newssting
Radio
BITING NEWS :
హైదరాబాద్ వాసులను వెంటాడుతున్న వరద భయం. రానున్న మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు. * హైదరాబాద్ ను ఆదుకునేందుకు కదిలిన టాలీవుడ్ తారాగణం. సీఎం రిలీఫ్ ఫండ్ కు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ కోటి రూపాయల విరాళం. చెరో 50 లక్షలు ఇచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్. * విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు. కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అన్న మంత్రి సుచరిత. * ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇంకా కుదరని ఆర్టీసీ ఒప్పందం. ప్రభుత్వాల మొండి వైఖరితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఆర్టీసీ అలసత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచిన ప్రైవేట్ బస్సులు. ప్రతి ఏటా ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్న దసరా. * స్కందమాతగా దర్శనమిస్తోన్న బాసర సరస్వతీ దేవి. * పూర్తిగా నిండిన గండిపేట చెరువు. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీరు విడుదల చేసే అవకాశం. లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.

మహిళలు టీవీ సీరియళ్లు తగ్గించుకోమని చెబుతున్న రఘురామకృష్ణరాజు

12-10-202012-10-2020 15:40:51 IST
2020-10-12T10:10:51.019Z12-10-2020 2020-10-12T10:10:31.401Z - - 21-10-2020

మహిళలు టీవీ సీరియళ్లు తగ్గించుకోమని చెబుతున్న రఘురామకృష్ణరాజు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

రఘురామకృష్ణ రాజు ఆయన ఈ మధ్య కాలంలో ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. వైసీపీ మీద నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే..! ఢిల్లీలో తన 'రచ్చబండ' కార్యక్రమం సందర్భంగా అమరావతిలో రైతులు చేస్తున్న శాంతియుత ధర్నా కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. సినిమా శతదినోత్సవం, రజతోత్సవం, వజ్రోత్సవం లాగా, అమరావతి ధర్నా 300వ రోజు అంటూ ప్రచారం చేసుకోకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని విస్తరించడంపై శ్రద్ధ చూపాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని మహిళలు టీవీ సీరియళ్లు చూసే సమయాన్ని 50 శాతం తగ్గించుకుని, కాస్త అమరావతి రైతుల సమస్యపై దృష్టి పెట్టాలని తెలిపారు. ఎక్కడైనా మహిళలు ముందుంటే దేనికైనా శుభం జరుగుతుందని రఘురామకృష్ణరాజు అన్నారు. 

తన పట్ల ట్రోలింగ్ కు పాల్పడుతున్న వారిపై ఎదురుదాడికి దిగారు. సోషల్ మీడియాలో కొన్నిరోజులుగా తన పాత ఫొటో ప్రచారం చేస్తున్నారని, అదెప్పుడో మూడేళ్ల నాటి ఫొటో అని వివరించారు. అందులో ఓ రష్యన్ యువతి షాంపేన్ పోస్తుండగా, రఘురామకృష్ణరాజు తాగుతున్న దృశ్యం ఉంది. ఈ ఫొటోను రఘురామకృష్ణరాజు మీడియాకు చూపించారు. ఈ ఫొటో కోల్ కతాలో కానీ, హైదరాబాద్ లో కానీ తీసినది అయ్యుంటుంది. ఓ తెలుగు ఎంపీ  ఫంక్షన్ లోది అనుకుంటానని అన్నారు. 'నేను ఎవరినీ ముట్టుకోలేదు. క్రికెట్ పోటీల్లో విజేతలకు షాంపేన్ అందించడం తెలిసిందే. గెలిచినవాళ్లు కొంచెం నోట్లో పోసుకుంటారు. నేను తాగింది కూడా షాంపేనే' అని సమర్థించుకున్నారు. నేను ఎవరినీ తాకలేదు... ఆమె దూరంగా ఉండి షాంపేన్ పోసింది. అయినా, నేను కొంచెం షాంపేన్ తాగితే మీకేంట్రా సంతోషం వెర్రివెధవల్లారా ... ఏముందిరా ఆ ఫొటోలో? అని అన్నారు. 

ఇక రఘురామకృష్ణరాజుకు చెందిన ఇండ్-భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ సంస్థపై సీబీఐ కేసు నమోదు చేసినట్టు, ఆయనకు చెందిన నివాసాలు, కార్యాలయాలపై దాడులు జరిగినట్టు వచ్చిన మీడియా కథనాలపై కూడా స్పందించారు. తనను అరెస్ట్ చేయించే వరకు సీఎం అన్నం కూడా తినేట్టు లేరని తాడేపల్లి వర్గాలంటున్నాయని..  తనను అరెస్ట్ చేయించాలని సీఎం జగన్ మంకుపట్టు పట్టారని అర్థమవుతోందని తెలిపారు. తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించడంలో ప్రవీణ్ ప్రకాశ్ అనే అధికారి ప్రధాన పాత్ర పోషించాడని, ప్రవీణ్ ప్రకాశ్ కేంద్రంలో ఉన్న తన బ్యాచ్ మేట్ ద్వారా మంత్రాంగం చేసి సఫలమయ్యారని అన్నారు. ప్రవీణ్ ప్రకాశ్ ను సీఎం సీబీఐ కేసుల నుంచి బయటపడేసేందుకు తెచ్చుకున్నారని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle