నిమ్మగడ్డ మీటింగ్.. అలా షాక్ ఇచ్చిన అధికారులు..!
23-01-202123-01-2021 17:49:46 IST
Updated On 23-01-2021 18:08:07 ISTUpdated On 23-01-20212021-01-23T12:19:46.529Z23-01-2021 2021-01-23T11:20:55.648Z - 2021-01-23T12:38:07.538Z - 23-01-2021

ఏపీలో ఎస్ఈసీ తో రాష్ట్ర ప్రభుత్వం బంధాలు అంతంతమాత్రమే ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఈ మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు సీఎస్ ఆదిత్యనాథ్, డీజీపీ గౌతమ్ సవాంగ్, పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు గైర్హాజరయ్యారు. సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరవుతారని నిమ్మగడ్డతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు వేచి చూశారు. కానీ వారు హాజరవ్వకుండా నిమ్మగడ్డకు షాక్ ఇచ్చారు.
ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు సహకరించడంలేదని ఎస్ఈసీ గవర్నర్ కు ఫిర్యాదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని కాదని ఏకపక్షంగా ఎన్నికల నిర్వహణకు ముందుకెళ్తున్నారు నిమ్మగడ్డ. ఇక మీడియా సమావేశం సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖపై నిమ్మగడ్డ పలు ఆరోపణలు చేశారు. పంచాయతీరాజ్ శాఖ ఇంకా మెరుగైన పనితీరు కనబరచాలని.. తన పనుల్లో పూర్తిగా విఫలమైంది అని విమర్శించారు.
ఇప్పటికిప్పుడు పంచాయతీ ఎన్నికలు పెడితే ఎన్నికల సంఘానికి సహకరించేది లేదని ప్రభుత్వ ఉద్యోగులు చెబుతూ ఉన్నారు. పంచాయతీ ఎన్నికలు నిలిపివేయకుంటే ఎన్నికల బహిష్కరణకు తాము సిద్దంగా ఉన్నామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి. అవసరమైతే సమ్మెకు కూడా వెళతామని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఎన్నికల కంటే ఉద్యోగుల ప్రాణాలే ముఖ్యమని అంటున్నారు.
ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల అంశంలో ఎస్ఈసీ మాట్లాడుతున్న తీరు తమకు చాలా బాధ కలిగించిందని అన్నారు. రాష్ట్రంలో కరోనా బారినపడి పెద్ద సంఖ్యలో చనిపోయారని వ్యాక్సినేషన్ తర్వాత ఎన్నికలకు వెళతామని తాము అటు ప్రభుత్వాన్ని, ఇటు ఎన్నికల సంఘాన్ని వేడుకున్నామని వివరించారు. ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించామని, సోమవారం నాడు విచారణ ఉందని తెలిపారు. ఈలోగానే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడం వల్ల ఒరిగేదేమీ లేదని అన్నారు. మరో రెండు, మూడు నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తవుతుంది... ఆ తర్వాత ఎన్నికలకు వెళదాం అని చెప్పాం. ఈ రెండున్నరేళ్లలో లేనంత అత్యవసర పరిస్థితి ఇప్పుడేమైనా ఉందా? ఎస్ఈసీ ఎందుకింత పంతానికి పోతున్నారు? అని ప్రశ్నించారు.
ఏపీ పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్.. ఫుల్ డీటెయిల్స్

కాంగ్రెస్‌లో ఉండి ఉంటే సింధియానే సీఎం... రాహుల్
3 hours ago

బీజేపీలోకి కాంగ్రెస్ సీనియర్ లీడర్.. భార్య ఒత్తిడే కారణమా
3 hours ago

విశాఖ ఉక్కు 100 శాతం ప్రైవేటుకే.. ఏపీ సర్కార్ కు ముందే తెలుసు
5 hours ago

వివాదంలో అశోక్‌గజపతిరాజు.. మహిళను కొట్టారా..?
an hour ago

నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. బీజేపీపై మండిపడ్డ కేటీఆర్
20 hours ago

కేతిరెడ్డిపై ఫైర్ అయిన పరిటాల శ్రీరామ్..!
a day ago

కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తా, శత్రుత్వమా.. డైలమ్మాలో కార్యకర్తలు
a day ago

వైసీపీ రౌడీయిజానికి బ్రేకులేస్తాం
a day ago

ఇదేం అన్యాయం.. హర్ట్ అయిన విడదల రజనీ ఫ్యాన్స్
a day ago

దేశ వ్యాప్తంగా ఆ నియోజక వర్గం గెలుపు పై ఫోకస్
12 hours ago
ఇంకా