newssting
Radio
BITING NEWS :
* ఏపీ లో వివాదంగా మారిన గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేత, అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జీవీఎంసీ, గీతం వర్సిటీ యాజమాన్యం మధ్య ల్యాండ్ వార్ * హైదరాబాద్: నేపాల్ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు, నాచారం లో జరిగిన చోరీ కేసులో నేపాల్ ముఠా అరెస్ట్ * జూరాల ప్రాజెక్ట్ వరద ఉదృతి, 6 గేట్లు ఎత్తివేత ఇన్ ఫ్లో 92,800 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 94,721 క్యూసెక్కులు * ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు సిపిఐ నేత రామకృష్ణ లేఖ అమరావతి రైతులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం తగదు

అమెరికా విద్యపై ఆన్‌లైన్‌ సదస్సుకు వంద విదేశీ వర్శిటీలు

30-09-202030-09-2020 11:43:37 IST
2020-09-30T06:13:37.435Z30-09-2020 2020-09-30T06:13:35.410Z - - 26-10-2020

అమెరికా విద్యపై ఆన్‌లైన్‌ సదస్సుకు వంద విదేశీ వర్శిటీలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విదేశాల్లో చదువుకోవాలనే ఆసక్తి ఉన్న విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అమెరికాలోని 100 అత్యుత్తమ విశ్వవిద్యాలయాలను తొలిసారి ఒకే వేదికపైకి తీసుకొస్తోంది. విద్యార్థులకు అత్యుత్తమ విద్యావకాశాలను కల్పించే దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరో వినూత్న ప్రయత్నం చేపడుతోంది. ఆన్‌లైన్‌ సదస్సు ద్వారా అమెరికాలో విద్యాభ్యాస అవకాశాలు, ఆర్థిక ప్రోత్సాహకాలు, గుర్తింపు తదితర అనేక అంశాలపై విశ్వ విద్యాలయాల అధికారులు విద్యార్థులకు నేరుగా సమాచారం అందిస్తారు. 

రాష్ట్రంలో విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నత విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ నేతృత్వంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌ చంద్ర, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి డాక్టర్‌ ఎం.హరికృష్ణ ఇతర ఉన్నతాధికారులు విదేశీ విద్యావకాశాలు కల్పించే దిశగా పలు చర్యలు చేపట్టారు. 

కరోనా నేపథ్యంలో విద్యార్థుల కోసం అమెరికాలోని విశ్వవిద్యాలయాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి మన రాష్ట్ర విద్యార్థులకు ప్రత్యక్షంగా అవగాహన కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వ విదేశీ విద్యా విభాగం ద్వారా ఈ సదస్సు నిర్వహిస్తున్నామని ఆ విభాగం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ కుమార్‌ అన్నవరపు తెలిపారు.  

ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ నిర్వహించే వార్షిక యూఎస్‌ యూనివర్సిటీ ఫెయిర్‌ను ఈసారి ఆన్‌లైన్‌ సదస్సుగా నిర్వహించాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్, అమెరికా వర్సిటీలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. అమెరికాలో డిగ్రీ, మాస్టర్స్, పీహెచ్‌డీ చేయాలనుకునే విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరం. 

అమెరికాలోని అకడమిక్‌ కార్యక్రమాలు, విద్యార్థులకు ఆర్థిక సహకారం, ఆ సంస్థలకు దరఖాస్తు విధానం తదితర అంశాలపై ఆ వర్సిటీల అధికారులు వివరిస్తారు. ఎడ్యుకేషన్‌ యూఎస్‌ఏ.. అమెరికా ఉన్నత విద్యకు సంబంధించిన అధికారిక సంస్థ. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 425 అంతర్జాతీయ విద్యార్థి సలహా కేంద్రాలను నిర్వహిస్తోంది. 

సదస్సులో పాల్గొనడం ఎలా?

గ్రాడ్యుయేట్‌ ఫెయిర్‌ (మాస్టర్, పీహెచ్‌డీ కార్యక్రమాలు) అక్టోబర్‌ 2, 3 తేదీల్లో సాయంత్రం 5.30 నుంచి రాత్రి 10.30 వరకు. దీనికోసం ‘ bit.lyEdUSAFair20-Bmail' ’ లింక్‌ ద్వారా నమోదు చేసుకోవచ్చు. 

అండర్‌ గ్రాడ్యుయేట్‌ ఫెయిర్‌ (అసోసియేట్‌ అండ్‌ బ్యాచిలర్స్‌ ప్రోగ్రామ్స్‌) అక్టోబర్‌ 9, 10 తేదీల్లో సాయంత్రం 530 నుంచి 1030 గంటల వరకు. దీని కోసం   bit.lyUGEdUSAFair20&Bmail' ద్వారా నమోదు చేసుకోవాలి. 

ఇతర వివరాలకోసం ‘educationalcoordinator20@gmail.com లేదా ‘usiefhyderabad@usief.org.in’ మెయిల్‌ ఐడీ ద్వారా సంప్రదించవచ్చని కుమార్‌ అన్నవరపు తెలిపారు.

కరోనా సోకిందంటే దేవుడిచ్చిన విరామమే.. ఫడ్నవీస్

కరోనా సోకిందంటే దేవుడిచ్చిన విరామమే.. ఫడ్నవీస్

   7 minutes ago


మంట‌లు రేపుతున్న మహారాష్ట్ర సీఎం

మంట‌లు రేపుతున్న మహారాష్ట్ర సీఎం

   3 hours ago


ఏపీ పట్ల ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న తెలంగాణ

ఏపీ పట్ల ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న తెలంగాణ

   4 hours ago


పోలవరం పూర్తి ఖర్చు భరిస్తామన్నారు. మాట తప్పితే ఎలా? కేంద్రం పై జగన్ ఫైర్

పోలవరం పూర్తి ఖర్చు భరిస్తామన్నారు. మాట తప్పితే ఎలా? కేంద్రం పై జగన్ ఫైర్

   4 hours ago


టీఆర్‌ఎస్‌ను ఒక్కసారి ఓడించండి.. కేసీఆర్‌కు హామీలన్నీ గుర్తొస్తాయి... ఉత్తమ్

టీఆర్‌ఎస్‌ను ఒక్కసారి ఓడించండి.. కేసీఆర్‌కు హామీలన్నీ గుర్తొస్తాయి... ఉత్తమ్

   19 hours ago


వెలవెలబోతున్న కోవిడ్ ఆసుపత్రులు.. 80 శాతం పడకలు ఖాళీ

వెలవెలబోతున్న కోవిడ్ ఆసుపత్రులు.. 80 శాతం పడకలు ఖాళీ

   19 hours ago


దుబ్బాక‌లోనే అస‌లు ద‌స‌రా

దుబ్బాక‌లోనే అస‌లు ద‌స‌రా

   a day ago


నిమ్మ‌గ‌డ్డ‌పై మీడియా జ‌బ‌ర్ద‌స్తీ

నిమ్మ‌గ‌డ్డ‌పై మీడియా జ‌బ‌ర్ద‌స్తీ

   a day ago


సికింద్రాబాద్ లో పేలుడు.. కొద్దిసేపు టెన్షన్

సికింద్రాబాద్ లో పేలుడు.. కొద్దిసేపు టెన్షన్

   25-10-2020


సీఎం జగన్‌ సామాజిక న్యాయ సంరక్షకుడు.. పీఎంకే అధినేత రామదాస్ ప్రశంస

సీఎం జగన్‌ సామాజిక న్యాయ సంరక్షకుడు.. పీఎంకే అధినేత రామదాస్ ప్రశంస

   25-10-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle