newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పవన్ కళ్యాణ్ తిరుపతిలో పాదయాత్ర.. బండి సంజయ్ ప్రచారం చేసే అవకాశం..!

31-03-202131-03-2021 21:20:29 IST
Updated On 31-03-2021 09:30:42 ISTUpdated On 31-03-20212021-03-31T15:50:29.654Z31-03-2021 2021-03-31T03:10:15.053Z - 2021-03-31T04:00:42.143Z - 31-03-2021

పవన్ కళ్యాణ్ తిరుపతిలో పాదయాత్ర.. బండి సంజయ్ ప్రచారం చేసే అవకాశం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికను భారతీయ జనతా పార్టీ, జనసేన సీరియస్ గా తీసుకున్నాయి. ఓటర్లను ఆకర్షించడానికి పెద్ద ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. పవన్ కళ్యాణ్ ను కూడా ప్రచారంలోకి దింపనున్నారు. పవన్ కళ్యాణ్ ఏప్రిల్ 3న తిరుపతిలో బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏప్రిల్ 3న తిరుపతిలోని ఎంఆర్‌పల్లి సర్కిల్ నుంచి శంకరంబాడి వరకు జరిగే పాదయాత్రలో పవన్ పాల్గొంటారని తెలిపారు. అక్కడ జరిగే భారీ బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తారని అన్నారు. 

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పాల్గొనే అవకాశం ఉందని కూడా అంటున్నారు. బైబిల్‌ పార్టీ కావాలో, భగవద్గీత పార్టీ కావాలో తిరుపతి ప్రజలు తేల్చుకోవాలంటూ కొద్ది రోజుల కిందట ఆయన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తిరుపతిలో సంజయ్‌ లాంటి నాయకుల ప్రచారం తమకు ఎక్కువ ఓట్లు తెప్పించే అవకాశం ఉందని ఏపీ బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఆయన్ను ప్రచారంలో దింపాలని ఏపీ బీజేపీ నేతలు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఏప్రిల్‌ 14న తిరుపతిలో నిర్వహించే భారీ ర్యాలీలో సంజయ్‌ పాల్గొనే అవకాశం ఉందని కూడా అంటున్నారు. 

తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికల్లో నామినేషన్‌ ప్రక్రియ ముగిసింది. మంగళవారం చివరి రోజు కావడంతో 19 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 47 మంది అభ్యర్థులు నామినేషన్‌ను వేశారు. నేడు నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్‌ 3న ఉపసంహరణ, ఏప్రిల్‌ 17న పోలింగ్‌ జరగనుంది.నెల్లూరులో నాలుగు, చిత్తూరులో మూడు మొత్తం ఏడు నియోజకవర్గాల్లో ఈ పోలింగ్‌ జరగనుంది. ఈ నియోజకవర్గాల్లో 17,03,836 మంది ఓటర్లు ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. కోవిడ్‌, వేసవి కారణంగా గతం కంటే రెండు గంటలు సమయం పెంచారు. మొత్తం 1993 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మే 2 ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. వైఎస్సార్‌సీపీ నుంచి డాక్టర్ గురుమూర్తి, టీడీపీ నుంచి పనబాక లక్ష్మి, బీజేపీ నుంచి రత్నప్రభ, కాంగ్రెస్ నుంచి చింతా మోహన్‌లు బరిలోకి దిగారు.

తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   20 minutes ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   an hour ago


వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   15 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   11 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   13 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   15 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   18 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   19 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   21 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   a day ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle