ఏకగ్రీవాలపై పేపర్ ప్రకటన.. ఎవరిని అడిగి ఇచ్చారని సంజాయషి ఇవ్వాల్సిందే..
28-01-202128-01-2021 09:28:26 IST
Updated On 28-01-2021 09:31:32 ISTUpdated On 28-01-20212021-01-28T03:58:26.453Z28-01-2021 2021-01-28T03:58:23.464Z - 2021-01-28T04:01:32.550Z - 28-01-2021

ఏకగ్రీవ ఎన్నికలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం పత్రికా ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే..! రాష్ట్రంలో ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తూ పంచాయతీలకు బహుమతులు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఏపీ ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు ఇచ్చే ప్రోత్సాహకాలను పెంచుతూ జీవో జారీ చేసింది. పంచాయతీ జనాభాను బట్టి గరిష్టంగా రూ.20 లక్షల వరకు ఇవ్వనున్నారు. 2 వేల లోపు జనాభా ఉంటే రూ.5 లక్షలు, 5 వేల వరకు జనాభా ఉంటే రూ.10 లక్షలు, 10 వేల వరకు జనాభా ఉంటే రూ.15 లక్షలు, 10 వేల జనాభా దాటితే రూ.20 లక్షల వరకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు ఏపీ పంచాయతీ రాజ్ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. గ్రామాల్లో సహృద్భావ వాతావరణం ఏర్పాటు చేసేందుకే ప్రోత్సాహకం ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రకటనపై ఫిర్యాదులు అందాయని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల కమిషన్ సలహా లేకుండానే ప్రభుత్వం పేపర్ ప్రకటన ఇచ్చిందని ఆయన అన్నారు. ఈ ప్రకటన మీద సంబంధిత అధికారులను ఇప్పటికే సంజాయిషీ కోరానని ఆయన అన్నారు. గతంలో జరిగిన ఎంపీటీసీ, జడ్పిటిసి ఏకగ్రీవాల మీద విచారణ జరుగుతోందని.. వాటి మీద ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు. అప్పట్లో బెదిరించి ఏకగ్రీవాలు చేశారని ప్రతిపక్షాలు తన దృష్టికి తీసుకు వచ్చాయని, సాధారణ ఏకగ్రీవాలు ఎవరు తప్పు పట్టరు కానీ అపరిమిత ఏకగ్రీవాలు జరిగితే తమ జోక్యం తప్పనిసరిగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఎన్నికల్లో పోటీ చేయాలని భావించే వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే అని ఆయన పేర్కొన్నారు. ఇక మీదట పత్రికా ప్రకటన ఇవ్వాలనుకుంటే ముందే అనుమతులు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలను ఇచ్చారు. ఏకగ్రీవాలపై ప్రకటన ఇచ్చేటప్పుడు ఎస్ఈసీని సంప్రదించాల్సి ఉందని స్పష్టం చేశారు. ఆ పత్రికా ప్రకటను ఐ అండ్ పీఆర్ విభాగం ఇచ్చినట్టు గుర్తించామని, దానిపై ఐ అండ్ పీఆర్ విభాగాన్ని వివరణ కోరతామని అన్నారు. ఇద్దరు అధికారులపై చర్యల గురించి ఓ నేత మాట్లాడారని.. మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న అంశాన్ని ఆయన గమనించాలని.. నేతలు లక్ష్మణరేఖ దాటొద్దని అన్నారు. గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ పై తనకెలాంటి కక్ష లేదని నిమ్మగడ్డ స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌లో ఉండి ఉంటే సింధియానే సీఎం... రాహుల్
3 hours ago

బీజేపీలోకి కాంగ్రెస్ సీనియర్ లీడర్.. భార్య ఒత్తిడే కారణమా
3 hours ago

విశాఖ ఉక్కు 100 శాతం ప్రైవేటుకే.. ఏపీ సర్కార్ కు ముందే తెలుసు
4 hours ago

వివాదంలో అశోక్‌గజపతిరాజు.. మహిళను కొట్టారా..?
26 minutes ago

నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. బీజేపీపై మండిపడ్డ కేటీఆర్
19 hours ago

కేతిరెడ్డిపై ఫైర్ అయిన పరిటాల శ్రీరామ్..!
21 hours ago

కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తా, శత్రుత్వమా.. డైలమ్మాలో కార్యకర్తలు
a day ago

వైసీపీ రౌడీయిజానికి బ్రేకులేస్తాం
a day ago

ఇదేం అన్యాయం.. హర్ట్ అయిన విడదల రజనీ ఫ్యాన్స్
a day ago

దేశ వ్యాప్తంగా ఆ నియోజక వర్గం గెలుపు పై ఫోకస్
12 hours ago
ఇంకా