newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

19-04-202119-04-2021 17:10:59 IST
Updated On 19-04-2021 09:57:32 ISTUpdated On 19-04-20212021-04-19T11:40:59.552Z19-04-2021 2021-04-19T03:44:19.003Z - 2021-04-19T04:27:32.757Z - 19-04-2021

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తిరుపతి ఉప ఎన్నికలో అధికార వైసీపీ నేతలు అడ్డగోలుగా వ్యవహరించారని.. బయట ప్రాంతాల నుంచి వేలాది మందిని తీసుకువచ్చి దొంగ ఓట్లు వేయించుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని టీడీపీ నాయకులు ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో వైసీపీ గెలవడానికి ఎన్నో కుతంత్రాలు పన్నిందని అన్నారు. ఉప ఎన్నికలో ఎవరు రిగ్గింగ్‌ చేశారో ప్రమాణం చేద్దామా? అంటూ పనబాక లక్ష్మి సవాల్‌ విసిరారు. వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం(గురువారం) రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయాలని అన్నారు.

పోలీసులు ఈ విషయాన్ని కనీసం పట్టించుకోవడం లేదని.. డీజీపీ సీసీ కెమెరాలను ఆన్‌చేసి చూస్తే తిరుపతి నగరంలో ఏం జరిగిందో తెలుస్తుందన్నారు. తిరుపతి అసెంబ్లీ స్థానం పరిధిలో రీ పోలింగ్‌కు కోసం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ను సోమవారం మరోసారి కలవాలని టీడీపీ నాయకత్వం నిశ్చయించింది. ఢిల్లీలో ఉన్న ఆ పార్టీ ఎంపీలు ఈసీని కలవనున్నారు. తిరుపతిలో భారీగా దొంగ ఓట్లు వేశారని ఆరోపిస్తున్న టీడీపీ.. శనివారం జరిగిన పోలింగ్‌ను రద్దు చేసి మళ్లీ పోలింగ్‌ జరపాలని డిమాండ్‌ చేస్తోంది.  

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బలగాలతో తిరుపతి ఉప ఎన్నిక జరిగిందని టీడీపీ ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని శనివారం జరిగిన ఉప ఎన్నికతో స్పష్టమైందని ఆయన అన్నారు. తిరుపతి ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వేసుకోలేకపోయారని.. ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ఏ విధంగా ఖూనీ చేసిందో రాష్ట్ర ప్రజలతో పాటు ప్రపంచమంతా చూసిందని నిమ్మల రామానాయుడు అన్నారు.

దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన బయట ప్రాంత వ్యక్తులు పెద్దిరెడ్డి కల్యాణ మండపంలో బసచేశారని ఆరోపించారు. వేలాది డూప్లికేట్‌ ఓటర్‌ ఐడీలు, నకిలీ ఐడీలు దొరికాయని, వీటిపై పెద్దిరెడ్డి తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. డీజీపీ తన స్వామి భక్తిని చాటుకోవడానికి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పెద్దిరెడ్డిపై చర్యలు తీసుకుని వెంటనే అరెస్టు చేయాలన్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఎన్నికల ప్రక్రియ చేసిన జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని గవర్నర్‌ బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 

రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

   8 minutes ago


రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

   19 minutes ago


జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   14 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   16 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   20 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   19 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle