రామ తీర్థానికి కొత్త కళ
28-01-202128-01-2021 16:02:39 IST
Updated On 28-01-2021 16:25:45 ISTUpdated On 28-01-20212021-01-28T10:32:39.895Z28-01-2021 2021-01-28T10:32:31.144Z - 2021-01-28T10:55:45.035Z - 28-01-2021

రామ తీర్థం రామ తీర్థం రామ తీర్థం. ఈ మధ్య ఏపీలో బాగా హాట్ టాపిక్ అయిన మాట ఇది. రామ తీర్థంలో రాముడి విగ్రహాలపై జరిగిన దాడితో ఏపీ అట్టుడికి పోయింది. పొలిటికల్ గా పెద్ద ఇష్యూనే అయింది. అన్ని పార్టీలూ మైలేజీ కోసం బానే ట్రై చేశాయి. ప్రభుత్వంలో ఉన్న వైసీపీ కూడా ఏ మాత్రం తగ్గలేదు. ఎంత వరకు ట్రై చేయాలో.. అంత వరకూ ట్రై చేసింది. రాముడి విగ్రహాలపై దాడి జరగడాన్ని.. అన్ని పార్టీలూ సీరియస్ గా తీసుకోవడంతో.. కామెంట్లు ప్రతి కామెంట్లతో.. ఎవ్వారం వేడెక్కింది. ఆ విగ్రహాలు సోసల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చాయి. హిందూ మనోభావాలపై జరిగిన దాడిగా ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకున్నారు. మా రాముడిపై ఇలా చేస్తారా అంటూ.. సామాన్య ప్రజలు అందరూ సీరియస్ గానే తీసుకున్నారు. అందుకే.. ఓ పది రోజుల పాటు.. ఇష్యూ సీరయస్ గానే నడిచింది. ఎంక్వైరీలు.. కమిటీలు.. సీనియర్ అధికారుల పర్యవేక్షణలు అంటూ.. అంతా ఇంతా కాదు. జరగాల్సిన రాజకీయం అంతా జరిగింది. ఇక ఇదే విషయాన్ని సీరియస్ గా తీసుకుంది ఏపీ గవర్నమెంట్.. అధికారుల్ని పరుగులు పెట్టించింది. జనంలో వ్యతిరేక వస్తుందేమో అనే భయంతో.. బానే అలర్ట్ అయింది. కొత్త విగ్రహాలు.. కొత్త ఆలయాలకి కొబ్బరికాయలు కొట్టడాలు.. నిర్మాణంలో ఆగిపోయిన ఆలయాల ఫైల్స్ కదలడాలు.. అన్నీ ఇన్నీ కావు. దాడులు జరిగిన అన్ని ఆలయాల లిస్టూ బయటికొచ్చింది. అన్నీ హైలెట్ అయ్యాయి. ఆఫీసర్లు కూడా దేవాలయాలపై బానే ఫోకస్ చేశారు. ఇక ఈ సమస్య మొత్తానికి ప్రధాన కారణమైన రామతీర్థంపై మాత్రం ఎక్కువగా ఫోకస్ చేసింది. అందుకే.. తక్కువ టైంలో.. రాముడి విగ్రహాలు ఆలయంలో మెరిశాయి. భక్తుల మనోభావాలకి తగ్గట్లుగా వారి అభిప్రాయాలు సేకరించి మరీ విగ్రహాలు తీసుకొచ్చారు ఆఫీసర్లు. ఇప్పుడు రామతీర్థంలో వెలిసిన రాముడి విగ్రహాలతో.. అంతా సెట్ అయినట్లే కనిపిస్తోంది. మరి ఇంతటితో ఈ ఇష్యూ ఆగిపోతుందా.. మిగతా ఆలయాలకి కూడా కొత్త వైభవం వస్తుందా అనేది చూడాలి.

బలంగా ప్రతి పక్షాలు.. వైసీపీకి రాహుకాలం తప్పదా
an hour ago

అంతొద్దు.. కాస్త కంట్రోల్ లో ఉండండి
9 hours ago

మరో ఇష్యూలో మేయర్ విజయలక్ష్మి
9 hours ago

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం.. ఓటు వేయకుంటే బాగుపడరన్న మంత్రి
16 hours ago

మరోసారి బాలయ్య దురుసుతనం.. ఫోటో తీశాడని చేయి చేసుకున్నారే..!
15 hours ago

ఆ నాయకుడు నన్ను మోసం చేసాడు.. చంద్రబాబు
17 hours ago

కేశినేని నానిని చెప్పుతో కొట్టేవాడినంటూ బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు
17 hours ago

కేశినేని నానిపై బొండా ఉమా ఆగ్రహం..!
20 hours ago

తెలంగాణపై ఎందుకింత వివక్ష.. కేంద్రంపై కేటీఆర్ ద్వజం
a day ago

బీజేపీతో పెట్టుకుంటే అంతే.. అడ్డంగా బుక్కయిన కేరళ సీఎం
a day ago
ఇంకా