newssting
Radio
BITING NEWS :
నేడు ఏపీలో సీఎం జగన్ ఏరియల్ సర్వే. నివర్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తున్న సీఎం. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో సీఎం సర్వే. సర్వే అనంతరం తిరుపతిలో అధికారులతో సమీక్ష. * ఏపీలో రెండ్రోజులపాటు కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి 465 మూగజీవాలు మృత్యువాత. * తుఫాన్ కారణంలో ఏపీలో 2,14,420 హెక్టార్లలో పంటనష్టం. 11 జిల్లాల్లో లక్షా 89 వేల హెక్టార్లలో దెబ్బతిన్న వరి. 13 వేల హెక్టార్లలో మినుము, 5 వేల హెక్టార్లలో పత్తి పంటలకు నష్టం.

సీఎం జగన్‌ సామాజిక న్యాయ సంరక్షకుడు.. పీఎంకే అధినేత రామదాస్ ప్రశంస

25-10-202025-10-2020 11:21:17 IST
Updated On 25-10-2020 11:22:26 ISTUpdated On 25-10-20202020-10-25T05:51:17.157Z25-10-2020 2020-10-25T05:51:15.335Z - 2020-10-25T05:52:26.507Z - 25-10-2020

సీఎం జగన్‌ సామాజిక న్యాయ సంరక్షకుడు.. పీఎంకే అధినేత రామదాస్ ప్రశంస
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి 56 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు ద్వారా నిజమైన సామాజిక విప్లవానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంకురార్పణ చేశారని తమిళనాడుకు చెందిన పట్టలి మక్కల్‌ కచ్చి (పీఎంకే) వ్యవస్థాపక నేత ఎస్‌ రామదాస్‌ ప్రశంసించారు. 56 కార్పొరేషన్లలో 29 కార్పొరేషన్లకు మహిళలను చైర్మన్లుగా నియమించడంతో పాటు, 50% డైరెక్టర్‌ పదవులను మహిళలకు కేటాయించడం అభినందనీయమని అన్నారు. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్‌కు ‘ఆంధ్రప్రదేశ్‌ సామాజిక న్యాయ సంరక్షకుడు’ అనే బిరుదును తాను ప్రదానం చేస్తున్నానని రామదాస్‌ తెలిపారు. ఈ మేరకు సీఎంకు శనివారం ఆయన ఒక లేఖ రాశారు. 

‘మీరు తీసుకుంటున్న చర్యలు బీసీ వర్గాలకు ఎంతగానో ఉపయోగపడతాయి. సామాజికాభివృద్ధి సాధించే దిశగా సామాజిక న్యాయాన్ని నిలబెట్టేందుకు మీరు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు. ప్రగతిశీల ఆలోచనల పేరుతో సమాజంలో నకిలీ రాజకీయ మర్యాదల సంస్కృతి, వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కొందరు కులాన్ని ఒక తిరోగమన సంకేతంగా చూస్తున్నారు. కానీ మీరు.. కులాన్ని సామాజిక న్యాయ సాధనకు పునాదిగా చూస్తున్నారు. కులాభివృద్ధిని రాష్ట్రాభివృద్ధికి ఒక సూచికగా మీరు పరిగణిస్తున్నారు. నిజమైన విప్లవం అంటే ఇదే. 

ఈ చర్య ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ‘సామాజిక న్యాయ సంరక్షకుడు’ స్థాయికి మీరు ఎదిగారు. ఈ సందర్భంగా మీకు (సీఎం వైఎస్‌ జగన్‌కు) ‘ఆంధ్రప్రదేశ్‌ సామాజిక న్యాయ సంరక్షకుడు’ అనే బిరుదును ప్రదానం చేస్తున్నందుకు ఎంతగానో గర్విస్తున్నాను.. ఆనందిస్తున్నాను.’ అని రామదాస్‌ తన లేఖలో పేర్కొన్నారు.  

పేదరికం నుంచి బీసీ వర్గాలకు విముక్తి...

‘ఉన్నతమైన ఆలోచనలు రాజును ఉన్నతుడిగా చేస్తాయి’ అనే తమిళ రచయిత్రి అవ్వయార్‌ కవితను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. మీరు ఆమె ఆశయాలను ఆచరణలో పెడుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. 30 వేల జనాభా గల కులాల వారికి సైతం ఒక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడం.. అంత తక్కువ సంఖ్యలో ఉన్నవారి అవసరాలను కూడా గుర్తించి పరిష్కరించడం కోసమేనన్నది స్పష్టమవుతోంది. ఐదేళ్లలో ఈ కార్పొరేషన్లకు రూ.75,000 కోట్లు ప్రభుత్వం నుంచి అందడం అంటే ఇది కేవలం వారి సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు మాత్రమే కాదు, వారి ఆర్థిక వికాసం కోసం తీసుకుంటున్న చర్యలని చెప్పాలి. 

అంతేకాదు 45 ఏళ్లు దాటిన బీసీ మహిళలకు కూడా మీరు ఇస్తున్న రూ.18,750ల సాయం వారిని ఆర్థిక స్వావలంబన దిశగా అభివృద్ధి చేస్తాయి. అలాగే 2024 నాటికి ఏపీని మద్య రహిత రాష్ట్రంగా చేసేందుకు మీరు తీసుకుంటున్న చర్యలు కూడా అద్భుతంగా ఉన్నాయి. మీరు చేపట్టిన ఇలాంటి చర్యల వల్ల మరి కొన్నేళ్లలో రాష్ట్రంలోని బీసీ వర్గాలు పేదరికం నుంచి, రుణాల ఊబి నుంచి బయట పడతాయని మేం విశ్వసిస్తున్నాం. వివిధ కులాల వారీగా కార్పొరేషన్ల ఏర్పాటు మీ ముందు చూపునకు నిదర్శనంగా భావిస్తున్నాం..’ అని రామదాస్‌ తెలిపారు.    

మొత్తానికి తెలుగు రాష్ట్రాల పాలకులను తమిళనాడు రాజకీయ నేతలు ప్రశంసించడం చాలా ఆరుదైన ఘటన. పీఎంకే వ్యవస్థాపక నేత రామదాస్ సీఎం జగన్‌ని సామాజిక న్యాయ సంరక్షకుడు అని ప్రశంసల వర్షం కురిపించడంతో వైకాపా నేతలు, కార్యకర్తలు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

 

కేసీఆర్ మాయాజాలం..జనానికి పూనకం

కేసీఆర్ మాయాజాలం..జనానికి పూనకం

   an hour ago


రేవంత్ సుడిగాలి ప్రచారం.. కష్టానికి ఫలితం ఢిల్లీ నుండి వస్తుందా?!

రేవంత్ సుడిగాలి ప్రచారం.. కష్టానికి ఫలితం ఢిల్లీ నుండి వస్తుందా?!

   14 hours ago


టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుంది.. బండి సంజయ్

టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుంది.. బండి సంజయ్

   15 hours ago


యూటర్న్ తీసుకున్న పవన్ కళ్యాణ్ పై తమిళ మీడియా సెటైర్లు

యూటర్న్ తీసుకున్న పవన్ కళ్యాణ్ పై తమిళ మీడియా సెటైర్లు

   15 hours ago


మోదీ పర్యటన.. రేవంత్ రెడ్డి అభ్యంతరం

మోదీ పర్యటన.. రేవంత్ రెడ్డి అభ్యంతరం

   19 hours ago


జనసేన వర్సెస్ ధర్మపురి అరవింద్.. ఈ గొడవ ఎక్కడి దాకా వెళుతుందో

జనసేన వర్సెస్ ధర్మపురి అరవింద్.. ఈ గొడవ ఎక్కడి దాకా వెళుతుందో

   19 hours ago


ప్ర‌కాశ్ రాజ్.. ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకో బిడ్డా- నాగ‌బాబు సీరియ‌స్

ప్ర‌కాశ్ రాజ్.. ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకో బిడ్డా- నాగ‌బాబు సీరియ‌స్

   20 hours ago


ఎన్నిక‌ల్లో అన్ని పార్టీల‌కూ ఆ ఒక‌టే భ‌యం.. ప‌రిష్కారం ఏంటి..?

ఎన్నిక‌ల్లో అన్ని పార్టీల‌కూ ఆ ఒక‌టే భ‌యం.. ప‌రిష్కారం ఏంటి..?

   20 hours ago


విజయసాయిపై ఉత్తరాంధ్ర వైసీపీ నేతల కడుపుమంట.. ఆడియో లీక్!

విజయసాయిపై ఉత్తరాంధ్ర వైసీపీ నేతల కడుపుమంట.. ఆడియో లీక్!

   20 hours ago


వివాదాస్పద వ్యాఖ్యలకు మూల్యం.. కేసుల నమోదు

వివాదాస్పద వ్యాఖ్యలకు మూల్యం.. కేసుల నమోదు

   20 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle