newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మోదీకి లేఖ రాసిన రఘురామ.. ఈసారి మరిన్ని సంచలన ఆరోపణలు

08-04-202108-04-2021 08:19:21 IST
Updated On 08-04-2021 10:31:02 ISTUpdated On 08-04-20212021-04-08T02:49:21.846Z08-04-2021 2021-04-08T02:10:06.342Z - 2021-04-08T05:01:02.829Z - 08-04-2021

మోదీకి లేఖ రాసిన రఘురామ.. ఈసారి మరిన్ని సంచలన ఆరోపణలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇటీవల కోర్టును ఆశ్రయించారు. కోర్టులో ఎదురుదెబ్బ తగిలిందని, రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు రిటర్న్ చేసిందని మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై రఘురామకృష్ణరాజు స్పందించారు. సరైన పత్రాలు సమర్పించాలని కోర్టు స్పష్టం చేసిందని, అంతే తప్ప తన పిటిషన్ ను తిరస్కరించినట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని అసలు విషయం చెప్పారు. కోర్టు కోరిన పత్రాలను శుక్రవారం దాఖలు చేస్తామని క్లారిటీ ఇచ్చారు. 

మరో వైపు ఈసారి వైఎస్ జగన్ పై మరిన్ని సంచలన ఆరోపణలు చేశారు రఘురామ. సీఎం జగన్ తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. ప్రస్తుతం కొనసాగిస్తున్న వై కేటగిరీ భద్రతను మరింత పెంచాలని విజ్ఞప్తి చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని తాను సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటి నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, చంపేస్తామంటూ హెచ్చరిస్తున్నారని రఘురామకృష్ణరాజు వివరించారు. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడే వ్యక్తిని కానని.. సీఎం జగన్ నేరచరిత్ర కారణంగా ఆలోచించాల్సి వస్తోందని తెలిపారు.

గత కొన్ని వారాలుగా తనపై తప్పుడు కేసుల నమోదుకు ప్రయత్నాలు చేశారని, కానీ ఆ ప్రయత్నాలు విఫలం అయ్యాయని రఘురామకృష్ణరాజు తెలిపారు. విశ్వసనీయ వర్గాల నుంచి నాకు అందిన సమాచారం ప్రకారం నన్ను భౌతికంగా లేకుండా చేసేందుకు కడప జిల్లాలో తనకున్న పాత పరిచయాల ఆధారంగా కొందరు ప్రొఫెషనల్ కిల్లర్స్ సాయం తీసుకుంటున్నట్టు తెలిసింది. అందుకే నా భద్రతపై పునఃపరిశీలన చేయాలని మిమ్మల్ని అర్థిస్తున్నాను. ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా ఓ గన్ మన్ ఎల్లప్పుడూ నా వెంటే ఉండేలా చర్యలు తీసుకోండని ఆయన మోదీని లేఖలో కోరారు. ఇప్పటివరకు నాకు ఏపీలోనూ, హైదరాబాదులోనూ ఉన్నప్పుడే వై కేటగిరీ వర్తింపజేస్తున్నారని.. ఇప్పుడా భద్రతను ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా వర్తించేలా చర్యలు తీసుకోవాలని రఘురామ కోరారు. 

ఇక సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ వేయడంపై వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ స్పందించారు. జగన్ రాముడో, రాక్షసుడో తేలితేనే ఏపీకి వస్తానని రఘురామకృష్ణరాజు అంటున్నాడని, జగన్ రాముడని ప్రజలు ఎప్పుడో తేల్చారని స్పష్టం చేశారు. రఘురామకృష్ణరాజుపైన అనేక సీబీఐ కేసులు ఉన్నాయని, తనను చంద్రబాబో లేక ఏదైనా పార్టీనో కాపాడకపోతుందా అని ఇంతగా దిగజారాడని అన్నారు. పక్క పార్టీలకు, ఇతర పార్టీల నేతలకు దాయాదిలా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. రఘురామకృష్ణరాజును పైనున్న దేవుడు కూడా క్షమించబోడని, జైలుకు వెళ్లడం ఖాయమని నందిగం స్పష్టం చేశారు. సిగ్గు, శరం లేకుండా ఢిల్లీలో ఉంటున్న రఘురామకృష్ణరాజు ఆత్మగౌరవం ఉంటే ఏపీకి రావాలని అన్నారు. 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   16 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   12 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   14 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   19 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   21 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   a day ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle