పోలవరం ఆపం.. 100 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం..!
02-12-202002-12-2020 18:16:23 IST
Updated On 03-12-2020 10:30:47 ISTUpdated On 03-12-20202020-12-02T12:46:23.910Z02-12-2020 2020-12-02T12:46:11.675Z - 2020-12-03T05:00:47.350Z - 03-12-2020

అసెంబ్లీ సమావేశాల్లో పోలవరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనంతో పోలవరం ప్రాజెక్టుకు అనేక సమస్యలు వస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ తనపై ఉన్న కేసుల భయంతో నిధుల గురించి కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేకపోతున్నారని అన్నారు. ప్రజల ఆశలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని.. రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు రాకపోతే 22 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధుల గురించి కేంద్రాన్ని ఒప్పించకపోతే ప్రజల దృష్టిలో చరిత్రహీనులుగా నిలిచిపోతారని అన్నారు. ప్రభుత్వ తీరు వల్ల పోలవరం ప్రాజెక్టుకు ఇబ్బందులు కలుగుతున్నాయని చంద్రబాబు విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో ఆపబోమని.. డ్యామ్ ఎత్తును ఒక్క అంగుళం కూడా తగ్గంచబోమని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా 45.72 మీటర్ల ఎత్తు తప్పకుండా నిర్మిస్తామని అన్నారు. నిర్ణీత సమయానికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే కాకుండా.. అక్కడ 100 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు సందర్శన పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఆరోపించారు.

వ్యాక్సిన్ తీసుకుంటానని చెప్పిన ఈటల.. కానీ కుదరలేదు ఎందుకంటే..!
an hour ago

కొత్త విగ్రహాల తయారీకి ఆయన డబ్బు ఇస్తే తీసుకోని ప్రభుత్వం
2 hours ago

కేసుతో సంబంధమే లేదంటున్న అఖిలప్రియ..?
2 hours ago

మమతకు మహిళా ఎంపీ షాక్.. భవిష్యత్తు నిర్ణయంపై సంచలన పోస్టు
7 hours ago

వరస్ట్ సీఎంలలో కేసీఆర్ ది నాలుగో ప్లేస్.. సి ఓటర్ సర్వే
9 hours ago

అబద్దాలు ఎప్పట్నుంచి మొదలెట్టావు రాహుల్... తోమర్ ఎద్దేవా
10 hours ago

మైహోంపై దాడుల వెనుక ఒత్తిడి తెచ్చిన నేత ఎవరు?
10 hours ago

దాడులలో టీడీపీ-బీజేపీ నేతలు.. డీజీపీ పక్కా పొలిటికల్ స్టేట్మెంట్
11 hours ago

ముద్రగడ ఇంటికి సోము.. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు?
12 hours ago

క్రిస్టియానిటీ అంశం తెరమీదకి తెచ్చి జగన్ కు మంచే చేశారా?
13 hours ago
ఇంకా