బాబు మౌనం.. భూమా అసంతృప్తి?
13-01-202113-01-2021 09:33:39 IST
Updated On 13-01-2021 10:57:44 ISTUpdated On 13-01-20212021-01-13T04:03:39.421Z13-01-2021 2021-01-13T04:01:50.123Z - 2021-01-13T05:27:44.251Z - 13-01-2021

భూమా అఖిల ప్రియ అరెస్ట్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనానికి కారణం అయింది. అయితే ఈ అరెస్ట్ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ కనీసం స్పందించకపోవడం మరింత సంచలనంగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ నేతలపై అక్రమంగా కేసులు పెడుతుందని గతంలో చంద్రబాబు నాయుడు ఎంతగా ఆగ్రహం వ్యక్తం చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలువురు నేతల అరెస్టులను తప్పుబడుతూ ఎన్నో వ్యాఖ్యలను చేసిన టీడీపీ అధినేత.. తమ ప్రభుత్వ హాయంలో మంత్రిగా పని చేసిన భూమా అఖిల ప్రియ తెలంగాణలో వివాధాల్లో చిక్కుకొని అరెస్ట్ అయితే మాత్రం కనీసం పట్టించుకోవడం లేదని అంటున్నారు. భూమా అఖిల ప్రియ సోదరి, సోదరుడు తమను అన్యాయంగా ఇరికించారంటూ మీడియా ముందుకు వచ్చి చెబుతూ ఉంటే టీడీపీ అధినేత మాత్రం కనీసం స్పందించలేదు. టీడీపీ నేతలు కూడా సైలెంట్ గానే ఉండిపోయారు. ఏ అంశాన్నైనా రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకోవడం చంద్రబాబుకు చాలా మామూలు విషయం.. కానీ హైదరాబాద్ లో సాక్ష్యత్తు తమ పార్టీ నేత అరెస్ట్ అయినా చంద్రబాబు నాయుడు ఎటువంటి వ్యాఖ్యలు చేయడం లేదు. బాబు మౌనం వెనుక ఎందుకా అనే విషయంపై జోరుగా చర్చించుకుంటున్నారు. ఏపీలో తమ పార్టీ నేతలపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహారిస్తోందని లోకేష్, చంద్రబాబులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఏపీలో తమ నేతల అరెస్టులపై పెద్ద ఎత్తున స్పందించిన చంద్రబాబు, లోకేష్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారో.. ఎవరికీ తెలియడం లేదు. అరెస్ట్ అయినది టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా చేసిన మహిళ. వైసీపీ అధినేత జగన్ మోహాన్ రెడ్డిని కాదనుకొని టీడీపీలోకి వచ్చింది భూమా కుటుంబం. అలాంటి భూమా కుటుంబానికి బాబు ఇలాంటి కష్ట సమయంలో అండగా నిలబడలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. భూమ అఖిల ప్రియ, ఆమె కుటుంబం కూడా పార్టీ నుంచి తమకు సహకారం అందడం లేదని వాపోతున్నారని చెబుతున్నారు. ఆడ పిల్లలు రోడ్డుపై ఉన్న కనీసం పరామర్శించడానికి కూడ బాబు, లోకేష్ రావడం లేదని అంటున్నారు. గతంలో ఓటుకు నోటు కేసులు, కేసీఆర్, బాబు కు మద్య ఉన్న వివాదాలు లాంటి అంశాలు చంద్రబాబును ఈ అంశంలో మాట్లాడనివ్వకుండా చేస్తున్నాయని కూడా రాజకీయ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఏది ఏమైనా బాబు మౌనం కారణంగా భూమా కుటుంబం టీడీపీ దూరం అయ్యే అవకాశం లేకపోలేదని కూడా అంటున్నారు.

జనవరి 27న శశికళ విడుదల.. పార్టీలోకి రానివ్వమన్న పళనిస్వామి
2 hours ago

కేటీఆర్ పరిస్థితి.. రాహుల్ గాంధీలా అవుతుందా
4 hours ago

జగన్ సర్కార్ మరో డెసిషన్.. ఎందుకు తీసుకుంటారో ఏమో
2 hours ago

సవాళ్లు, ప్రమాణాలు.. ఏందీ రచ్చ.. జనాల్ని ప్రశాంతంగా ఉండనివ్వరా
5 hours ago

నానీ పని అయిపాయే.. ఇక వంశీ వచ్చే
5 hours ago

ఎదురు దెబ్బలు.. మొట్టికాయలు.. ఇక మీరు మారరా.. జనాలు మారాల్సిందేనా?
6 hours ago

షాతో జగన్ భేటీ.. ఈసారి రాష్ట్రానికి ఏం తెస్తారో?!
6 hours ago

ఈ ఎమ్మెల్యేకి కొత్త తలనొప్పులు తెస్తున్న నోటితీట
7 hours ago

మితిమీరిన బూతులు.. కొడాలి నానీ రాజకీయాలకు అవసరమా?
7 hours ago

సంగారెడ్డిలో తోప్ సింగ్ కావాలని ఈ మాజీ ఎమ్మెల్యే ఆరాటం.. గ్రౌండ్ వర్క్ స్టార్ట్
7 hours ago
ఇంకా