newssting
Radio
BITING NEWS :
కర్ణాటకలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ. ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ * కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. గురుగావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఉదయం 3.30 గంటలకు అహ్మద్ పటేల్ మృతి చెందారని ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అహ్మద్ పటేల్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ సమాజానికి ఏళ్ల తరబడి సేవలు అందించారని ప్రధాని ట్వీట్ ద్వారా కొనియాడారు. అహ్మద్​ పటేల్​ మరణంపై కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘అత్యంత విశ్వాసపాత్రుడు, మంచి స్నేహితుడు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. గొప్ప కామ్రేడ్‌ను నేను కోల్పోయాను’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు * తమిళనాడు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో నేడు తమిళనాడు వ్యాప్తంగా ప్రభుత్వం సెలవు ప్రకటించగా సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి * ఆఫ్ఘనిస్థాన్ దేశంలోని బమియాన్ నగరంలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన పేలుళ్లలో 17 మంది మరణించగా, మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. బమియాన్ ప్రావిన్సులోని బమియాన్ నగరంలోని స్థానిక మార్కెట్ లో పేలుళ్లు జరిగాయి * దేశరాజధాని ఢిల్లీలో కరోనా కల్లోలం ఆగడం లేదు. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 6,224 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదేసమయంలో 109 మంది మృతి చెందారు. కరోనా కారణంగా ఢిల్లీలో వరుసగా ఐదవ రోజు కూడా100కు పైగా మరణాలు సంభవించాయి * రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి ఒక్కో డోసు ధర రూ.740 (రెండు డోసులకు రూ.1480) కంటే తక్కువే ఉంటుందని రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) అధిపతి కిరిల్‌ దిమిత్రీవ్‌ ప్రకటన * తెలుగు రాష్ట్రాలకు ‘నివర్’ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. తుఫాను ప్రభావం ఇరు రాష్ట్రాలపై ఎక్కువగా ఉండనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు మూడ్రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు జిల్లాకు చేరుకున్నారు. అధికారులు, సిబ్బందికి సెలవుల రద్దు చేశారు. తీర ప్రాంతాల్లో కలెక్టర్‌ పర్యటించారు. కృష్ణపట్నం పోర్టులో రెండవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు * హైదరాబాద్ ఎల్బీనగర్ ఫ్లైఓవర్‌ పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ప్రమాదంలో రాంపల్లి ప్రవీణ్‌కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు * రాష్ట్రంలో బుధ, గురు వారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలోని అల్పపీడనం బుధవారం సాయంత్రం తీరం దాటి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్న ట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు * ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పును అందజేయాలని, ఈ కార్యక్రమం బుధవారం సాయంత్రానికల్లా పూర్తి కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) ఆదేశించింది. 2009, 2016 ఎన్నికల్లో ఓటింగ్‌ 50 శాతం కూడా దాటకపోవడాన్ని గుర్తు చేసింది.

బీసీ నేతలు చేయలేని మేలు ఏపీ సీఎం చేశారు.. ఆర్‌. కృష్ణయ్య

19-10-202019-10-2020 10:37:16 IST
2020-10-19T05:07:16.820Z19-10-2020 2020-10-19T05:07:14.016Z - - 26-11-2020

బీసీ నేతలు చేయలేని మేలు ఏపీ సీఎం చేశారు.. ఆర్‌. కృష్ణయ్య
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బీసీల అభివృద్ధికి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఎవరు కూడా ఇలాంటి విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకోలేదు. ఇతర రాష్ట్రాల్లోనూ బీసీలు ముఖ్యమంత్రులు అయ్యారు కానీ ఎవరూ కూడా ఇలా కార్పొరేషన్‌లకు బీసీలను నియమించలేదు. బీసీలకు నాయకత్వం ఇవ్వడం శుభపరిణామం. బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్న పరిస్థితుల్లో వారి సమగ్ర అభివృద్ధికి సీఎం జగన్ కృషి చేస్తున్నారు. ఇంత చిన్న వయస్సులో ఎన్నో పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజకీయంగా ఎవరు ఎదగకూడదు అని మాత్రమే చూశారు.. బీసీ కార్పొరేషన్‌లలో మహిళలకు పెద్ద పీట వేయడం గొప్ప విషయం. రాష్ట్ర అభివృద్ధి, బీసీల సమగ్రాభివృద్ధి పట్ల సీఎం జగన్‌కు ఉన్న విజన్ గర్వించదగ్గ విశేషం అంటూ ఆయన ప్రశంసించారు

చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే నిర్ణయాలు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకోవడం హర్షనీయం. 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీల అభివృద్ధికి అడుగు వేస్తున్నారు. అతి తక్కువ కాలంలో ఇచ్చిన హామీలను అమలు చేసి సంక్షేమ పథకాలను అమలు చేశారు.33 వేల కోట్ల రూపాయలను సంక్షేమ పథకాలకు ఉపయోగించారు. 10 వేల కోట్ల రూపాయలను బిసిలకు ఖర్చు చేస్తున్నామని గత ముఖ్యమంత్రి బిసిలను మోసం చేశారు. 

పేదల ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ రాష్ట్రంలో బీసీలకు పెద్ద పీట వేశారు. బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. బీసీలకు 670 డైరెక్టర్లను ఏర్పాటు చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్‌. బీసీ కార్పొరేషన్ లలో 50 శాతం మహిళలకు కల్పించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కావడం విశేషమని ఆర్ కృష్ణయ్య చెప్పారు.

కాగా, బీసీ కులాల అభివృద్ధి దిశగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బలమైన బాటలు వేసింది. ఎన్నికల హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 139 బీసీ కులాలకు 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి పాలక మండళ్లను నియమించారు. 56 మంది చైర్మన్లలో 29 మంది మహిళలు కాగా 27 మంది పురుషులు ఉన్నారు. 672 మంది బీసీలకు డైరెక్టర్లుగా పదవులు దక్కాయి. ఎప్పుడూ లేని విధంగా బీసీ వర్గాలకు ఇన్ని పదవులు దక్కడంతో అన్ని జిల్లాల్లో పండుగ వాతావరణం నెలకొంది. దేశ చరిత్రలో ఇంతవరకు ఎవరూ ఇటువంటి సాహసోపేత నిర్ణయం తీసుకోలేదని, ఎన్నో ఏళ్లుగా బీసీ కులాలు కంటున్న కలలు నిజమయ్యాయని పార్టీలకు అతీతంగా బీసీ నేతలు పేర్కొంటున్నారు.

బీసీల్లో ఎంతో మంది సంచార జాతుల వారున్నారు. ఇకపై వారంతా ప్రభుత్వ సాయాన్ని పొందేందుకు ఓ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి అదే  కులానికి చెందిన వారిని చైర్మన్‌గా నియమించి భరోసా కల్పించింది. అతి తక్కువ జనాభా కలిగిన బీసీ కులాలు కూడా అందరితో సమానంగా ప్రయోజనం పొందేలా చర్యలు చేపట్టింది. బీసీల్లో కొన్ని కులాల జనాభా 500 లోపే ఉంది. మరికొన్ని కులాల గురించి పెద్దగా తెలియని పరిస్థితులు కూడా ఉన్నాయి. వీరందరికీ కార్పొరేషన్ల ద్వారా లబ్ధి చేకూరనుంది. 

కులాల ప్రాతిపదికన ఇంత పెద్ద సంఖ్యలో కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. బీసీ కార్పొరేషన్ల ద్వారా సంక్షేమ ఫలాలు అందించేందుకు ఏడాదికి దాదాపు రూ.20 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. బీసీలకు అన్ని రకాల ఆర్థిక సాయాలను ఈ కార్పొరేషన్ల ద్వారా అందచేయాలని నిర్ణయించింది. లబ్ధిదారులకు డబ్బులు పంపిణీ చేసే అధికారాన్ని కూడా కార్పొరేషన్‌ ఎండీకి కల్పిస్తారు. 

ఏపీలో 56 బీసీ కార్పొరేషన్లు – చైర్మన్ల వివరాలు

1. రజక కార్పొరేషన్‌: సుగుమంచిపల్లి రంగన్న (అనంతపురం జిల్లా)

2. కురుబ/కురుమ: కోటి సూర్యప్రకాశ్‌బాబు (అనంతపురం)

3. తొగట/తొగట వీరక్షత్రియ: గడ్డం సునీత (అనంతపురం)

4. కుంచిటి వక్కలిగ: డాక్టర్‌ బి.నళిని (అనంతపురం)

5. వన్యకుల క్షత్రియ:  కె.వనిత (చిత్తూరు)

6. పాల ఎకరి: తరిగొండ మురళీధర్‌ (చిత్తూరు)

7. ముదళియార్‌: తిరుపతూర్‌ గోవిందరాజన్‌ సురేష్‌ (చిత్తూరు)

8. ఈడిగ: కె.శాంతి (చిత్తూరు)

9. గాండ్ల/తెలికుల: సంకిస భవానీప్రియ (తూర్పు గోదావరి)

10. పెరిక: పురుషోత్తం గంగాభవాని (తూర్పు గోదావరి)

11. అగ్నికుల క్షత్రియ: భండన హరి (తూర్పు గోదావరి)

12. అయ్యారక: ఆవల రాజేశ్వరి (తూర్పు గోదావరి)

13. షేక్‌/షెయిక్‌: షేక్‌ యాసిన్‌ (గుంటూరు)

14. వడ్డెర: దేవళ్ల రేవతి (గుంటూరు)

15. కుమ్మరి/శాలివాహన: మందేపుడి పురుషోత్తం (గుంటూరు)

16. కృష్ణబలిజ/పూసల: కోలా భవాని (గుంటూరు)

17. యాదవ: నన్యంపల్లి హరీష్‌కుమార్‌ (కడప)

18. నాయీబ్రాహ్మణ: సిద్ధవటం యానాదయ్య (కడప)

19. పద్మశాలి: జింకా విజయలక్ష్మి (కడప)

20. నూర్‌బాషా/దూదేకుల: అస్పరి ఫకూర్‌బి (కడప)

21. సగర/ఉప్పర: గనుగపెంట రమణమ్మ (కడప)

22. విశ్వబ్రాహ్మణ:  తోలేటి శ్రీకాంత్‌ (కృష్ణా)

23. గౌడ: మాడు శివరామకృష్ణ (కృష్ణా)

24. వడ్డెలు: సైదు గాయత్రీసంతోష్‌ (కృష్ణా)

25. భట్రాజు: కూరపాటి గీతాంజలీదేవి (కృష్ణా)

26. వాల్మీకి/బోయ: డాక్టర్‌ ఎ.మధుసూదన్‌ (కర్నూలు)

27. కూర్ని/కరికాల భక్తులు: బుట్టా శారదమ్మ (కర్నూలు)

28. బెస్త: తెలుగు సుధారాణి (కర్నూలు)

29. వీరశైవ లింగాయత్‌: వై.రుద్రగౌడ్‌ (కర్నూలు)

30. ముదిరాజ్‌/ముత్రాసి: కోర్న వెంకటనారాయణ ముదిరాజ్‌ (నెల్లూరు)

31. జంగం: వలివేటి ప్రసన్న (నెల్లూరు)

32. బొందిలి: ఎస్‌.కిషోర్‌సింగ్‌ (నెల్లూరు)

33. ముస్లిం సంచారజాతులు: సయ్యద్‌ ఆసిఫా (నెల్లూరు)

34. చాత్తాద శ్రీవైష్టవ: టి.మనోజ్‌కుమార్‌ (ప్రకాశం)

35. ఆరెకటిక/కటిక: దాడ కుమారలక్ష్మి (ప్రకాశం)

36. దేవాంగ: బీకర సురేంద్రబాబు (ప్రకాశం)

37. మేదర : కేత లలిత నాంచారమ్మ (ప్రకాశం)

38. కళింగ: పేరాడ తిలక్‌ (శ్రీకాకుళం)

39. కళింగ కోమటి/కళింగ వైశ్య: అందవరపు సూరిబాబు (శ్రీకాకుళం)

40. రెడ్డిక: దుక్కా లోకేశ్వరరావు (శ్రీకాకుళం)

41. పోలినాటి వెలమ: పి.కృష్ణవేణి (శ్రీకాకుళం)

42. కురకుల/పొండర: రాజపు హైమావతి (శ్రీకాకుళం)

43. శ్రీశయన: చీపురు రాణి (శ్రీకాకుళం)

44. మత్స్యకార: కోలా గురువులు (విశాఖ)

45. గవర: బొడ్డేడ ప్రసాద్‌ (విశాఖ)

46. నగరాలు: పిల్లా సుజాత (విశాఖ)

47. యాత: పిల్లి సుజాత (విశాఖ)

48. నాగవంశం: బొడ్డు అప్పలకొండమ్మ (విశాఖ)

49. తూర్పు కాపు/గాజుల కాపు: మామిడి శ్రీకాంత్‌ (విజయనగరం)

50. కొప్పుల వెలమ: నెక్కల నాయుడుబాబు (విజయనగరం)

51. శిష్ట కరణం: కంటి మహంతి అనూష పట్నాయక్‌ (విజయనగరం)

52. దాసరి: డాక్టర్‌ రంగుముద్రి రమాదేవి (విజయనగరం)

53. సూర్యబలిజ: శెట్టి అనంతలక్ష్మి (పశ్చిమ గోదావరి)

54. శెట్టిబలిజ: డాక్టర్‌ గుబ్బల తమ్మయ్య (పశ్చిమ గోదావరి)

55. అత్యంత వెనుకబడినవర్గాలు: పెండ్ర వీరన్న (పశ్చిమ గోదావరి)

56. అతిరస కార్పొరేషన్‌: ఎల్లా భాస్కర్‌రావు (పశ్చిమ గోదావరి)  

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle