newssting
Radio
BITING NEWS :
నిర్మల్ లోని అనంతపేటలో దారుణం. మద్యంమత్తులో కూతురిని చంపిన తండ్రి. 4 ఏళ్ల కూతురిని కొట్టి చంపిన మహేష్. * రైతులకు అండగా ఈ నెల 7న ఏపీ వ్యాప్తంగా జనసేన ఆందోళనలు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు రూ.35 వేలు చెల్లించాలని డిమాండ్ చేసిన పవన్ కల్యాణ్. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం మంచి పరిణామమన్న పవన్. * నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీతో భేటీ కానున్న బండి సంజయ్. ఎన్నికలు జరిగిన తీరు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ. * కృష్ణాజిల్లా గన్నవరం వద్ద ఆగిఉన్న లారీని ఢీ కొట్టిన కారు. ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు. *మాజీ మంత్రి కమతం రామిరెడ్డి (82) కన్నుమూత. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామిరెడ్డి. రామిరెడ్డి మృతిపట్ల సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్. * తిరుపతిలో ఆన్ లైన్ వ్యభిచారం గుట్టురట్టు. జీవకోనలో ముఠాను అరెస్ట్ చేసిన సీఐడీ.

పవన్ పోలవరం యాత్ర.. మరో దుమారం తప్పదా?!

20-11-202020-11-2020 10:02:38 IST
2020-11-20T04:32:38.574Z20-11-2020 2020-11-20T04:31:34.833Z - - 06-12-2020

పవన్ పోలవరం యాత్ర.. మరో దుమారం తప్పదా?!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాము పోలవరం మీద నిపుణులు, జర్నలిస్టులు, ఇతర మేధావులతో చర్చించి ఒక నివేదిక తయారు చేసి కేంద్రానికి ఇస్తామని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. పోలవరం మీద కేంద్రానికి నిజానిజాలు తెలియజేస్తామని పవన్ కళ్యాణ్ చెప్పడం కాస్త కొత్తగా అనిపిస్తోంది. పవన్ పోరాటాలు అన్ని ఇలాగే ఉంటాయని విమర్శలు ఓ వైపు వస్తుంటే.. పోలవరంలో జరిగిన అక్రమాలు, జరగాల్సిన పనులపై ఒక పార్టీ అధ్యక్షుడి హోదాలో నివేదిక అందజేయడం గొప్పవిషయమే అని అంటున్నారు. పోలవరం విషయంలో కొత్తగా తెలుసుకోవాల్సింది ఏమి లేదని.. జరగాల్సిన పనులే ఉన్నాయని అంటున్నారు మరి కొందరు. విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్ట్ గా పోలవరంను ప్రకటించినా.. ఈ ప్రాజెక్టు చుట్టూ ఎన్నో రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. 

త్వరలోనే జనసేనాని పోలవరం ప్రాజెక్టును పరిశీలించబోతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పోలవరాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్, తెలుగుదేశం ప్రభుత్వం చెబుతున్నట్లుగా 2018 లోపు పనులు పూర్తి కావు అని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల పట్ల  తెలుగుదేశం నాయకులు పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడ్డారు. 2019లో అధికారంలోకి వచ్చిన వై ఎస్ ఆర్ సి పి, 2021 లోపు పోలవరం పూర్తి చేసి చూపిస్తామని అన్నప్పటికీ.. అది జరిగే పని అసాధ్యం అంటున్నారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కేంద్ర ప్రభుత్వమే దీని పూర్తి చేయాలని చెప్పుకొచ్చారు. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ పోలవరం సందర్శనకు వెళుతూ ఉండడంతో ఏమి జరుగుతుందో అని అందరూ భావిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఈసారి పోలవరం పర్యటన సందర్భంగా ఏం మాట్లాడతారు అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది.

ఆపరేషన్ తెలంగాణ, టార్గెట్ జానారెడ్డి ఫ్యామిలీ

ఆపరేషన్ తెలంగాణ, టార్గెట్ జానారెడ్డి ఫ్యామిలీ

   5 hours ago


నిన్నొక మాట.. ఇవాళ ఒక మాట.. ఇదేంటి కవితమ్మ

నిన్నొక మాట.. ఇవాళ ఒక మాట.. ఇదేంటి కవితమ్మ

   6 hours ago


కాంగ్రెస్‌లో మొద‌లైన పీసీసీ చీఫ్ లొల్లి.. రేసులో ముందున్నానన్న కోమటిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి

కాంగ్రెస్‌లో మొద‌లైన పీసీసీ చీఫ్ లొల్లి.. రేసులో ముందున్నానన్న కోమటిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి

   6 hours ago


కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం.. ఏమి మాట్లాడుతారో అన్న టెన్షన్

కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం.. ఏమి మాట్లాడుతారో అన్న టెన్షన్

   7 hours ago


ఏపీ ఏసీబీ డైరక్టర్‌గా తెలంగాణ రిటైర్డ్ ఐపీఎస్ రెడ్డి..!

ఏపీ ఏసీబీ డైరక్టర్‌గా తెలంగాణ రిటైర్డ్ ఐపీఎస్ రెడ్డి..!

   8 hours ago


టీఆర్ఎస్ నుండి ఎటువంటి ప్రతిపాదన రాలేదంటున్న ఒవైసీ

టీఆర్ఎస్ నుండి ఎటువంటి ప్రతిపాదన రాలేదంటున్న ఒవైసీ

   9 hours ago


సుజనా చౌదరి తండ్రి యలమంచిలి జనార్ధనరావు కన్నుమూత

సుజనా చౌదరి తండ్రి యలమంచిలి జనార్ధనరావు కన్నుమూత

   9 hours ago


 ఇప్పుడు ఇలాగే అంటారులే అసద్ జీ..!

ఇప్పుడు ఇలాగే అంటారులే అసద్ జీ..!

   10 hours ago


సభ్యులను సస్పెండ్ చేయడం బాధగా ఉంది.. తమ్మినేని

సభ్యులను సస్పెండ్ చేయడం బాధగా ఉంది.. తమ్మినేని

   10 hours ago


వైసీపీ చెంతకు రాపాక వరప్రసాద్ కుమారుడు

వైసీపీ చెంతకు రాపాక వరప్రసాద్ కుమారుడు

   10 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle