newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కేతిరెడ్డిపై ఫైర్ అయిన పరిటాల శ్రీరామ్..!

08-03-202108-03-2021 15:37:33 IST
2021-03-08T10:07:33.269Z08-03-2021 2021-03-08T10:07:27.462Z - - 11-04-2021

కేతిరెడ్డిపై ఫైర్ అయిన పరిటాల శ్రీరామ్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

అనంతపురం జిల్లా ధర్మవరంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పై పరిటాల శ్రీరామ్ సంచలన ఆరోపణలు చేశారు. మొదటి సారి ఎమ్మెల్యే కాగానే ఇల్లు కట్టావ్... రెండోసారి ఎమ్మెల్యే కాగానే గుర్రాల కోట కట్టుకున్నావ్. గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం పేరుతో విలువైన భూములు కబ్జా చేస్తున్నావ్... నీ ఒత్తిడి తట్టుకోలేక ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారంటూ శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాప్తాడులో తంతే ధర్మవరం వచ్చారని ఎమ్మెల్యే కేతిరెడ్డి తమపై వ్యాఖ్యలు చేశారని.. ప్రజల తీర్పు గౌరవిస్తామని, తప్పులుంటే దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తామన్నారు. ధర్మవరంలో ఆయన్ను గతంలో తంతే మూడేళ్లు కనిపించకుండా పోయారని అన్నారు పరిటాల శ్రీరామ్. పరిటాల సునీత ఐదేళ్లు మంత్రిగా ఉంటే ధర్మవరం రాలేదని కేతిరెడ్డి వ్యాఖ్యలు చేశారని.. అంత సీనియర్ వచ్చి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని ధర్మవరంకు తాను చాలు అని పరిటాల శ్రీరామ్ వ్యాఖ్యలు చేశారు. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తండ్రి ఎవరి పుణ్యాన ఎమ్మెల్యే అయ్యారో జిల్లా ప్రజలకు తెలుసని.. తాడిపత్రి వెళ్లి తన చిన్నాన్న పెద్దారెడ్డిని అడిగితే ఎవరి పుణ్యాన గెలిచారో చెబుతారన్నారు. 

2004లో తాడిపత్రిలో నామినేషన్ కూడా వేయలేని పరిస్థితి ఉందని, పరిటాల రవీంద్ర ఉండబట్టే కేతిరెడ్డి తండ్రి నామినేషన్ వేశారన్నారు. జేసీ దివాకర్ రెడ్డి టీడీపీలోకి వస్తే ఏం చేస్తున్నారని కేతిరెడ్డి ప్రశ్నించారని.. అది పార్టీ నిర్ణయం.. ప్రజలకు మేలు జరుగుతుందనే జేసీని పార్టీలోకి తీసుకున్నామన్నారు పరిటాల శ్రీరామ్. ఎమ్మెల్యే కేతిరెడ్డి తండ్రి చనిపోతే.. తెలుగుదేశం జెండా మీద కప్పుకుని ఆ కార్యక్రమాలు నిర్వహించారన్నారు పరిటాల శ్రీరామ్. ఆ రోజు ఎవరైతే చంపారన్నావో.. వాళ్లు ఏ పార్టీలో ఉన్నారు. జేసీ దివాకర్ రెడ్డి ప్రత్యర్థి అని చెబుతున్నావు.. ఆ రోజు టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఎలా వెళ్లావు. పదవి కావాలా.. ఖూనీ కేసు రాజీ అవుతావా అంటే పదవే కావాలి అన్నావు.. ఖూనీ కేసు రాజీ చేసుకుని.. ఎమ్మెల్యేగా ఉండి తండ్రి హత్య కేసులో సాక్ష్యం చెప్పలేకపోయలేవు. మీ చరిత్ర ఏంటో ముందు తెలుసుకోవాలంటూ సంచలన వ్యాఖ్యలు పరిటాల శ్రీరామ్ చేశారు. 

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   16 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   12 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   14 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   19 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   a day ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   a day ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle