newssting
Radio
BITING NEWS :
నిర్మల్ లోని అనంతపేటలో దారుణం. మద్యంమత్తులో కూతురిని చంపిన తండ్రి. 4 ఏళ్ల కూతురిని కొట్టి చంపిన మహేష్. * రైతులకు అండగా ఈ నెల 7న ఏపీ వ్యాప్తంగా జనసేన ఆందోళనలు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు రూ.35 వేలు చెల్లించాలని డిమాండ్ చేసిన పవన్ కల్యాణ్. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం మంచి పరిణామమన్న పవన్. * నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీతో భేటీ కానున్న బండి సంజయ్. ఎన్నికలు జరిగిన తీరు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ. * కృష్ణాజిల్లా గన్నవరం వద్ద ఆగిఉన్న లారీని ఢీ కొట్టిన కారు. ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు. *మాజీ మంత్రి కమతం రామిరెడ్డి (82) కన్నుమూత. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామిరెడ్డి. రామిరెడ్డి మృతిపట్ల సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్. * తిరుపతిలో ఆన్ లైన్ వ్యభిచారం గుట్టురట్టు. జీవకోనలో ముఠాను అరెస్ట్ చేసిన సీఐడీ.

ఇన్ని టర్నులా.. ఇదేం రాజకీయం పవన్..?

22-11-202022-11-2020 12:27:12 IST
2020-11-22T06:57:12.431Z22-11-2020 2020-11-22T06:57:09.177Z - - 06-12-2020

ఇన్ని టర్నులా.. ఇదేం రాజకీయం పవన్..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

సినిమా హీరో కదా. అందులోనూ పవర్ స్టారాయే. ఆ మాత్రం ఉండాలి కదా. లేదంటే పవర్ స్టార్ పవర్ ఏమై పోద్ది చెప్పండి. అందుకే.. ప్రతి సీనూ క్లై మ్యాక్స్ లాగే ఉంటుంది అన్నట్లు.. ప్రతి సారీ టర్నింగ్ ల మీద టర్నింగులు తిరుగుతూ.. ఎవ్వడికీ అర్దం కాక.. గిర్ర గిర్ర తిరుగుతోంది పవర్ స్టార్ రాజకీయం. కొంతమందేమో దీన్ని చిన్న పిల్లాడి చేష్టలు అంటారు. కొంతమందేమో.. అంతా ప్యాకేజీ మహిమ అంటారు. ఇంకొంతమందేమో.. ఆయనకేం తెలుసు అంతా ఉత్తి ముచ్చటే అంటారు. ఫ్యాన్స్ మాత్రం మా దేవుడు ఏం చేసినా మాకు ఓకే అంటారు. వాళ్ల ఫ్యాన్స్ కి మాత్రం ఏం తెలుసు.. వాళ్ల బాస్ లాంటోళ్లే అంటారు పొలిటికల్ అనలిస్ట్ లు. ఏంటో ఈ గందరగోళం.

రీసెంట్ గా అయితే పవర్ స్టార్ మరీ గందరగోళంలో పడిపోయారు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటున్నారో అర్దం కాని సిచ్చువేషన్ లో పడిపోయారు. బీజేపీతో పొత్తులో ఉన్నారా లేదా అర్దం కావడం లేదు. ఓన్లీ క్యాంపెయిన్ కోసమే తన పార్టీని పెట్టుకుని.. ఆయన భక్తులమని చెప్పుకునే ఫ్యాన్స్ ని తిప్పుతున్నారా కూడా అర్దం కావడం లేదు. పార్టీ సీట్లు గెలిచినా గెలవకపోయినా పోటీ చేస్తుంది. పోనీ వేరే పార్టీతో పొత్తు పెట్టుకుంటే.. ఆ పార్టీకి ఉన్న బలం మేరకు ఎన్నో కొన్ని సీట్లు తీసుకుని పోటీ చేస్తుంది. గ్రేటర్ లో యట్ లీస్ట్.. తక్కువలో తక్కువ.. ఓ పదిహేను 20 సీట్లు తీసుకుని కానీ.. పోటీ చేసి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అదో లెక్క. మొన్నేమో.. లేదు లేదు పోటీ చేస్తున్నాం. ఒంటరిగా దిగుతున్నాం అన్నారు. కొంతమంది ఆ మాట విని నామినేషన్లు గట్రా వేశారు. కానీ.. శివరాఖర్కి.. సింగిల్ సీటు కూడా పోటీ చేయడం లేదు అని పోటీ చేసిన వాళ్లు కూడా బ్యాక్ స్టెప్ వేశారు. పైగా పొత్తు అంటున్నారు. ఇదేం పొత్తు సామే.. ఇది పొత్తులా లేదు.. ఇదేదో పొలిటికల్ ప్రచారం చేయబడును అని ఏజెన్సీ పెట్టుకున్నట్లు ఉంది.. ఆ మాత్రం దానికి సెపరేట్ జెండా ఎందుకు సెపరేట్ పార్టీ ఎందుకు అనే వాళ్లూ ఉన్నారు. కానీ.. బీజేపీ పొత్తు ఎవ్వరంలో రోజుకో మాట మాట్లాడుతూ.. పొత్తంటారు. వాళ్లూ వీళ్లూ తొత్తులు అంటూ తిడతారు. మళ్లీ ఢిల్లీ వెళ్లి మోడీని కలిసొస్తారు. ఏపీ వెళ్లి సొంతంగానే పోటీ చేస్తున్నాం అంటారు.. హైదరాబాద్ వచ్చి.. పోటీ చేయడం లేదు.. బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాం.. కేవలం ప్రచారం చేస్తాం అంటారు. అదేంటో కాల్షీట్లు కొనుక్కుని.. ప్రచారానికి పిలిచినట్లుగానే ఉంది తప్ప ఇంకేమైనా కనిపిస్తుందా చెప్పండి. ఇదిలా ఉంటే.. ఏపీలో బీజేపీతో పొత్తు ఉందా లేదా అనే విషయం కూడా క్లారిటీ లేదు. ఆ ఎన్నికల టైంలో అయినా.. ఏమైనా సీట్లు తీసుకుంటారా.. ఓన్లీ జెండాలు పట్టుకుని తిరగడమేనా అనే డౌట్ కూడా వస్తుంది జనాలకి. ఏంటో పవనాలు.. గాలి మళ్లినట్లు తిరగుతున్నారు అని అంటున్నారు జనాలు.

ఆపరేషన్ తెలంగాణ, టార్గెట్ జానారెడ్డి ఫ్యామిలీ

ఆపరేషన్ తెలంగాణ, టార్గెట్ జానారెడ్డి ఫ్యామిలీ

   6 hours ago


నిన్నొక మాట.. ఇవాళ ఒక మాట.. ఇదేంటి కవితమ్మ

నిన్నొక మాట.. ఇవాళ ఒక మాట.. ఇదేంటి కవితమ్మ

   6 hours ago


కాంగ్రెస్‌లో మొద‌లైన పీసీసీ చీఫ్ లొల్లి.. రేసులో ముందున్నానన్న కోమటిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి

కాంగ్రెస్‌లో మొద‌లైన పీసీసీ చీఫ్ లొల్లి.. రేసులో ముందున్నానన్న కోమటిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి

   6 hours ago


కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం.. ఏమి మాట్లాడుతారో అన్న టెన్షన్

కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం.. ఏమి మాట్లాడుతారో అన్న టెన్షన్

   7 hours ago


ఏపీ ఏసీబీ డైరక్టర్‌గా తెలంగాణ రిటైర్డ్ ఐపీఎస్ రెడ్డి..!

ఏపీ ఏసీబీ డైరక్టర్‌గా తెలంగాణ రిటైర్డ్ ఐపీఎస్ రెడ్డి..!

   9 hours ago


టీఆర్ఎస్ నుండి ఎటువంటి ప్రతిపాదన రాలేదంటున్న ఒవైసీ

టీఆర్ఎస్ నుండి ఎటువంటి ప్రతిపాదన రాలేదంటున్న ఒవైసీ

   9 hours ago


సుజనా చౌదరి తండ్రి యలమంచిలి జనార్ధనరావు కన్నుమూత

సుజనా చౌదరి తండ్రి యలమంచిలి జనార్ధనరావు కన్నుమూత

   9 hours ago


 ఇప్పుడు ఇలాగే అంటారులే అసద్ జీ..!

ఇప్పుడు ఇలాగే అంటారులే అసద్ జీ..!

   10 hours ago


సభ్యులను సస్పెండ్ చేయడం బాధగా ఉంది.. తమ్మినేని

సభ్యులను సస్పెండ్ చేయడం బాధగా ఉంది.. తమ్మినేని

   10 hours ago


వైసీపీ చెంతకు రాపాక వరప్రసాద్ కుమారుడు

వైసీపీ చెంతకు రాపాక వరప్రసాద్ కుమారుడు

   10 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle