newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

టీడీపీకి మరో షాక్‌.. పార్టీ కి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే

17-07-202117-07-2021 11:52:38 IST
2021-07-17T06:22:38.286Z17-07-2021 2021-07-17T06:22:32.859Z - - 27-07-2021

టీడీపీకి మరో షాక్‌.. పార్టీ కి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీడీపీ వరుస షాక్ లు తగులుతూనే ఉన్నాయి. మొన్న తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ రాజీనామా చేసి తెరాస కండువా కప్పుకున్న విషయం తెసిందే. తెలంగాణాలో పార్టీకి ఎవరిని అధ్యక్షుడిగా నియమించాలో తెలియక తలపట్టుకున్న టీడీపీ నేతలకు ఏపీలో మరో మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేసారు. 

విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి టీడీపీ కి రాజీనామా చేశారు. పార్టీలో మొదటి నుండి కష్టపడుతున్న నాలాంటి వాళ్లకు గుర్తింపు లేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేసారు. శోభా హైమావతి గతంలో ఎస్. కోట ఎమ్మెల్యేగా, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా పార్టీలో ముఖ్య పాత్ర పోషించారు. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle