newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

రఘురామకృష్ణంరాజుకు షాక్.. చైర్మన్ పదవిని తొలగించిన లోక్ సభ స్పీకర్

17-10-202017-10-2020 10:34:18 IST
2020-10-17T05:04:18.917Z17-10-2020 2020-10-17T05:04:16.189Z - - 25-10-2020

రఘురామకృష్ణంరాజుకు షాక్.. చైర్మన్ పదవిని తొలగించిన లోక్ సభ స్పీకర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వైఎస్సార్ సీపీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అనూహ్యంగా షాక్ ఇచ్చారు. లోక్ సభలో సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ పదవి నుంచి ఆయన్ని తొలగించిన స్పీకర్ ఆపదవిని మరో వైకాపా ఎంపీ వల్లభనేని బాల శౌరికి కట్టబెట్టారు. పైగా అక్టోబర్ 9 నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని ప్రకటించారు. ఈ కమిటీలో అదనంగా తెలంగాణ ఎంపీ నామా నాగేశ్వరావు తదితరులను కూడా స్పీకర్ ఓం బిర్లా నియమించారు.

పార్టీలో ఎంపీగా కొనసాగుతూనే ప్రతిపక్షానికి వంతపాడుతూ ప్రతి అడుగులోనూ వైకాపా ప్రభుత్వ చర్యలను నిలదీస్తూ, ఖండిస్తూ వచ్చిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజుపై పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు గానీ ఎంపీ హోదానుంచి అనర్హుడిగా ప్రకటించాలని కొన్ని నెలల క్రితమే ఎంపీ విజయసాయిరెడ్డి అనర్హత పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు  వైఎస్ జగన్ తరపున వైకాపా ఎంపీ మార్గాని భరత్ లోక్ సభ స్పీకర్‌కు పంపిన మెమోరాండంలో కూడా నర్సాపురం ఎంపీపై అనర్హత వేటు వేయాలని కోరుతా సంతకం పెట్టారు.

దీంతో మరింతగా రెచ్చిపోయిన ఎంపీ ఆర్ఆర్ఆర్ రోజువారీగా ఢిల్లీనుంచి రచ్చబండ పేరిట టీవీలకు ఇంటర్వ్యూ ఇస్తూ వైకాపా ప్రభుత్వ చర్యలపై దుమ్మెత్తిపోస్తూ వచ్చారు. ఆ రకంగా మొదట్లో ఆయన టీవీ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు.

ఇప్పుడు లోక్ సభ స్పీకర్ నర్సాపురం ఎంపీ చైర్మన్ పదవినే ఊడిబీకడంతో త్వరలో లోక్ సభ ఎంపీ పదవి విషయంలో కూడా ఆయనపై అనర్హత వేటు వేయవచ్చని ఇది సాక్షాత్తూ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై కొరడా ఝళింపించినట్లేనని వైకాపా నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

కానీ తన రెండేళ్ల పదవీకాలం పూర్తికావడంతో లోక్ సభ స్పీకర్ తన స్థానంలో మరొకరిని నియమించారు తప్పితే దీంట్లో వైకాపా వారు చెబుతున్నట్లుగా పెద్ద విశేషమేమీ లేదని నర్సాపురం ఎంపీ చెప్పడం గమనార్హం.

ఇప్పటికే రుణాల ఎగవేతపై రఘురామ కృష్ణం రాజుపై సీబీఐ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆయనను సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్ పదవినుంచి లోక్ సభ స్పీకర్ తొలగించినట్లు భావిస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంలో బోధన,  తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులను వేలం వేయాలని పూనుకోవడం, ఇసుకను బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడం వంటి పలు ఆంశాలపై పార్టీ నాయకత్వంతో రఘురామ కృష్ణం రాజు విభేదించి టీవీల్లో ఎండగట్టడంతో ఆయన్ను పార్టీ నాయకత్వం కానీ, కార్యకర్తలు కానీ పట్టించుకోవడం మానేసిన విషయం కూడా తెలిసిందే.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle