newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

15-05-202115-05-2021 07:33:46 IST
Updated On 15-05-2021 09:30:06 ISTUpdated On 15-05-20212021-05-15T02:03:46.708Z15-05-2021 2021-05-15T02:03:14.034Z - 2021-05-15T04:00:06.402Z - 15-05-2021

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ ను ఏపీ సీఐడీ ధ్రువీకరించింది. రఘురామ కృష్ణ రాజును అరెస్టు చేశామని ఏపీ సీఐడీ అదనపు డీజీపీ సునీల్ కుమార్ పేరిట ప్రకటనను విడుదల చేశారు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా మాట్లాడారని, సామాజిక వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని అభియోగాలు మోపినట్టు ఆ ప్రకటనలో తెలిపారు. అనుచిత వ్యాఖ్యలతో ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చారని.. రఘురామకృష్ణరాజుపై ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తి చేశామని ఏపీ సీఐడీ తెలిపింది.

శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని రఘురామ ఇంటికి వెళ్లిన సీఐడీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. 124 ఐపీసీ-ఏ సెక్షన్ కింద రఘురామరాజుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేశారు. బలవంతంగా ఆయన్ను పోలీసులు అక్కడి నుంచి తీసుకు వెళ్లారు. రఘురామ పుట్టినరోజు నాడే సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. రఘురామకృష్ణరాజు ను నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు. రఘురామకృష్ణరాజుకు భద్రత కల్పిస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్ ను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఏపీ సీఐడీ అధికారులకు, రఘురామకు మధ్య గంటపాటు తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం జరిగింది. అనంతరం ఏపీ సీఐడీ అధికారులు ఆయనను తమ వెంట జీపులో తీసుకెళ్లారు.

వారెంట్ లేకుండా తన తండ్రిని అరెస్ట్ చేశారని.. అరెస్ట్ కు కారణాలు చూపలేదని రఘురామకృష్ణరాజు తనయుడు భరత్ చెప్పారు. తాము అడిగితే కోర్టులో చూసుకోండని సీఐడీ అధికారులు సమాధానమిచ్చారని భరత్ చెప్పారు. పుట్టినరోజు నాడే అరెస్ట్ చేశారు, మా నాన్నను ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రికి ఆరోగ్యం కూడా బాగాలేదని.. ఆయనకు గుండె శస్త్రచికిత్స మూడు నెలల కిందట జరిగిందని అన్నారు. రఘురామ అరెస్టును పలువురు రాజకీయ నాయకులు ఖండిస్తున్నారు. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle