షాడో లీడర్.. విడదల రజనీ
07-04-202107-04-2021 15:51:35 IST
Updated On 07-04-2021 16:27:30 ISTUpdated On 07-04-20212021-04-07T10:21:35.126Z07-04-2021 2021-04-07T10:20:56.522Z - 2021-04-07T10:57:30.475Z - 07-04-2021

అయినా షాడో ఏంటి. విడదల రజనీ ఎప్పుడూ షాడోలా ఉండరు. పబ్లిసిటీని కాస్త అందరి కంటే ఎక్కువ ఇష్టపడే లీడర్ వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ. అఫ్ కోర్స్.. ఆమెకు అంతకు మించి పబ్లిసిటీ వస్తుంది అనేది కూడా క్లియరే. ఆ విషయంలో ఎలాంటి డౌటూ లేదు. ఆమె కట్టూ బొట్టూ.. ఆమె మాట తీరు.. పలకరించే విధానం.. అన్నీ ఆమెను స్పెషల్ గా నిలిపాయి. వైసీపీ లీడర్లందరిలో.. ఆ మాటకొస్తే.. ఏపీ లీడర్లు అందరిలో విడదల రజనీ కాస్త స్పెషలే. కాస్తేంటి కర్మ.. చాలానే స్పెషల్ అనొచ్చు. అలా అనుకున్నా తప్పేం లేదు.
అయితే.. ఆమె ఎప్పుడూ షాడో గా ఉండరు.. ఓపెన్ గానే ఉంటారు అనే విషయంలో ఎవరికీ ఎలాంటి డౌట్లూ లేవు. అయితే.. ఆమె ఓ విషయంలో మాత్రం షాడోగా ఉంటున్నారు అనే టాక్ వినిపిస్తోంది. ఆ మాటలు వింటుంటే.. నిజమే ఆమెకు షాడో గా ఉన్నారేమో అంటూ అందరూ కన్విన్స్ అవుతున్నారు కూడా. మరి ఆమె ఎవరు అంటారా. ఆమె ఎవరో కాదు.. షర్మిల. ఈ మధ్య షర్మిల ఒక పొలిటికల్ ట్రెండ్ సెట్టర్ అయ్యారు కదా. అయితే.. ఆమె వెనకాల విడదల రజనీ ఉన్నారు అనే టాక్ ఉంది. ఏ లీడర్ కి అయినా.. కాస్త సలహాలు సహాయాలు అవసరమే. పొలిటికల్ గా అయితే క్లాసులే నడుపుతాయి పార్టీలు. పర్సనాలిటీ డెవలప్ మెంట్ గురించి జనంలోకి ఎలా వెళ్లాలి అనే విషయంపైనా ఎలా పలకరించాలి అనే విషయంపైనా ఎన్నో రకాల ట్రైనింగ్స్ ఇస్తారు. సీనియర్ లీడర్లకి కూడా పర్సనాలిటీ డెవలప్ మెంట్ స్పెషలిస్ట్ లు ట్రైనింగ్ ఇస్తారు.
మరి పార్టీ పెట్టబోతున్న షర్మిలకి ఆ మాత్రం అవసరం ఉండదా చెప్పండి. ఎంత జగన్ చెల్లెలు అయినా.. రాజశేఖర్ రెడ్డి కుమార్తె అయినా.. కొన్ని కొన్ని విషయాల్లో కొంతమంది సలహాలు సహకారాలూ అవసరమే కదా. అయితే.. ఏపీతో పాటు.. తెలుగు రాష్ట్రాల్లో.. చేస్తున్న మంచి పనులకంటే ఎక్కువ పాపులర్ అయిన లీడర్ ఎవరైనా ఉన్నారా అంటే.. విడదల రజనీనే. పైగా షర్మిలకి విడదల రజనీకి మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది. పైగా వైసీపీ లీడర్ విడదల రజనీ.. త్వరలోనే మంత్రి పదవి ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. వస్తుంది అనే క్లారిటీ కూడా ఉంది.
అందుకే.. ఆమె షర్మిలకు కాసిన్ని సలహాలు ఇచ్చినట్లు టాక్ ఉంది. రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ.. షర్మిలకి చాలా విషయాల్లో హెల్ప్ చేసినట్లు తెలుస్తోంది. షర్మిల కూడా జనంలోకి వెళ్లినా.. ఒక అన్నచాటు చెల్లిగానే వెళ్లారు తప్ప.. ఒంటరి ప్రయాణం చేస్తూ.. కోట్ల మందిని లీడ్ చేసే పొజిషన్ లో అయితే వెళ్లలేదు. అందుకే.. షర్మిల కూడా ఎలాంటి పట్టింపులకూ వెళ్లకుండా.. నచ్చిన వారి సలహాలు తీసుకున్నట్లు.. అందరి మాటలూ విన్నట్లు టాక్ ఉంది. అయితే.. ఈ లిస్ట్ లో విడదల రజనీ ప్లేస్ టాప్ లిస్ట్ లో ఉందంట. వైసీపీకి షర్మిల పార్టీకి సంబంధం లేదు అనే విషయాన్ని బయటికి చెబుతున్నారు కాబట్టి.. ఆమె షాడోలా ఉండి.. షర్మిలకి సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే.. ఈ మధ్య కాలంలో విడదల రజనీ పెద్దగా ప్రజల్లోకి వెళ్లకుండా బిజీ అయిపోయారు అనే టాక్ కూడా ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోంది. బట్ క్లారిటీస్ మాత్రం ఎవరికీ లేవు.
రోజా, విడదల రజనీ.. మంత్రి పదవి ఎవరికి?

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
15 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
12 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
14 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
18 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
21 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
a day ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా