బీజేపీని పక్కనపెట్టి పవన్ సొంతగా జిల్లాల పర్యటన?!
01-12-202001-12-2020 13:48:46 IST
Updated On 01-12-2020 14:12:03 ISTUpdated On 01-12-20202020-12-01T08:18:46.318Z01-12-2020 2020-12-01T08:18:37.567Z - 2020-12-01T08:42:03.176Z - 01-12-2020

నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఓ వైపు టీడీపీ కోరుతోంది. ప్రభుత్వం ఎలాంటి సాయం ప్రకటించకపోవడంతో పలు రాజకీయ పార్టీలు వైసీపీ ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలని చూస్తూ ఉన్నాయి. ఇంతలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ రైతుల కోసం ప్రజల్లోకి వెళ్తున్నాయి. నివార్ తుపాను వల్ల పాడైన పంటలను పరిశీలించేందుకు కోస్తా, రాయలసీమలకు వెళ్తున్నారు. బుధవారం నుంచి పవన్ పర్యటన ప్రారంభమవుతుంది. బుధవారం గుంటూరు జిల్లాలో ఆ తర్వాత 3,4,5 తేదీల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటిస్తారు. పంట నష్టపోయిన రైతులతో సమావేశమవుతారు. ఈ టూర్ కు బీజేపీతో ఎటువంటి సంబంధం లేదని అంటున్నారు. అందుకే కేవలం జనసేన పార్టీ తరపున పవన్ కల్యాణ్ రంగంలోకి దిగాలని అనుకున్నారని.. అనుకున్నట్లుగానే కార్యాచరణ రూపుదిద్దుకుందని జనసేన వర్గాలు అంటున్నాయి.చిత్తూరు జిల్లాలో.. ముఖ్యంగా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ పర్యటించబోతున్నారు. అక్కడ తన బలాన్ని ఆయన ప్రదర్శించే అవకాశం ఉంది. తిరుపతిలో పోటీ చేయాలని జనసేన అనుకుంటున్న తరుణంలో ప్రజల్లోకి పవన్ వెళ్లడం జనసేనకు చాలా మంచి చేయనుంది. రైతులకు భరోసా ఇస్తూ ధైర్యం చెప్పడమే కాకుండా.. తిరుపతిలో తమ బలాన్ని ప్రదర్శించాలని.. ఈ పర్యటన చేపట్టారనే అంటున్నారు. ఓ వైపు ప్రభుత్వం మీద ఒత్తిడి.. మరో వైపు ప్రజలకు నేనున్నాననే భరోసాను ఒకే టూర్ ద్వారా ఇవ్వాలని పవన్ అనుకుంటున్నారు. ఏది ఏమైనా పవన్ జనాల్లోకి వెళ్లడం జనసేన పార్టీ మనుగడకు ఎంతో మంచిని చేస్తుంది.

పంచాయితీ కోసం టీడీపీ పంచసూత్రాలు
2 minutes ago

రామ తీర్థానికి కొత్త కళ
18 minutes ago

బరిలోకి దిగిన జనసేన.. పవన్ వర్సెస్ జగన్ ఫైట్
28 minutes ago

ఏకగ్రీవాల్లోనూ.. ఎవరి దారి వారిదేనా..
2 hours ago

కర్నాటకలోని మరాఠీ ప్రాంతాలు మావే.. ఉద్ధవ్ వ్యాఖ్యతో వివాదం
4 hours ago

జాతీయ జెండాను అవమానిస్తే సహించం.. కాంగ్రెస్‌పై బీజేపీ ఆరోపణ
6 hours ago

ఏకగ్రీవాలపై పేపర్ ప్రకటన.. ఎవరిని అడిగి ఇచ్చారని సంజాయషి ఇవ్వాల్సిందే..
7 hours ago

రైతుల ఉద్యమంలో విధ్వంసకారులు.. 200 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
7 hours ago

వైసీపీలో గ్రూపుల కొట్లాట.. ఏకగ్రీవం కోసం ఫైటింగ్ లు
5 hours ago

ఏకగ్రీవం తొలి బోణీ కొట్టిన వైసీపీ..
8 hours ago
ఇంకా