newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌

16-04-202116-04-2021 11:17:49 IST
Updated On 16-04-2021 09:22:15 ISTUpdated On 16-04-20212021-04-16T05:47:49.790Z16-04-2021 2021-04-16T03:34:43.981Z - 2021-04-16T03:52:15.937Z - 16-04-2021

ల‌క్ష ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచినా.. ఓడిన‌ట్లే- ర‌ఘురామ‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైసీపీ రెబ‌ల్ ఎంపీ.. ర‌ఘు రామ కృష్ణం రాజు.. ఎప్పుడూ ఏదో ఒక హాట్ టాపిక్ తో ముందుకొస్తారు. ఈ విష‌యం కొన్నాళ్లుగా ట్రెండింగ్ లో ఉంది. ఆయ‌న ప్ర‌తి రోజూ ట్రెండింగ్ లోనే ఉంటున్నారు. ప్ర‌తి రోజూ కాకున్నా.. వారంలో ఒక్క రోజైనా స‌రే.. త‌న ప‌వ‌ర్ ఏంటో చూపిస్తున్నారు. తాను లోక‌ల్ గా లేకున్నా.. లోక‌ల్ గా ప్ర‌తి ఒక్క‌రూ త‌న గురించే మాట్లాడుకునేలా చేస్తున్నారు ఎంపీ రఘు రామ కృష్ణం రాజు.

ఇప్పుడు కూడా వైసీపీ పై సీఎం జ‌గ‌న్ పై ఆరోప‌ణ‌లు చేయ‌డంలో ఎక్క‌డా త‌గ్గ‌లేదు. ఇక తిరుప‌తి ఎన్నిక‌ల విష‌యాన్ని హైలైట్ గా మాట్లాడారు. తిరుప‌తిలో వైసీపీ గెలిచినా స‌రే.. ఏం ఉప‌యోగం లేద‌న్నారు. గెలిచినా ఓడిన‌ట్లే అన్నారు. అది జ‌నం ఇంటెన్ష‌న్  కాదు.. క‌రెన్సీ ఇంటెన్ష‌న్ మాత్ర‌మే అంటున్నారు. డ‌బ్బు పంచి గెల‌వ‌డం కూడా ఓ గెలుపేనా. అలా గెలిస్తే.. డ‌బ్బు పంచ‌డంలో గెలిచిన‌ట్లే కానీ.. జ‌నం మ‌న‌సులు గెలిచిన‌ట్లు కాదు అనేది ఆయ‌న ఇంటెన్ష‌న్.

టీడీపీ అయినా.. వైసీపీ అయినా స‌రే.. ఓట్లకి నోట్లు పంచి గెలిస్తే అదీ ఓ గెలుపేనా అంటున్నారు ర‌ఘురామ‌. జ‌నం కూడా ఆలోచించుకుని..  నోట్ల‌కి కాకుండా అభ్య‌ర్థిని చూసి ఓటేయాల‌ని పిలుపునిచ్చారు ర‌ఘురామ‌. ఒక వేళ‌..  ఓట్ల‌కి నోట్ల క‌ట్ట‌లు చ‌ల్లి.. వైసీపీ గెలిచినా అదీ ఓ గెలుపేనా అంటున్నారు. ల‌క్ష ఓట్ల మెజార్టీ వ‌చ్చినా.. అది నోట్ల‌దే కానీ.. ఓట్ల‌తో వ‌చ్చిన‌ట్లు కాదు అనేది ఆయ‌న ఉద్దేశం. ల‌క్ష కంటే ఎక్కువ మెజార్టీ వ‌స్తే.. ఆ పైన వ‌చ్చిన ఓట్ల‌నే.. వైసీపీ ఓట్లుగా స్వీక‌రించాలి కావ‌చ్చు. ఇక ఇదే నోట్ల పంప‌కంపై తిరుప‌తి వ్యాప్తంగా ఇవ్వాళ హాట్ డిస్క‌ష‌న్లు న‌డుస్తున్నాయి. వాళ్లెంత పంచుతున్నారు. వీళ్లెంత పంచుతున్నారు అంటూ లెక్క‌లేస్తున్నారు జ‌నాలు. ఈ టైంలో.. ర‌ఘు రామ కామెంట్స్ మ‌రికాస్త హీట్ క్రియేట్ చేస్తున్నాయి.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle