newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

15-04-202115-04-2021 19:59:00 IST
Updated On 15-04-2021 16:55:21 ISTUpdated On 15-04-20212021-04-15T14:29:00.966Z15-04-2021 2021-04-15T10:09:01.979Z - 2021-04-15T11:25:21.841Z - 15-04-2021

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తిరుపతిలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తున్న సమయంలో రాళ్ల దాడి జరిగిందని టీడీపీ చెబుతోంది. చంద్రబాబు తన మీద విసిరిన రాళ్లను కూడా చూపించారు. అయితే ఇదంతా డ్రామా అని వైసీపీ నేతలు చెబుతూ ఉన్నారు. తాజాగా వైసీపీ నేత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతి ఎన్నికల ప్రచారసభలో చంద్రబాబుపై రాళ్లదాడి జరగలేదనే విషయం తేలిపోయిందని అన్నారు. సానుభూతితో ఓట్లు పడతాయని చంద్రబాబు భావించారని.. ఆకుల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి చంద్రబాబు సభలో తాను షర్ట్ విసిరానని, రాయి విసరలేదని ఒప్పుకున్నాడని తెలిపారు.

రాళ్లు వేయకపోయినా వేసినట్టు నటిస్తూ ఓట్లు వేయించుకోవాలనుకుంటున్నారని తిరుపతి ప్రెస్ క్లబ్ లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీలోనే సఖ్యత లేదని.. చంద్రబాబు, లోకేశ్ కు అందరూ వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. లోకేశ్ గురించి, టీడీపీ గురించి అచ్చెన్నాయుడు ఏం మాట్లాడారో సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయని అన్నారు. రాళ్లదాడి అంతా బూటకమని తేలిందని.. ఆ పేరుతో చంద్రబాబు సానుభూతి డ్రామా ఆడారని అన్నారు. టీడీపీ మూతపడటం ఖాయమని.. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై చంద్రబాబు ఏం జవాబు చెబుతారని ప్రశ్నించారు పెద్దిరెడ్డి. 

చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ అలిపిరి వద్ద ప్రమాణం చేసి హైడ్రామా సృష్టించారని.. ఎన్నికల్లో ఓట్లు అడిగే దమ్ము లేక తండ్రీకొడుకులు ఇద్దరూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. తామంతా తప్పు చేసినట్టు వదంతులు సృష్టిస్తున్నారని.. తాము ఎలాంటి తప్పు చేయలేదనే విషయం తిరుపతి ప్రజలకు తెలుసని అన్నారు. ఓట్లు అడిగేందుకు తాము ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్నామని... జగన్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నామని అన్నారు.

మీ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నామని చెపుతూ ఓట్లు అడుగుతున్నామని.. వైసీపీ అభ్యర్థి గురుమూర్తిని గెలిపించాలని ప్రజలను కోరుతున్నామని అన్నారు. తిరుపతి ప్రజలను ఓటు అడిగే హక్కు చంద్రబాబుకు లేదని.. మతాన్ని రెచ్చగొట్టేలా బీజేపీ వ్యవహరిస్తోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు చేశారు. 

గుడ్ న్యూస్.. ఏపీ అంబులెన్స్ లకు అనుమతి ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం

గుడ్ న్యూస్.. ఏపీ అంబులెన్స్ లకు అనుమతి ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం

   24 minutes ago


రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

   an hour ago


రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

   an hour ago


జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   15 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   17 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   21 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   20 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle