రథయాత్రకి.. జనసేన చక్రాలు అవుతుందా
14-01-202114-01-2021 10:48:03 IST
2021-01-14T05:18:03.488Z14-01-2021 2021-01-14T03:41:33.530Z - - 24-01-2021

ఏపీలో పొలిటికల్ హీట్ ఏ రేంజ్ లో ఉందో చూస్తూనే ఉన్నాం కదా. బీజేపీ కూడా అక్కడ దూకుడు పెంచింది. పొలిటికల్ గా బీజేపీ పవర్ ఏంటో చూపించడానికి ఇదే మంచి టైం అనుకుంటుంది. తెలంగాణలో లాగే బలపడాలి అని చూస్తుంది. అందుకే.. రామ తీర్థం విగ్రహాల ధ్వంసం అంశాన్ని ఏ మాత్రం వదలడం లేదు. రామ రథయాత్ర పేరుతో.. రామతీర్థం నుంచి కపిల తీర్థం వరకు రథ యాత్ర ప్లాన్ చేస్తోంది.
అంతా సరే బానే ఉంది. కానీ.. ఏపీ బీజేపీకి ఓ బలం బలహీనత ఉంది. అదే జనసేన పార్టీ. ఎన్నికలప్పుడు బలమే జనసేన. అసలే కష్టాల్లో కేడర్ లేకుండా ఉన్న బీజేపీకి కాస్తో కూస్తో బూస్టప్ ఇస్తుంది జనసేన పార్టీ. కానీ.. క్రెడిట్ విషయంలో, సీట్ల విషయంలో మాత్రం బీజేపీ జనసేనని పట్టించుకోవడం లేదు. పక్కకి నెట్టేసి ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తోంది. తిరుపతి సీటు విషయంలో కూడా అదే చూస్తున్నాం. ఇప్పుడు రథయాత్ర విషయం వచ్చేసరికి మరోసారి ఈ విషయం హాట్ టాపిక్ అయింది. రథ యాత్రలో జనసేన పాత్ర ఏంటి అనే పాయింట్ పొలిటికల్ గా హాట్ టాపిక్ అయింది.
జనసేన కూడా రామతీర్థం విషయాన్ని బానే హైలైట్ చేసింది. కమిటీలు గట్రా వేసి.. బానే హడావిడి చేసింది. బీజేపీ తో మొదటి నుంచీ కలిసే నడుస్తుంది. కానీ.. రథయాత్రలో జనసేన ఉంటుందా ఉండదా అన్నది ఇప్పుడు అసలు పాయింట్. ఎందుకంటే.. బీజేపీ ఏపీ లీడర్లు.. కేంద్ర లీడర్లని ఇన్వైట్ చేయాలి అని చూస్తున్నారు. వాళ్లతో రథయాత్రని సక్సెస్ చేయాలి అని చూస్తున్నారు. వాళ్లు వస్తే.. ఆ హడావిడి వేరే లెవల్ లో ఉంటుంది కాబట్టి.. రథయాత్రకి మైలేజీ వస్తుంది అనేది వాళ్ల లెక్క. కానీ.. జనసేన పరిస్థితి ఏంటి అంటే ఎన్నో డౌట్స్. మామూలుగా చూస్తే.. లోకల్ గా బీజేపీ స్టేట్ లీడర్లకి జనసేనకి పెద్దగా పొత్తులు కుదరడం లేదు. మరి ఇప్పుడు జనసేన ఏం చేయబోతుంది. రథయాత్రలో కలిసినడుస్తుందా.. లేదంటే సొంతంగా ఏదైనా ప్లాన్ చేస్తుందా. అన్నీ కలిసొచ్చి కలిసి నడిచినా.. బీజేపీ తమకి అంత ఇంపార్టెన్స్ ఇస్తుందా లేదా అనే డౌట్స్ తో ఉన్నారు జనసేన లీడర్లు. తిరుపతి బై పోల్ సీట్ విషయంలో అదే జరుగుతుంది కాబట్టి.. రథయాత్ర విషయంలో కూడా ఇదే డౌట్స్ ఉన్నాయట లోకల్ లీడర్స్ కి.

నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ కాదు.. రాజకీయ నాయకుడే..
4 hours ago

నిమ్మగడ్డ మీటింగ్.. అలా షాక్ ఇచ్చిన అధికారులు..!
9 hours ago

తెలంగాణ పాలిటిక్స్ లోకి దర్శకుడు రాఘవేంద్ర రావు
10 hours ago

అంబటి రాంబాబు కొత్త రాగం.. సెంటిమెంట్ తో ఆయింట్ మెంట్
8 hours ago

ఎన్నికలకు వెళ్లకుంటే.. ఏపీ సర్కార్ కి సీరియస్ ప్రాబ్లమే.. ఎలాగో తెలుసా..?
11 hours ago

అన్నా రాంబాబుపై జనసేనాని ఆగ్రహం.. అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వమంటూ హెచ్చరిక
6 hours ago

వైసీపీ పతనానికి పంచాయతీ ఎన్నికలే నాంది అంటున్న చంద్రబాబు
5 hours ago

లాలూ ప్రసాద్‌కు సిటీ స్కాన్.. ఆసుపత్రికి రబ్రీ, తేజస్వి రాక
13 hours ago

ఇక నేను ఫైట్ చేస్తా- అన్నా హజారే
12 hours ago

ఆ ఒక్క సీటు చాలా ఇంపార్టెంట్.. రంగంలోకి రెడీ
10 hours ago
ఇంకా