రేషన్ డోర్ డెలివరీ వాహనాలను ప్రారంభించిన వైఎస్ జగన్
21-01-202121-01-2021 11:13:46 IST
Updated On 21-01-2021 11:35:29 ISTUpdated On 21-01-20212021-01-21T05:43:46.100Z21-01-2021 2021-01-21T05:43:35.526Z - 2021-01-21T06:05:29.342Z - 21-01-2021

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గురువారం పౌరసరఫరాలశాఖ కొత్త వాహనాలను ప్రారంభించారు. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన 2,500 రేషన్ డోర్ డెలివరీ వాహనాలను విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద వైఎస్ జగన్ జెండా ఊపి ప్రారంభించారు. మిగిలిన జిల్లాలకు కేటాయించిన వాహనాలను మంత్రులు ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,260 వాహానాలు ప్రారంభంకానున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి నాణ్యమైన రేషన్ బియ్యం డోర్ డెలివరీ కోసం ఈ వాహనాలు సిద్ధమయ్యాయి. ఈ కార్యక్రమం కోసం రూ.830 కోట్లు అదనంగా వెచ్చిస్తూ ఉంది ప్రభుత్వం. ప్రజా పంపిణీ వ్యవస్ధలో అనేక సమస్యలకు పరిష్కారంగా ఈ పద్ధతి గురించి భావిస్తోంది జగన్ ప్రభుత్వం. కొంతమంది దుకాణదారులు సరుకులను నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకోకుండా ఉండేందుకు కూడా ఈ డోర్ డెలివరీ ఉపయోగపడుతుందని భావిస్తూ ఉన్నారు ప్రభుత్వ పెద్దలు. వృద్దులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, రోజువారీ కూలీలు రేషన్ తెచ్చుకొనేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం మొబైల్ వాహనంతో రేషన్ పంపిణీ విధానాన్ని మొదలు పెడుతోంది. వాలంటీర్ వ్యవస్ధను ఉపయోగించి ప్రజల సమక్షంలో కార్డుదారుల వేలిముద్రల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని, ఖచ్చితమైన తూకంతో తిరిగి ఉపయోగించగలిగే సంచుల ద్వారా పంపిణీ చేయనున్నారు. మొదటిసారి ఈ సంచులను ఉచితంగా ఇస్తారు. కల్తీకి ఆస్కారం లేకుండా ప్రతీ బియ్యం బస్తాకూ సీల్ ఉంటుంది. ప్రతీ సంచికీ కూడా యూనిక్ కోడ్ ఉండడం వల్ల ఆన్లైన్ ట్రాకింగ్ చేయబడుతుంది. మొబైల్ వాహనం నెలకు సగటున 18 రోజుల పాటు కార్డుదారులకు సరుకులు పంపిణీ చేయాల్సి ఉంటుంది. బియ్యం, నిత్యావసర సరుకులు కార్డు దారులకు ఇంటివద్దే అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 9260 మొబైల్ వాహనాలను 539 కోట్లతో ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ వాహనాలను నిరుద్యోగ యువకులకు ఉపాధి కోసం వివిధ కార్పొరేషన్ల ద్వారా 60 శాతం సబ్సిడీ ధరకు ప్రభుత్వం అందించింది. ఒక్కో వాహనం విలువ 5 లక్షల 81వేలు కాగా.. 60శాతం సబ్సిడీతో 3లక్షల 48వేల 600 రూపాయల సబ్సిడీ అందించింది. ఈ వాహనాలకు పౌర సరఫరాల శాఖ ప్రతీ నెలా అద్దె చెల్లిస్తూ ఆరు సంవత్సరాల పాటు వినియోగించుకోనుంది.

బలంగా ప్రతి పక్షాలు.. వైసీపీకి రాహుకాలం తప్పదా
an hour ago

అంతొద్దు.. కాస్త కంట్రోల్ లో ఉండండి
9 hours ago

మరో ఇష్యూలో మేయర్ విజయలక్ష్మి
9 hours ago

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం.. ఓటు వేయకుంటే బాగుపడరన్న మంత్రి
16 hours ago

మరోసారి బాలయ్య దురుసుతనం.. ఫోటో తీశాడని చేయి చేసుకున్నారే..!
15 hours ago

ఆ నాయకుడు నన్ను మోసం చేసాడు.. చంద్రబాబు
17 hours ago

కేశినేని నానిని చెప్పుతో కొట్టేవాడినంటూ బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు
17 hours ago

కేశినేని నానిపై బొండా ఉమా ఆగ్రహం..!
19 hours ago

తెలంగాణపై ఎందుకింత వివక్ష.. కేంద్రంపై కేటీఆర్ ద్వజం
a day ago

బీజేపీతో పెట్టుకుంటే అంతే.. అడ్డంగా బుక్కయిన కేరళ సీఎం
a day ago
ఇంకా