newssting
Radio
BITING NEWS :
* ఏపీ లో వివాదంగా మారిన గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేత, అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జీవీఎంసీ, గీతం వర్సిటీ యాజమాన్యం మధ్య ల్యాండ్ వార్ * హైదరాబాద్: నేపాల్ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు, నాచారం లో జరిగిన చోరీ కేసులో నేపాల్ ముఠా అరెస్ట్ * జూరాల ప్రాజెక్ట్ వరద ఉదృతి, 6 గేట్లు ఎత్తివేత ఇన్ ఫ్లో 92,800 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 94,721 క్యూసెక్కులు * ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు సిపిఐ నేత రామకృష్ణ లేఖ అమరావతి రైతులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం తగదు

బీజేపీలో పురందేశ్వ‌రికి కీల‌క ప‌ద‌వి... సామాజిక స‌మీక‌ర‌ణే ఎజెండా

27-09-202027-09-2020 14:39:04 IST
2020-09-27T09:09:04.791Z27-09-2020 2020-09-27T09:08:22.944Z - - 26-10-2020

బీజేపీలో పురందేశ్వ‌రికి కీల‌క ప‌ద‌వి... సామాజిక స‌మీక‌ర‌ణే ఎజెండా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌‌త్యామ్నాయ శ‌క్తిగా ఎద‌గాల‌ని చూస్తున్న బీజేపీ... అందుకు సామాజిక స‌మీక‌ర‌ణ‌లే మార్గ‌మ‌ని భావిస్తోంది. ఈ వ్యూహాన్ని దృష్టిలో ఉంచుకునే జాతీయ కార్య‌వ‌ర్గ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ జ‌రిగింద‌ని తెలుస్తోంది. తాజా మార్పులు చేర్పుల్లో భాగంగా పార్టీ నాయ‌క‌త్వం ద‌గ్గుబాటి పురంధేశ్వ‌రికి కీల‌క ప‌ద‌వి ఇచ్చింది. సంస్థాగ‌తంగా కీల‌కంగా భావించే జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌విలో ఆమెను నియ‌మించింది. ఇప్ప‌టి వ‌ర‌కు  ఆ ప‌దవిలో ఉన్న ఏపీకే చెందిన రాంమాధ‌వ్‌ను త‌ప్పించి, పురందేశ్వ‌రికి చోటు క‌ల్పించింది. 

రాష్ట్రంలో రాజ‌కీయ పున‌రేకీక‌ర‌ణ దిశ‌గా సామాజిక వ‌ర్గాల‌ను స‌మాయ‌త్తం చేయ‌డానికి బీజేపీ అధిష్టానం క‌స‌ర‌త్తు చేస్తోంది. ఇప్ప‌టికే పార్టీ రాష్ట్ర అధ్యక్ష ప‌ద‌విని బ‌ల‌మైన కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన సోము వీర్రాజుకు ఇచ్చింది. ఇప్పుడు మ‌రో ప్ర‌ధాన సామాజిక వ‌ర్గంతో పాటు బీసీల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి అధినాయ‌క‌త్వం జాతీయ కార్య‌వ‌ర్గ కూర్పులో ప్ర‌య‌త్నించింది. క‌‌‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన పురందేశ్వ‌రికి కీల‌క ప‌ద‌వి ఇవ్వ‌డం, బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన వై.స‌త్య‌కుమార్‌ను పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిలో ప‌ద‌విలో కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించ‌డం సామాజిక వ్యూహంలో భాగ‌మేన‌ని ప‌రిశీల‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. 

ఎన్టీఆర్ కుమార్తె అయిన పురందేశ్వ‌రి... మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌భుత్వంలో మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి శాఖ మంత్రిగా ప‌నిచేశారు. త‌ర్వాత బీజేపీలో చేరారు. బీజేపీలో రాష్ట్ర పార్టీకి, కేంద్ర నాయ‌క‌త్వానికి మ‌ధ్య అనుసంధానత‌లో ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌వి కీల‌కంగా ఉంటూ వ‌స్తోంది. ఈ ప‌ద‌విని పురందేశ్వ‌రికి ఇవ్వ‌డం ద్వారా బీజేపీ త‌న వ్యూహాన్ని వెల్ల‌డించింది. ఏపీలో కాపు-క‌మ్మ సామాజిక వ‌ర్గాల కాంబినేష‌న్ క‌లిసి వ‌స్తుంద‌ని బీజేపీ భావిస్తోంది. రాంమాధ‌వ్‌కు కేంద్ర మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్క‌వ‌చ్చ‌ని పార్టీ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

 

కరోనా సోకిందంటే దేవుడిచ్చిన విరామమే.. ఫడ్నవీస్

కరోనా సోకిందంటే దేవుడిచ్చిన విరామమే.. ఫడ్నవీస్

   4 minutes ago


మంట‌లు రేపుతున్న మహారాష్ట్ర సీఎం

మంట‌లు రేపుతున్న మహారాష్ట్ర సీఎం

   2 hours ago


ఏపీ పట్ల ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న తెలంగాణ

ఏపీ పట్ల ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న తెలంగాణ

   4 hours ago


పోలవరం పూర్తి ఖర్చు భరిస్తామన్నారు. మాట తప్పితే ఎలా? కేంద్రం పై జగన్ ఫైర్

పోలవరం పూర్తి ఖర్చు భరిస్తామన్నారు. మాట తప్పితే ఎలా? కేంద్రం పై జగన్ ఫైర్

   4 hours ago


టీఆర్‌ఎస్‌ను ఒక్కసారి ఓడించండి.. కేసీఆర్‌కు హామీలన్నీ గుర్తొస్తాయి... ఉత్తమ్

టీఆర్‌ఎస్‌ను ఒక్కసారి ఓడించండి.. కేసీఆర్‌కు హామీలన్నీ గుర్తొస్తాయి... ఉత్తమ్

   19 hours ago


వెలవెలబోతున్న కోవిడ్ ఆసుపత్రులు.. 80 శాతం పడకలు ఖాళీ

వెలవెలబోతున్న కోవిడ్ ఆసుపత్రులు.. 80 శాతం పడకలు ఖాళీ

   19 hours ago


దుబ్బాక‌లోనే అస‌లు ద‌స‌రా

దుబ్బాక‌లోనే అస‌లు ద‌స‌రా

   a day ago


నిమ్మ‌గ‌డ్డ‌పై మీడియా జ‌బ‌ర్ద‌స్తీ

నిమ్మ‌గ‌డ్డ‌పై మీడియా జ‌బ‌ర్ద‌స్తీ

   a day ago


సికింద్రాబాద్ లో పేలుడు.. కొద్దిసేపు టెన్షన్

సికింద్రాబాద్ లో పేలుడు.. కొద్దిసేపు టెన్షన్

   25-10-2020


సీఎం జగన్‌ సామాజిక న్యాయ సంరక్షకుడు.. పీఎంకే అధినేత రామదాస్ ప్రశంస

సీఎం జగన్‌ సామాజిక న్యాయ సంరక్షకుడు.. పీఎంకే అధినేత రామదాస్ ప్రశంస

   25-10-2020


ఇంకా

Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle