newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

కాంగ్రెస్సే ఉంటే ఇలా జరిగేదా.. బాబే ఉంటే ఇలా జ‌రిగేదా

13-05-202113-05-2021 08:35:47 IST
Updated On 13-05-2021 09:12:11 ISTUpdated On 13-05-20212021-05-13T03:05:47.902Z13-05-2021 2021-05-13T03:05:30.634Z - 2021-05-13T03:42:11.188Z - 13-05-2021

కాంగ్రెస్సే ఉంటే ఇలా జరిగేదా.. బాబే ఉంటే ఇలా జ‌రిగేదా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒక టైం ఉంట‌ది. జ‌నం అర్దం చేసుకోవ‌డానికి. వారు రియ‌లైజ్ కావ‌డానికి కాస్త టైం ప‌డుతుంది. ఏదో ఒక‌సారి చూద్దాం.. ఛాన్స్ ఇచ్చి చూద్దాం అనుకోవ‌డానికి.. సీఎం పీఎం ప‌ద‌వులు అంటే ఆషామాషీ ఎవ్వారం కాదు అని అర్దం చేసుకోవ‌డానికి కాస్త టైం ప‌డుతుంది. ఇట్టే అర్ద‌మైపోతే జీవితాల్లో ఇంకేం ఉంటుంది చెప్పండి. కింద ప‌డి దెబ్బ‌లు త‌గిలి.. మొహం వాచి పోతే కానీ.. కొన్ని కొన్ని సార్లు ఎవ్వారం అర్దం కాదు. ఇప్పుడు దేశంలో కూడా అదే క‌నిపిస్తోంది.

సోష‌ల్ మీడియా హ‌డావిడి చేసింది. పెయిడ్ పోస్టింగ్ ల ఎఫెక్ట్ పెరిగింది. మోడీ ఇమేజ్ పెరిగింది. ఇలాంటి మాట‌లు ఎప్ప‌ట్నుంచో ఉన్న‌య్ క‌దా. ఇప్పుడు అదే నిజం అంటున్నారు జ‌నాలు. ఎందుకంటే.. మోడీ ఏదో మ్యాజిక్ చేస్తారు. జనాన్ని ట్రాప్ చేస్తారు. మ‌త్తులో, మాయ‌లో ప‌డేసి.. ఏదేదో చేసి ఊగిపోయేలా చేస్తారు. రాముడు అంటారు, దేవుడు అంటారు.. దేశం అంటారు.. యుద్ధం అంటారు. అలాగే గెలుస్తున్నారు అని ఇంట‌లెక్చువ‌ల్స్ ఎప్ప‌టి  నుంచో చెబుతున్నారు క‌దా. దేశం మొత్తాన్ని.. ఒక మ‌త్తువేవ్స్ లోకి లాగేసి.. ఓట్లేయించుకుంటున్నారు అనే కామెంట్స్ కి ఇప్పుడు బ‌లం చేకూరుతోంది. ఎందుకంటే.. దేశ వ్యాప్తంగా మోడీ పాల‌న‌లో అన్నీ త‌ప్పులే ఉన్న‌య్ అంటున్నారు. మాట‌లు చెప్ప‌డం రాజ‌కీయాలు చేయ‌డం త‌ప్ప‌.. జ‌నాల్ని ప‌రిపాలించ‌డం రాదు అంటున్నారు.

అదే కాంగ్రెస్ ఉంటే.. ఈ ప‌రిస్థితి ఉండేది కాదు అంటున్నారు. కాంగ్రెస్ అంటే ఒక ప‌ద్ద‌తి ప్ర‌కారం న‌డుస్తుంది. ఇష్ట‌మొచ్చిన‌ట్లు.. నియంత నిర్ణ‌యాలు తీసుకోవ‌డం వీలు కాదు. రైతుల ఉద్య‌మం అన్ని రోజులు న‌డిచేది కాదు. ఎప్పుడో క్లారిటీకి వ‌చ్చేది.  నోట్ల ర‌ద్దు జ‌రిగేది కాదు.. జ‌రిగినా రిజ‌ల్ట్ ఓ ప‌ద్ద‌తి ప్ర‌కారం ఉండేది. ఇప్పుడు క‌రోనా క‌ష్ట‌కాలం కూడా ఇలా ఉండేది కాదు. ఎన్నిక‌ల విష‌యంలో  కూడా చాలా క్లారిటీగా ఉండేది.. సెకండ్ వేవ్ ఇంత స్థాయిలో ఎఫెక్ట్ చూపించేది కాదు. ఈ విష‌యంలో అంద‌రికీ క్లారిటీ ఉంది. మ‌త్తులో ప‌డి మోడీని ఎన్నుకోవ‌డం.. స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ చేయించార‌ని మ‌రోసారి ఎన్నుకోవ‌డం.. రాముడు దేవుడు అంటూ మ‌త్తులో ప‌డేయ‌డంతో మ‌ళ్లీ మ‌ళ్లీ ఎన్నుకోవ‌డం వ‌ల్ల‌నే ఇలా జ‌రిగింది అంటున్నారు. మ‌న‌కి దేవుడిపై  ఉన్న భ‌క్తిని వాళ్లు పొలిటిక‌ల్ గా యూజ్ చేసుకుంటున్నారు అనే మేథావి వ‌ర్గం నేత‌ల‌కి ఇప్పుడు జ‌నాలు స‌పోర్ట్ చేస్తున్నారు.

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

ఇక ఆంధ్రాలో కూడా అదే ప‌రిస్థితి. అస‌లే ఏపీ క‌ష్టాల్లో ఉంది. గ‌ట్టెక్కించాలి. అంటే.. ఇంట‌లెక్చువ‌ల్ కావాలి. అనుభ‌వం కావాలి. ఆ ఉద్దేశంతోనే ఫ‌స్ట్ టైం చంద్ర‌బాబుని గెలిపించారు. త‌ను ఫ‌స్ట్ టైం.. ప‌డిపోతున్న రాష్ట్రాన్ని నిల‌బెట్ట‌డానికే టైం ప‌ట్టింది. ఇక ముందుకు పుంజుకుందాం అనుకున్న టైంలో మ‌ళ్లీ ఎల‌క్ష‌న్స్ వ‌చ్చాయి. జ‌నానికి ఇమీడియ‌ట్ రిజ‌ల్ట్ కావాలి క‌దా. రాలేదు అనుకున్నారు. ఎప్ప‌టి  నుంచో ప్ర‌య‌త్నిస్తున్నారు క‌దా. ఓసారి చూద్దాం అని వైసీపీని గెలిపించారు. అదే త‌ప్పైంద అనే మేథావి వ‌ర్గం మాట‌ల‌కి.. ఇప్పుడు జ‌నం కూడా స‌పోర్ట్ చేస్తున్నారు. బాధ్య‌త‌లేని పాల‌న‌.. భ‌రించ‌లేని పాల‌న‌.. క్లారిటీ లేని జ‌గ‌న్ పాల‌న‌.. దుబారా చేసే వైసీపీ పాల‌న చూసి.. ఏం చేయాలో అర్దం కాని ప‌రిస్థితి త‌యారైంది అంటున్నారు జ‌నం. ఈ క‌రోనా క‌ష్ట‌కాలంలో చంద్రబాబు అయితే.. త‌న మేథ‌స్సుతో అనుభ‌వంతో ఇంత న‌ష్టం క‌ల‌గ‌కుండా చూసుకునే వారేమో అని రియ‌లైజ్ అవుతున్నారు.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle