్రచారం మొదలు పెట్టడంతో ఈ పరిణామం ముందు ముందు ఎపి రాజకీయాలలో ఎలాంటి దుమారం రేపుతుందో అన్న భావన విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

ఏలూరులో 50 డివిజన్లలో 47 డివిజన్లు గెలిచి కార్పొరేషన్‌ సొంతం చేసుకున్న వైసీపీ

ఏలూరులో 50 డివిజన్లలో 47 డివిజన్లు గెలిచి కార్పొరేషన్‌ సొంతం చేసుకున్న వైసీపీ

   3 hours ago


కర్ణాటక తరువాత ముఖ్యమంత్రి ఎవరు..?

కర్ణాటక తరువాత ముఖ్యమంత్రి ఎవరు..?

   10 hours ago


మాజీ టీడీపీ నేతలపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి

మాజీ టీడీపీ నేతలపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి

   10 hours ago


ఏపీ లో మళ్ళీ పదవుల పండుగ

ఏపీ లో మళ్ళీ పదవుల పండుగ

   11 hours ago


టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్ష

టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్ష

   a day ago


వైఎస్ వివేకానంద హత్య కేసులో మరో ట్విస్ట్.. అరెస్ట్ చేయొద్దంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్

వైఎస్ వివేకానంద హత్య కేసులో మరో ట్విస్ట్.. అరెస్ట్ చేయొద్దంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్

   24-07-2021


మంత్రి కేటిఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

మంత్రి కేటిఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

   24-07-2021


కోట్లాది మంది దళిత బిడ్డలకు అండగా నేనుంటా..

కోట్లాది మంది దళిత బిడ్డలకు అండగా నేనుంటా..

   24-07-2021


ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా ఈటల ప్రధాన అనుచరుడు

ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా ఈటల ప్రధాన అనుచరుడు

   24-07-2021


AP Inter Second Year Results 2021: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ

AP Inter Second Year Results 2021: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ

   23-07-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle