ఆలయాలపై దాడులు.. కొత్తగా ప్రశాంత్ కిషోర్ పేరు..
14-01-202114-01-2021 11:42:07 IST
Updated On 14-01-2021 07:26:55 ISTUpdated On 14-01-20212021-01-14T06:12:07.752Z14-01-2021 2021-01-14T01:50:39.797Z - 2021-01-14T01:56:55.164Z - 14-01-2021

ఆంధ్రప్రదేశ్ లో ఆలయాల మీద దాడుల ఘటనపై పెద్ద ఎత్తున ఆగ్రహ జ్వాలలు రగులుతూ ఉన్నాయి. విగ్రహాల ధ్వంసాలపై ఓ వైపు సిట్ విచారణ చేయడమే కాకుండా.. మరోవైపు ప్రభుత్వం పీస్ కమిటీలు ఏర్పాటు చేసింది. ప్రతిపక్షాలు మాత్రం ఈ వ్యవహారానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీనికి ప్రతి పక్షాలే కారణం అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతూ ఉంటే.. ఇది వైసీపీ సృష్టిస్తున్న విధ్వంసమంటూ ఆరోపణలు చేస్తున్నారు టీడీపీ నేతలు. ఈ వ్యవహారంలోకి వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను లాగింది టీడీపీ. ఇదంతా ఆయన ప్లానేనని టీడీపీ అధికార ప్రతినిధి సుధాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసింది ప్రశాంత్ కిషోర్ అనే సంగతి పతి ఒక్కరికీ తెలిసిందే. ఇటీవల మరోసారి ప్రశాంత్ కిషోర్ తో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ భేటీని మనసులో పెట్టుకునే టీడీపీ నేతలు పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ప్రశాంత్ కిశోర్ మీదనే వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేతలు. ప్రజావ్యతిరేక విధానాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే విగ్రహాల విధ్వంసాలకు పాల్పడుతున్నారని సుధాకర్ రెడ్డి ఆరోపించారు. ఈ విధ్వంసాల వెనక రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఇటీవల జగన్ ను కలసిన ప్రశాంత్ కిషోర్ రాష్ట్రంలో అల్లరులు, అశాంతి సృష్టించేందుకు వ్యూహ రచన చేశారని.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో ఈ దాడులు జరుగుతున్నాయని పెద్ద పెద్ద కామెంట్లు చేశారు. ప్రభుత్వం అండ ఉన్నందునే పోలీసులు నేరస్తులను పట్టుకోవడలో శ్రద్ద చూపడం లేదని అన్నారు. అంతర్వేదిలో రథాన్ని తగులబెట్టారు, విజయవాడ దుర్గమ్మ గుడిలో వెండి సింహాలు దొంగిలించారు, రామతీర్థంలో రాముని విగ్రహ శిరస్సు భాగాన్ని కోశారని..,ఇంకా విగ్రహాలపై వరుసదాడులు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. వైసీపీ విగ్రహాల రాజకీయం భవిష్యత్తులో మరింత ముదిరే అవకాశముందని సుధాకర్ రెడ్డి అన్నారు.

నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ కాదు.. రాజకీయ నాయకుడే..
3 hours ago

నిమ్మగడ్డ మీటింగ్.. అలా షాక్ ఇచ్చిన అధికారులు..!
8 hours ago

తెలంగాణ పాలిటిక్స్ లోకి దర్శకుడు రాఘవేంద్ర రావు
9 hours ago

అంబటి రాంబాబు కొత్త రాగం.. సెంటిమెంట్ తో ఆయింట్ మెంట్
7 hours ago

ఎన్నికలకు వెళ్లకుంటే.. ఏపీ సర్కార్ కి సీరియస్ ప్రాబ్లమే.. ఎలాగో తెలుసా..?
10 hours ago

అన్నా రాంబాబుపై జనసేనాని ఆగ్రహం.. అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వమంటూ హెచ్చరిక
5 hours ago

వైసీపీ పతనానికి పంచాయతీ ఎన్నికలే నాంది అంటున్న చంద్రబాబు
4 hours ago

లాలూ ప్రసాద్‌కు సిటీ స్కాన్.. ఆసుపత్రికి రబ్రీ, తేజస్వి రాక
11 hours ago

ఇక నేను ఫైట్ చేస్తా- అన్నా హజారే
11 hours ago

ఆ ఒక్క సీటు చాలా ఇంపార్టెంట్.. రంగంలోకి రెడీ
9 hours ago
ఇంకా