newssting
Radio
BITING NEWS :
ఓ ఆసుపత్రిలో మహిళా రోగిపై ఉద్యోగి అత్యాచారం. గురుగ్రామ్ నగరంలో వెలుగుచూసిన దారుణం. ప్రైవేటు ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో 21 ఏళ్ల యువతి క్షయ వ్యాధితో చికిత్స కోసం చేరగా వెంటిలేటరుపై చికిత్స పొందుతూ స్పృహ లేని స్థితిలో ఉన్నపుడు ఆసుపత్రి ఉద్యోగి ఒకరు తనపై అత్యాచారం చేశాడని తన చేత్తో రాసిన నోట్ ద్వారా తండ్రికి తెలిపిన బాధితురాలు * నలుగురు ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యులపై కేసులు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు. ఢిల్లీలో పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించిన నలుగురు ఆప్ ఎమ్మెల్యేలపై పోలీసులు కేసులు. పారిశుద్ధ్య పనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆప్ నాయకుడు దుర్గేష్ పాథక్ 1500మంది ప్రజలతో పౌరకేంద్రం ముందు నిరసన కార్యక్రమం చేపట్టగా..అనుమతి లేకుండా నిరసన చేపట్టారని కేసులు నమోదు * 317వ రోజుకు చేరుకున్న అమరావతి రైతు నిరసనలు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు. అమరావతి గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. కరోనా సూచనలు పాటిస్తూ సాగుతున్న అమరావతి ఉద్యమం * ఉత్తర తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, మిగిలినచోట్ల పొడి వాతావరణం కొనసాగుతుందని తెలిపిన వాతావరణ శాఖ. కాగా ఈశాన్య గాలులు ప్రారంభం కావడంతో అనేకచోట్ల, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న మంచు. పగటిపూట మాత్రం కొనసాగుతున్న ఎండ * గ్రేటర్‌ ఎన్నికలకు పడిన మరో ముందడుగు. వార్డుల వారీగా రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ. గ్రేటర్‌లో 150 వార్డులకు తహసీల్దార్‌, ఎంపీడీఓ తదితర కేడర్‌ అధికారులను రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్లుగా జీహెచ్‌ఎంసీ సూచించిన వారిని నియమిస్తున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదం * బేగంపేట మెట్రో స్టేషన్‌ పై నుంచి పడి యువకుడు మృతి. ఈ నెల 26న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. చార్టెడ్‌ అకౌంటెన్సీ కోర్స్‌ చేస్తున్న కర్నూల్‌ జిల్లా మంత్రాలయం రామచంద్రనగర్‌కు చెందిన జీ మంజునాథ్‌ (23) ఈ నెల 14న నగరానికి రాగా ఆత్మహత్య చేసుకున్నట్లుగా సీసీ కెమెరాలలో రికార్డు * గురువారం నుంచి అందుబాటులోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ధరణి ఫోర్టల్‌ సేవలు. మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభం. ధరణి సేవలు మొదలైతే తాసిల్దార్‌ కార్యాలయాల్లో రోజుకు16 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటు * చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు. గత రాత్రి నుంచి మహానగరంలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలు. తిరువాన్మియూర్, మైలాపూర్, రాయపెట్ట, అడయార్‌లలో వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు పలు కాలనీలు నీట మునిగగా వర్షపు నీటిని తొలగించడానికి అధికారులు అన్ని చర్యలు చేపట్టారు * మంచిర్యాల జిల్లాలోని హజీపూర్ మండలం నర్సింగ పూర్ శివారులో పెద్ద పులి సంచారం . ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన పులి సంచారాన్ని గుర్తించిన గ్రామస్థులు. విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని అడుగుల ద్వారా పులి సంచారాన్ని నిర్ధారించారు. దీంతో సమీప అటవీ ప్రాంతాలకు ప్రజలు వెళ్ళొద్దని అధికారులు సూచనలు జారీ.

ధన్యవాదాలు గడ్కరీజీ.. ఏపీ సీఎం

17-10-202017-10-2020 16:36:48 IST
2020-10-17T11:06:48.298Z17-10-2020 2020-10-17T11:06:43.376Z - - 29-10-2020

ధన్యవాదాలు గడ్కరీజీ.. ఏపీ సీఎం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఎనలేని మమకారం చూపుతున్నందుకు, ప్రాజెక్టులను మంజూరు చేస్తున్నందుకు కేంద్ర రోడ్డు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి మనసారా ధన్యవాదాలు చెబుతున్నానని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు.. వీలైనంత త్వరగా ఆయా ప్రాజెక్టులు చేపట్టి, సకాలంలో పూర్తి చేయడం లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహయ, సహకారాలు అందజేస్తుందని, స్థానికంగా ఎదురయ్యే సమస్యల పరిష్కారంతో పాటు, భూసేకరణలో కూడా నిరంతరం మీకు తోడుగా నిలుస్తామని జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టులను పరిశీలించడానికి ఒకసారి ఇక్కడికి రావాలని కోరుతున్నానని సీఎం కేంద్ర మంత్రిని అభ్యర్థించారు.

రాష్ట్రంలో రహదారుల కనెక్టివిటీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసిన మరిన్ని ప్రతిపాదనలకు త్వరగా ఆమోదం తెలపాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కోరారు. కేంద్ర రహదారుల నిధి నుంచి రావాల్సిన నిధులను త్వరగా ఇప్పించాలని, రాష్ట్రంలో పోర్టులకు రహదారుల కనెక్టివిటీ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడలో కొత్తగా నిర్మించిన కనకదుర్గ ఫ్లై ఓవర్, బెంజ్‌ సర్కిల్‌ ఫ్లై ఓవర్‌ ప్రారంభం, రూ.15,592 కోట్ల విలువైన 61 హైవే ప్రాజెక్టులకు ఈ–శిలాఫలకాల ఆవిష్కరణ కార్యక్రమంలో శుక్రవారం ఆయన తాడేపల్లి క్యాంప్‌ ఆఫీసు నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.

ప్రధాని నరేంద్ర మోదీ, మంత్రి నితిన్‌ గడ్కరీ దూరదృష్టితో దేశ వ్యాప్తంగా 7,800 కి.మీ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేలను దాదాపు రూ.3.3 లక్షల కోట్లతో చేపట్టారు. రహదారుల కనెక్టివిటీ వల్ల ఆర్థిక రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది.  గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేలకు సంబంధించి రాష్ట్రంలో 375 కి.మీ పొడవైన 6 రహదారులు ఉండడం గమనించవలసిన విషయం. మీ (గడ్కరీ) హయాంలో 2,667 కి.మీ రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చడంతో, రాష్ట్రంలో జాతీయ రహదారులు 6,880 కిలోమీటర్లకు పెరిగాయి.

ప్రత్యేక ధన్యవాదాలు..

రాష్ట్రంలో ఇవాళ రూ.15,592 కోట్ల విలువైన 1,411 కి.మీ.కు సంబంధించి మొత్తం 61 ప్రాజెక్టులకు ఈ–శిలాఫలకాల ఆవిష్కరణ, వాటిని జాతికి అంకితం చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో నాలుగు లైన్ల రహదారి కనెక్టివిటీ కోసం ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించినందుకు అభినందనలు చెప్పారు. ముఖ్యంగా రాజమండ్రి – రంపచోడవరం – కొయ్యూరు – అరకు – బౌడారా – విజయనగరం రహదారి నిర్మాణం మరియు తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోని సుదూర గిరిజన ప్రాంతాలను కలిపే దాదాపు 380 కి.మీ రెండు లైన్ల రహదారిని ఆమోదించినందుకు కేంద్ర మంత్రి గడ్కరీకి ధన్యవాదాలు చెప్పారు.

నాలుగు లైన్ల మైదుకూరు – బద్వేలు – నెల్లూరు, మదనపల్లి – పీలేరు – తిరుపతి, అనంతపురం – గుంటూరు, కర్నూలు – దోర్నాల, అనంతపురం – మైదుకూరు రహదారులను కూడా అడిగిన వెంటనే మంజూరు చేశారు. విజయవాడ బెంజి సర్కిల్‌ వద్ద పశ్చిమం వైపున మూడు లైన్ల ఫ్లైఓవర్‌కు సంబంధించి నేను వ్యక్తిగతంగా చేసిన విజ్ఞప్తిని మన్నించి మంజూరు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని సీఎం జగన్ తెలిపారు.

కాగా విజయవాడ ప్రజల చిరకాల స్వప్నం సాకారమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కనకదుర్గ ఫ్లైఓవర్‌ అందుబాటులోకి వచ్చింది. 46 ఒంటి స్తంభాలపై 2.6 కిలోమీటర్ల మేర ఆరు వరుసలు, ఆరు మలుపులతో రూ.502 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. ఈ ఫ్లైఓవర్‌ను వర్చువల్‌ విధానంలో నాగపూర్‌ నుంచి కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి గడ్కరీ, తాడేపల్లి క్యాంప్‌ ఆఫీసు నుంచి సీఎం వైఎస్‌ జగన్‌ శుక్రవారం ప్రారంభించారు. దీంతో పాటు బెంజ్‌ సర్కిల్‌ మొదటి ఫ్లైఓవర్‌ను కూడా లాంఛనంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం కనకదుర్గ ఫ్లై ఓవర్‌పై వాహనదారులు తమ ప్రయాణాలను మొదలుపెట్టారు. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle