newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

అన్నిటికంటే ముందుగా వరదసాయం అందించండి.. ఏపీ సీఎం

15-10-202015-10-2020 12:32:39 IST
2020-10-15T07:02:39.095Z15-10-2020 2020-10-15T07:02:36.169Z - - 25-10-2020

అన్నిటికంటే ముందుగా వరదసాయం అందించండి.. ఏపీ సీఎం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తుఫాను, వరద బీభత్సంలో చిక్కుకున్న ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన సహాయ, పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాల అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సహాయ శిబిరాల్లో ఉన్న వారి పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, వారికి రూ.500 చొప్పున ఇవ్వాలన్నారు. వారు ఇళ్లకు తిరిగి వెళ్లాక ఇబ్బందులకు గురి కాకుండా అన్ని విషయాలు ఆరా తీసి సహకరించాలని చెప్పారు.

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు, సహాయ కార్యక్రమాలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై కలెక్టర్లను ఆరా తీశారు. వాయుగుండం మంగళవారమే తీరం దాటింది కాబట్టి ఇబ్బంది లేదని, అయినా పూర్తి అప్రమత్తతతో ఉండాలని సూచించారు. ఈ సమీక్షలో సీఎం అధికారులకు ఆదేశాలు, సూచనలు ఇచ్చారు.

విద్యుత్‌ సరఫరాను వెంటనే పునరుద్ధరించాలి. కాలువలు, చెరువుల గండ్లు పూడ్చాలి. రహదారుల మరమ్మతులు తక్షణం చేపట్టాలి. భారీ వర్షాలు, వరదల కారణంగా వేర్వేరు జిల్లాల్లో మృతి చెందిన పది మంది కుటుంబాల వారికి వెంటనే పరిహారం చెల్లించాలి. వారంలోగా నష్టంపై అంచనాలు పంపించాలి. చిత్తూరు జిల్లాలో 40 శాతం అధిక వర్షాలు కురిసినా, కేవలం 30 శాతం మాత్రమే ట్యాంకులు నిండాయి. ఈ పరిస్థితిని మార్చాలి. కురిసే ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి.. రిజర్వాయర్లు, చెరువులు నింపాలి. కరువు నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి చెప్పారు.

తెలంగాణలో భారీ వర్షాల వల్ల ప్రకాశం బ్యారేజీకి భారీ వరద వస్తోంది. బ్యారేజీ వద్ద ఇప్పటికే భారీ వరద కొనసాగుతోంది. శ్రీశైలం నుంచి 4 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మరో 24 గంటల్లో ఆ వరద చేరుతుంది. ప్రకాశం బ్యారేజీ వద్ద 7.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కోవడం కోసం గుంటూరు, కృష్ణా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. విజయవాడలో ఇళ్లు ఖాళీ చేయించే వారికి తప్పనిసరిగా వసతి కల్పించాలని సీఎం జగన్ సూచించారు.

రహదారుల మరమ్మతు పనులు వేగంగా జరగాలనీ, 45 నెలల్లో శాశ్వత ప్రాతిపదికన కూడా మరమ్మతులు పూర్తి చేయాలనీ,  వారం రోజుల్లో నష్టంపై అంచనాలు పంపించాలనీ సీఎం సూచించారు. కలుషిత నీరు లేకుండా పరిశుభ్రమైన తాగునీరు సరఫరా చేయాలనీ ఎక్కడా వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ ఆదేశించారు. అన్ని పీహెచ్‌సీలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలి. క్లోరినేషన్‌ చేయాలి. వరదలు తగ్గాక పాము కాట్లు పెరిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇంకాస్త అప్రమత్తంగా ఉండాలి. 

వరదలు తగ్గుముఖం పట్టాక వ్యవసాయ, ఉద్యానవన వర్సిటీలు, కృషి విజ్ఞాన కేంద్రాలకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు అవసరమైన సూచనలు చేస్తారని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య వెల్లడించారు. పంటల పరిస్థితిపై కలెక్టర్లు వీలైనంత త్వరగా అంచనాలు పంపాలన్నారు. ధాన్యం సేకరణకు రైతు భరోసా కేంద్రాల వద్ద రిజిస్ట్రేషన్‌ కొనసాగుతోందని చెప్పారు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle