newssting
Radio
BITING NEWS :
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలోని సోలా ప్రాంతంలో పౌల్ట్రీ ఫాంలో బర్డ్ ఫ్లూ ప్రబలింది. అహ్మదాబాద్ నగరంలో సేకరించిన శాంపిళ్ల పరీక్షల్లో బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ ఉందని తేలింది. దీంతో అహ్మదాబాద్ జిల్లాలో ముందుజాగ్రత్తగా మాంసం, చికెన్ విక్రయాలను జిల్లా కలెక్టరు నిషేధించారు * బెంగాల్ బీజేపీ ఎన్నికల పరిశీలకుడైన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్‌కు జడ్ కేటగిరి భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది * దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరపాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆశయమైన ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ అంశం కర్ణాటక శాసనసభను కుదిపేసింది. రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో రెండురోజులు పూర్తిగా ఇదే అంశంపై చర్చించనున్నారు * భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి జార్ఖండ్‌లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి * తన నేతృత్వంలో మూడో కూటమి ఏర్పాటు ఖాయమని, అయితే, ఎస్‌ఎంకే, ఐజేకేలతో ఇంకా పొత్తు ఖరారు కాలేదని మక్కల్‌ నీది మయ్యం నేత కమల్‌ తెలిపారు. కేవలం చేతులు మాత్రం కలిపామని, పొత్తుకు చర్చలు జరగాల్సి ఉందన్నారు * కర్ణాటకలో సంచలనం రేపిన మంత్రి రమేశ్‌ జార్కిహోళి రాసలీలల వీడియో వెనుక ఓ ఎమ్మెల్యే హస్తం ఉందని పుకార్లు వస్తున్నాయి. విచారణ నిమిత్తం రాసలీలల వీడియోలో ఉన్న అమ్మాయి కోసం బెంగళూరు కబ్బన్‌పార్క్‌ పోలీసులు గాలిస్తున్నారు. సుమారు ఏడాది నుంచి వారి మధ్య బాగోతం కొనసాగుతోందని తెలుస్తోంది * ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రధాన ఆలయ ప్రవేశద్వారం వద్ద ఆయనకు టీటీడీ ఈఓ కేఎస్‌ జనవహర్‌రెడ్డి, అదనపు ఈఓ ధర్మారెడ్డి, సీవీఎస్‌ఓ గోపీనాథ్‌ ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఈఓ తీర్థ ప్రసాదాలు అందించి, స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు * గుజరాత్‌లోని కెవాడియాలో శనివారం సైనిక కమాండర్ల సమావేశం జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ హాజరై మేధోమధన సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దేశ భద్రత, త్రివిధ దళాల సన్నద్ధత, సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై సైతం సమీక్ష జరుపనున్నారు * కేరళలో అధికారాన్ని కైవసం చేసుకోవటమే లక్ష్యంగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఇటీవలే పార్టీలో చేరిన మెట్రోమ్యాన్‌ శ్రీధరన్‌ను ఎన్డీఏ తరఫున సీఎం అభ్యర్థిగా రాష్ట్ర బీజేపీ యూనిట్‌ ఎంపిక చేసింది * సరూర్‌నగర్‌ చెరువు మినీ ట్యాంక్‌బండ్‌లో మొసలి ప్రతక్ష్యమైంది. గ్రీన్‌పార్క్‌ కాలనీ సమీపంలో అటుగా వెళ్తున్న స్థానికులు మొసలి కనిపించడంతో తమ కెమెరాలో బంధించారు. మొసలి చెరువులోకి ఎలా వచ్చింది? ఒకటే ఉందా లేకా ఇంకా ఉన్నాయా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి * జీహెచ్‌ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారుల నియంత్రణ కొరవడిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సిందేనని తేల్చిచెప్పింది. అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది * గురు‌వారం అత్యధికంగా భద్రా‌చ‌లంలో 39.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌దైంది. ఆది‌లా‌బాద్‌, మహ‌బూ‌బ్‌‌న‌గర్‌, నిజా‌మా‌బాద్‌, పెద్దపల్లి తది‌తర జిల్లాల్లో 37 డిగ్రీ‌ల‌కు‌పై‌గానే గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఆది‌లా‌బా‌ద్‌లో 13.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌దైంది * రాష్ట్ర గవర్నర్‌, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రతిష్టాత్మక టాప్‌-20 గ్లోబల్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌–2021 పురస్కారానికి ఎంపికయ్యారు. యూఎస్‌ కాంగ్రెస్‌మ్యాన్‌ డానికే డేవిస్‌ నేతృత్వంలోని మల్టీ ఎత్నిక్‌ అడ్వైజరీ టాస్క్‌ ఫోర్స్‌ ఈ అవార్డును ప్రకటించింది * సిద్దిపేట జిల్లా తోగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే రఘునందన్‌రావు పిలుపు మేరకు.. మల్లన్నసాగర్ ముట్టడికి బయల్దేరిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేసి భూంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీజేపీ నేతల అరెస్ట్‌తో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది * భద్రాచలంలో ఏప్రిల్‌ 21న జరగనున్న శ్రీరామనవమి మహోత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే భక్తులకు శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు అందుబాటులో ఉంచుతున్నట్లు భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి తెలిపారు * ఫిబ్రవరిలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.90.8 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. కాగా.. ఫిబ్రవరి నెలలో 14.41 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఏప్రిల్ 13 నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి లభించింది. గురువారం 25,534 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.31 కోట్లు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. ఈ నెల 14న పురంధరదాసు 967వ అవతారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 28 నుంచి 5 రోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు జరగనున్నాయి * విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. డిపోల పరిధిలోని 960 బస్సులు నిలిచిపోయాయి. వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూసివేశారు * ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం శాంతి నగర్ వద్ద ఆగి ఉన్న లారీని ఆరంజ్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 15 మందికి గాయాలయ్యాయి * విశాఖ ప్లాంట్‌ ఏ-షిఫ్ట్‌లో కార్మికులు విధులు బహిష్కరించారు. కూర్మన్నపాలెం వద్ద రహదారిపై కార్మికులు బైఠాయించారు. రాష్ట్ర బంద్‌లో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. నగరంలో బస్‌స్టాండ్ వద్ద కార్మిక సంఘాలు, వామపక్ష నేతల నిరసన చేపట్టారు.

అన్నా రాంబాబుపై జనసేనాని ఆగ్రహం.. అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వమంటూ హెచ్చరిక

23-01-202123-01-2021 20:33:40 IST
Updated On 23-01-2021 18:12:28 ISTUpdated On 23-01-20212021-01-23T15:03:40.240Z23-01-2021 2021-01-23T09:45:45.365Z - 2021-01-23T12:42:28.447Z - 23-01-2021

అన్నా రాంబాబుపై జనసేనాని ఆగ్రహం.. అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వమంటూ హెచ్చరిక
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. గిద్దలూరు ఎమ్మెల్యే తిట్టడం, ఆ తర్వాత వైసీపీ కార్యకర్తల వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న జనసేన కార్యకర్త బండ్ల వెంగయ్యనాయుడు కుటుంబాన్ని పరామర్శించడానికి జనసేనాని వెళ్లారు.

వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై జనసేనాని పవన్ ఆగ్రహం వ్యక్తం చెందారు.. అన్నా రాంబాబు వల్లే జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. గ్రామ సమస్యపై రాంబాబుని నిలదీసినందుకు... ఆయనను చంపేశారని.. ప్రశ్నించే వారి కుటుంబాలను నాశనం చేయాలనుకుంటే కుదరదని చెప్పారు. ఇలాంటి దారుణాలు ఎక్కువైతే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని అన్నారు. అన్నా రాంబాబూ గుర్తుంచుకో.. నిన్ను అధఃపాతాళానికి తొక్కేస్తాం జగన్ రెడ్డి గారూ.. మీ ఎమ్మెల్యే చేసిన పనికి ఆయనను శిక్షిస్తారా? అంత ధైర్యం మీకు ఉందా? అని ప్రశ్నించారు.

ఏం తప్పుచేసాడని వెంగయ్య ప్రాణాలు కోల్పోయారని.. గ్రామ సమస్యపై ఎమ్మెల్యే ప్రశ్నించడం తప్పా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే మాటలకు మానసిక వేదనకు గురయ్యారని.. ప్రశ్నించినందుకే వెంగయ్యను చంపేశారని ఆరోపించారు. ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యేలు ఎన్నికల్లో రూ. కోట్లు ఖర్చు పెడుతున్నారు.. కానీ పేదల బతుకులు మాత్రం మారడం లేదన్నారు. జనసేన కార్యకర్తలపై పదే పదే దాడులు చేస్తే ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసన్నారు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా.. వచ్చే ఎన్నికల్లో అన్నా రాంబాబు అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చూసే బాధ్యత తాము తీసుకుంటామన్నారు. 

పోలీసు వ్యవస్థను కూడా ఈ ప్రభుత్వం నాశనం చేస్తోందని.. జర్నలిస్టులను కూడా వదలడం లేదని అన్నారు. మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా? లేక ఫ్యూడలిస్టు వ్యవస్థలో ఉన్నామా? అనే విషయాన్ని జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు.వెంగయ్యనాయుడు ఆత్మహత్య విషయంలో పవన్ కళ్యాణ్ ఇప్పటికే.. ఎమ్మెల్యే అన్నా రాంబాబుతో పాటు… వెంగయ్యను బెదిరించిన వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.  పోలీసులు గ్రామంలో కొంత మందిపై కేసులు పెట్టారు. వెంగయ్య చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వెంగయ్య కుటుంబానికి జనసేన తరపున రూ.8లక్షల 50వేలు ఆర్ధిక సాయాన్ని పవన్ అందించారు. వెంగయ్య నాయుడు పిల్లల చదువులు పూర్తయ్యే వరకూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

తిరుపతిలో జనసేన పోటీపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

కాంగ్రెస్‌లో ఉండి ఉంటే సింధియానే సీఎం... రాహుల్

కాంగ్రెస్‌లో ఉండి ఉంటే సింధియానే సీఎం... రాహుల్

   3 hours ago


బీజేపీలోకి కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర్.. భార్య ఒత్తిడే కార‌ణ‌మా

బీజేపీలోకి కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర్.. భార్య ఒత్తిడే కార‌ణ‌మా

   2 hours ago


విశాఖ ఉక్కు 100 శాతం ప్రైవేటుకే.. ఏపీ స‌ర్కార్ కు ముందే తెలుసు

విశాఖ ఉక్కు 100 శాతం ప్రైవేటుకే.. ఏపీ స‌ర్కార్ కు ముందే తెలుసు

   4 hours ago


వివాదంలో అశోక్‌గజపతిరాజు.. మహిళను కొట్టారా..?

వివాదంలో అశోక్‌గజపతిరాజు.. మహిళను కొట్టారా..?

   2 minutes ago


నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. బీజేపీపై మండిపడ్డ కేటీఆర్

నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. బీజేపీపై మండిపడ్డ కేటీఆర్

   19 hours ago


కేతిరెడ్డిపై ఫైర్ అయిన పరిటాల శ్రీరామ్..!

కేతిరెడ్డిపై ఫైర్ అయిన పరిటాల శ్రీరామ్..!

   21 hours ago


కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తా, శత్రుత్వమా.. డైలమ్మాలో కార్యకర్తలు

కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తా, శత్రుత్వమా.. డైలమ్మాలో కార్యకర్తలు

   a day ago


వైసీపీ రౌడీయిజానికి బ్రేకులేస్తాం

వైసీపీ రౌడీయిజానికి బ్రేకులేస్తాం

   a day ago


ఇదేం  అన్యాయం.. హ‌ర్ట్ అయిన విడ‌ద‌ల ర‌జ‌నీ ఫ్యాన్స్

ఇదేం అన్యాయం.. హ‌ర్ట్ అయిన విడ‌ద‌ల ర‌జ‌నీ ఫ్యాన్స్

   a day ago


దేశ వ్యాప్తంగా ఆ నియోజ‌క వ‌ర్గం గెలుపు పై ఫోక‌స్

దేశ వ్యాప్తంగా ఆ నియోజ‌క వ‌ర్గం గెలుపు పై ఫోక‌స్

   12 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle