ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా ఠాకూర్.. షాక్ లో ప్రతిపక్షాలు
21-01-202121-01-2021 12:36:59 IST
Updated On 21-01-2021 12:22:02 ISTUpdated On 21-01-20212021-01-21T07:06:59.042Z21-01-2021 2021-01-21T06:16:12.831Z - 2021-01-21T06:52:02.446Z - 21-01-2021

టీడీపీ అధికారంలో ఉన్నపుడు డీజీపీగా ఉన్న ఠాకూర్ మీద అప్పటి ప్రతిపక్ష పార్టీ వైసీపీ తీవ్ర ఆరోపణలను చేసింది. వైసీపీ నేతలపై ఎంతో దూకుడుగా వ్యవహరించాడు. వైసీపీ అధికారంలోకి రాగానే ఆయన పేరు ఎక్కడా కూడా వినిపించలేదు. ఆ తర్వాత ఏమి జరిగిందో ఏమో కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ప్రాధాన్యత ఉన్న పోస్టును సొంతం చేసుకున్నారు. ఎన్నికల సమయంలో డీజీపీగా ఉన్న ఠాకూర్ తమను అణగదొక్కేందుకు ప్రయత్నించారని వైసీపీ చాలా సార్లు ఆరోపించింది. ఆ తర్వాత వైసీపీ విజయం సాధించడంతో అధికారుల బదిలీలలో ఠాకూర్ మీద ప్రభావం పడింది. డీజీపీగా ఉన్న ఠాకూర్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగం కమిషనర్‌గా బదిలీ అయ్యారు. కోడి కత్తి ఘటనపై విచారణ జరగకముందే దాడికి పాల్పడింది వైసీపీ కార్యకర్తగా ఠాకూర్ ప్రకటించడం ఎంత వివాదాస్పదమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు ఏం చెబితే అదే డీజీపీ హోదాలో ఠాకూర్ చెబుతున్నారని వైసీపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం రావడంతో రిటైరయ్యే వరకు ఆయనకు పెద్ద పెద్ద బాధ్యతలు అప్పగించడం కష్టమేనని అనుకున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఆయన విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా ఠాకూర్‌కు కీలక బాధ్యతలు అప్పగించింది వైసీపీ ప్రభుత్వం. ఇదే చాలా మందికి షాకింగ్ గా అనిపిస్తూ ఉంది. గత ప్రభుత్వాల్లో వారికి మద్దతుగా వ్యవహరించిన అధికారులను ప్రభుత్వాలు మారాక పట్టించుకునే అవకాశమే ఉండదు కదా.. వైసీపీ ప్రభుత్వం ఏంటి ఇలా చేస్తోంది అని కూడా పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు కూడా పెడుతూ ఉన్నారు. ఈ అనూహ్య బదిలీ పై అధికార, రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. గత ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన సాయిప్రసాద్, సతీష్‌చంద్ర వంటి అధికారులు కూడా తిరిగి కీలక బాధ్యతలు చేపట్టగా.. ఠాకూర్ కు కూడా మంచి అవకాశం ఇచ్చినట్లు భావిస్తూ ఉన్నారు. ఠాకూర్ మరో మూడు నాలుగు నెలల్లో రిటైర్ అవుతుండగా.. పదవీ విరమణ చేసే సమయంలో కీలక పోస్టుల్లో ఉండాలని అందరూ భావించిన కారణంగానే ఇది వీలయ్యిందని అంటున్నారు. వైసీపీ మీద కానీ వ్యక్తిగతంగా ఎలాంటి విరోధభావం లేదని వైసీపీ పెద్దలను కలిసి వివరణ ఇవ్వడంతో ప్రభుత్వం ఆయనకు కీలక పోస్టు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కూడా అధికారుల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తారనే ఆరోపణలు నిజం కాదని నిరూపించుకుంటోంది.

కాంగ్రెస్‌లో ఉండి ఉంటే సింధియానే సీఎం... రాహుల్
2 hours ago

బీజేపీలోకి కాంగ్రెస్ సీనియర్ లీడర్.. భార్య ఒత్తిడే కారణమా
an hour ago

విశాఖ ఉక్కు 100 శాతం ప్రైవేటుకే.. ఏపీ సర్కార్ కు ముందే తెలుసు
3 hours ago

నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. బీజేపీపై మండిపడ్డ కేటీఆర్
18 hours ago

కేతిరెడ్డిపై ఫైర్ అయిన పరిటాల శ్రీరామ్..!
20 hours ago

కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తా, శత్రుత్వమా.. డైలమ్మాలో కార్యకర్తలు
21 hours ago

వైసీపీ రౌడీయిజానికి బ్రేకులేస్తాం
21 hours ago

ఇదేం అన్యాయం.. హర్ట్ అయిన విడదల రజనీ ఫ్యాన్స్
a day ago

దేశ వ్యాప్తంగా ఆ నియోజక వర్గం గెలుపు పై ఫోకస్
11 hours ago

రాంజీ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నాయకుల దిగ్భ్రాంతి
a day ago
ఇంకా