newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వైసీపీకి ఆ పార్టీతో ముప్పు తప్పదట: ఆర్ఆర్ఆర్

31-03-202131-03-2021 07:49:14 IST
Updated On 31-03-2021 11:43:14 ISTUpdated On 31-03-20212021-03-31T02:19:14.705Z30-03-2021 2021-03-30T12:12:41.807Z - 2021-03-31T06:13:14.702Z - 31-03-2021

వైసీపీకి ఆ పార్టీతో ముప్పు తప్పదట: ఆర్ఆర్ఆర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఏపీ సీఎం పవన్ కల్యాణ్ అంటూ సోము వీర్రాజు ప్రకటించడం చూస్తుంటే... పవన్ వల్ల తమ పార్టీ వైసీపీకి ప్రమాదమేమో అనే అనుమానం కలుగుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా బడ్జెట్‌ను ఆర్డినెన్స్ ద్వారా ప్రవేశపెట్టిన పరిస్థితి లేదని.. రానున్న కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉండనుందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కనీసం మాట కూడా మాట్లాడడం లేదని.. మరో రోమ్ చక్రవర్తిని ఎన్నుకున్నామన్న భావనలో రాష్ట్ర ప్రజలు ఉన్నారని అన్నారు.

రుణ ఆంధ్రప్రదేశ్ నుంచి దివాలా ఆంధ్రప్రదేశ్‌గా రాష్ట్రం మారే అవకాశాలు తొందరలో ఉన్నాయని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాల కోసం మద్యంపై ఆదాయాన్ని పెంచుకోవాల్సి వస్తుందన్నారు. రాష్ట్ర అప్పులు భారీగా పెరిగిపోయాయని... రానున్న కాలంలో ఆర్థికంగా రాష్ట్రం గడ్డుకాలాన్ని ఎదుర్కొంటుందని అన్నారు. దీని గురించి జగన్ మాట్లాడటమే లేదని చెప్పారు. మరో నీరో చక్రవర్తిని ఎన్నుకున్నామనే భావనలో ప్రజలు ఉన్నారని రఘురాజు అన్నారు.

సీబీఐ అధికారులు తనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో ఎవరి ఒత్తిడి అయినా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేయమని త్వరలో లేఖ రాస్తానని ఎంపీ రఘురామకృష్ణంరాజు చెప్పారు. సీఎం పినతండ్రి వివేకానందరెడ్డి హత్య కేసును ఇన్నిరోజులయిన చేధించకపోవడం బాధాకరమని ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. తిరుపతి వేంకటేశ్వర స్వామికి భక్తులు సమర్పించిన తలనీలాలు కూడా అమ్మకపోవడం సిగ్గుచేటని.. స్వామివారి డబ్బులు దొంగిలించిన వారు బాగుపడినట్లు చరిత్రలో లేదన్నారు. ఇన్నిరోజులు ఎర్రచందనం, ఇప్పుడు తలనీలాలు  దొంగిలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఇటీవల జనసేన, బీజేపీ పార్టీల నేతల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజుతో పాటు జనసేన తరపున నాదెండ్ల మనోహర్ కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడుతూ, జనసేనాని పవన్ కల్యాణ్ కు సముచిత గౌరవం ఇవ్వాలంటూ ప్రధాని మోదీ తనకు నేరుగా సూచించారని చెప్పారు. ఈ రాష్ట్రానికి పవన్ అధిపతి కావాలని అన్నారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను జనసైనికులు ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కూటమి అభ్యర్థి రత్నప్రభ విజయం కోసం పార్టీ కార్యకర్తలంతా కృషి చేయాలని కోరారు. 

 

తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   18 minutes ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   an hour ago


వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   15 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   11 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   13 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   15 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   18 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   19 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   21 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   a day ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle