newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

17-04-202117-04-2021 13:49:23 IST
Updated On 17-04-2021 13:48:21 ISTUpdated On 17-04-20212021-04-17T08:19:23.252Z17-04-2021 2021-04-17T07:36:14.256Z - 2021-04-17T08:18:21.927Z - 17-04-2021

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తిరుపతి ఉప ఎన్నికపై పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ సంచలన ఆరోపణ చేశారు. తిరుపతి ఉప ఎన్నికను తక్షణమే నిలిపేయాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని.. దొంగ ఓట్లు వేసి విజయం సాధించాలని అధికార పార్టీ చూస్తోందని అన్నారు. ఎన్నికల అధికారులు, పోలీసులు యంత్రాంగం మొత్తం ఉప ఎన్నికల్లో ప్రభుత్వానికి మద్దత్తుగా పని చేస్తోందని.. వాలంటీర్లు బరితెగించి మరీ డైరెక్ట్‌గా ఓట్లు వేయమని ప్రజలను ప్రలోభపెడుతున్నారని అన్నారు. పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని ఎన్నికలను ప్రభుత్వం అపహాస్యం చేస్తోందని విమర్శించారు. పోలింగ్ బూత్‌లను వైసీపీ నేతలు కబ్జా చేసి మరీ రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని శైలజానాథ్ ఆరోపించారు. 

తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం నుంచి బూత్‌లవద్ద వైసీపీ నేతలు దౌర్జన్యం చేస్తున్నారని టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్‌ల వద్దకు భారీగా స్ధానికేతరులను తరలించి దొంగ ఓట్లకు పాల్పడ్డారని.. కొన్నిచోట్ల తమ పార్టీకి చెందిన ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల నుంచి దౌర్జన్యంగా బయటికి పంపారని పనబాక లక్ష్మి చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో వైసీపి దౌర్జన్యకాండపై ఎన్మికల కమీష‌న్‌, పోలీసులకు ఫిర్యాదు చేశామని పనబాక లక్ష్మి తెలిపారు. 

నెల్లూరు, తిరుపతి పరిధిలోని పలు సెగ్మెంట్లలో దొంగ ఓట్లు వేసేందుకు పలువురు ఓటర్లు ప్రయత్నించారని వార్తలు రాగా.. బీజేపీ ఎంపీ అభ్యర్థి రత్నప్రభ పలు పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు. ఓ పోలింగ్ కేంద్రం వద్ద దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఆమె.. పోలీసులకు అప్పగించారు. తిరుపతి లోకసభ ఎన్నికల్లో వైసీపీ నాయకులు దొంగ ఓట్లను యథేచ్ఛగా వేస్తున్నారని ఆరోపణలు చేశారు. దీనిపై పోలీసులతో పాటు ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశామని రత్నప్రభ వెల్లడించారు. వైసీపీ నాయకులు ప్రలోభాలకు పాల్పడుతూ ఉన్నారని ఇతర పార్టీల నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. 

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 23 కంపెనీల కేంద్ర బలగాలు, 37 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను మోహరించారు. ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురు అబ్జర్వర్లను నియమించింది. దినేష్ పాటిల్ సాధారణ అబ్జర్వర్‌గా, రాజీవ్ ‌కుమార్‌ పోలీసు అబ్జర్వర్‌గా, ఆనంద కుమార్‌ ఎన్నికల వ్యయ అబ్జర్వర్ ‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle