Panchayat Elections: పిచ్చి పట్టిందన్న కొడాలిపై చర్యలు తీసుకున్న ఎస్ఈసీ
13-02-202113-02-2021 10:04:05 IST
Updated On 13-02-2021 10:21:25 ISTUpdated On 13-02-20212021-02-13T04:34:05.246Z13-02-2021 2021-02-13T03:59:41.023Z - 2021-02-13T04:51:25.081Z - 13-02-2021

Panchayat Elections: వద్దు సామే అంటే వింటారు. వినరు. వింటే వైసీపీ లీడర్లు ఎలా అవుతారు. అసలే.. బూతు లీడర్ గా పేరున్న మినిస్టర్ కొడాలి నాని ఎలా ఆగుతారు చెప్పండి. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద కామెంట్ చేయడం.. ఇష్యూ చేయడం. ఇది కొడాలి నానికి రెగ్యులరే కదా. అందుకే.. ఇప్పుడు ఇంత దాకా వచ్చింది. అలా అని తన పదవికి ఏం ప్రాబ్లమ్ రాలేదులే. వద్దు సామే.. నీ నోరు మంచిది కాదు ఏం కాదు. అసలే ఎన్నికల టైం. నువ్వు కాస్త కంట్రోల్ లో ఉంటేనే మంచిది. దాని కోసం నువ్వేం చేయాల్సిన పనిలేదు కానీ.. జస్ట్ మాట్లాడకుండా ఉంటే చాలు. అందుకే.. ఈ ఎన్నికలు అయిపోయేదాకా.. మైక్ లు పట్టుకోకు.. ప్రెస్ మీట్లు పెట్టకు.. మీటింగ్ లు కూడా పెట్టకు అంటూ ఆదేశాలిచ్చారు.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్. అంతే కాదు. కొడాలి నాని ఆగే రకం కాదు అని తెలిసిందే కదా. అందుకే.. ఆయన నోరు తెరవకుండా గప్ చుప్ గా ఉండేలా చూసే బాధ్యత.. క్రిష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీలకు అప్పజెప్పారు. ఆయన్ని మీడియాతో మాట్లాడకుండా.. మీటింగ్ లు పెట్టకుండా చూసుకోండి అని ఆదేశించారు. ఎస్ఈసీ పై ఇంతకు ముందులాగే కమెంట్స్ చేయడంతో ఇంత దాకా వచ్చింది ఎవ్వారం. ఎన్నికల కోడ్ ఉన్న టైంలో.. ఎన్నికల కమిషనే కదా.. సుపీరియర్. అయినా తగ్గలేదు కొడాలి నాని. ఎస్ఈసీ రమేశ్ కుమార్ పై నోటికొచ్చినట్లు మాట్లాడారు. అది చూసిన రమేశ్ కుమార్.. వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అయితే.. తాను ఏ తప్పూ చేయలేదు అని.. జనంలో ఉన్న మాటలే చెప్పాను అని. అది కూడా మీడియా అడిగితే చెప్పాను.. నా సొంత మాటలు కావు.. జనం అనుకున్న మాటలే వివరించాను.. అలాగే.. ఎవరినీ వ్యక్తిగతంగా దూషించలేదు. కావాలంటే.. ఓసారి నా మాటలు వినండి.. మీరు తప్పుగా అర్దం చేసుకున్నారు.. కాబట్టి.. షోకాజ్ నోటీసులు వెనక్కి తీసుకోవాలి అని.. వివరణ ఇచ్చుకున్నారు కొడాలి నాని. కాకపోతే.. ఈ వివరణపై రమేశ్ కుమార్.. శాటిస్ఫై అవ్వలేదు. అందుకే.. నువ్వు కాస్త కంట్రోల్ లో ఉండి అని చెప్పి.. కంట్రోల్ లో ఉంచే బాధ్యత.. ఐఏఎస్, ఐపీఎస్ లకు అప్పజెప్పారు.

భారీగా నామినేషన్ల ఉపసంహరణ
16 minutes ago

మున్సిపల్ పోరుపై బాబు ఫోకస్
38 minutes ago

రాజకీయాలనుంచి తప్పుకుంటున్నా.. చిన్నమ్మ
2 hours ago

నేను వైసీపీలో చేరను-గంటా క్లారిటీ
2 hours ago

విశాఖ ఉక్కు అయిపోయింది.. విశాఖ పోర్టు వంతు వచ్చింది
3 hours ago

ఆహా.. ఇది అద్భుతమైన ఓపెనింగ్ ఎంపీ సార్
3 hours ago

విశాఖ వైసీపీలో విభేదాలు మరోసారి కనపడ్డాయిగా..!
16 hours ago

క్రమ శిక్షణ చర్యలు తప్పవంటూ అచ్చెన్నాయుడు వార్నింగ్
17 hours ago

గంటా ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయసాయి
21 hours ago

అధిష్టానంతో అటో ఇటో తేల్చుకుంటాం.. కాంగ్రెస్ అసమ్మతి నేతలు సిద్ధం
a day ago
ఇంకా