newssting
Radio
BITING NEWS :
కంటెంట్‌ క్రియేటర్లకు ఆన్‌లైన్‌ కోర్స్‌ను సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ పరిచయం చేసింది. ఫేస్‌బుక్‌తోపాటు ఇన్‌స్ట్రాగామ్‌లో ఈ కోర్స్‌ అందుబాటులో ఉంటుంది. మార్కెట్‌ ధోరణి, ఉత్పత్తి నవీకరణలు, సవాళ్ల గురించి నిపుణులతో బోధన ఉంటుంది. * ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్‌లలో నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లను, ఆ రెండు భాషలతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. దేశంలోని పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇప్పటికే ప్రకటించిన ఖాళీల కోసం చేపట్టే క్లరికల్‌ రిక్రూట్‌మెంట్‌లలో ప్రిలిమ్స్, మెయిన్‌ పరీక్షలు రెండింటినీ ఇంగ్లీష్, హిందీతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని సూచించింది. * తాజాగా ప్రభుత్వం రాష్ట్రంలోని 9 బీచ్‌లకు బ్లూఫాగ్‌ సర్టిఫికెట్‌ సాదనపై దృష్టిసారించింది. ఆ జాబితాలో పేరుపాలెం బీచ్‌ కూడా ఉండటంతో బీచ్‌కు మహర్దశ పడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. బ్లూఫాగ్‌ బీచ్‌గా కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే ఏడాదికి రూ.కోటి నిధులు అందుతాయి. వాటితో బీచ్‌లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశముంటుంది. * తెలంగాణలో భారీగా పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్ర పోలీస్‌ శాఖలో పనిచేస్తున్న 20 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. * బాలీవుడ్‌లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తనకంటూ గుర్తింపు పొందిన నటుల్లో ఒకరు విక్కీ కౌశల్. లస్ట్‌ స్టోరీస్‌, రాజీ, సంజు వంటి సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసి అనంతరం హీరోగా మారాడు. ‘ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్’తో ఒక్కసారిగా సంచలన హిట్‌ కొట్టి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. * ఐపీఎల్‌ గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతి మూటగట్టుకున్న చెన్నై సూపర్‌కింగ్స్‌.. ఈసారి మాత్రం సత్తా చాటింది. ఐపీఎల్‌-2021లో ప్లే ఆఫ్స్‌ చేరిన మొదటి జట్టుగా నిలిచింది.

మంత్రి వర్గంలో భారీ మార్పులకి సిద్దపడుతున్న వైఎస్ జగన్

20-09-202120-09-2021 17:51:19 IST
Updated On 20-09-2021 19:28:52 ISTUpdated On 20-09-20212021-09-20T12:21:19.960Z20-09-2021 2021-09-20T12:19:06.650Z - 2021-09-20T13:58:52.563Z - 20-09-2021

మంత్రి వర్గంలో భారీ మార్పులకి సిద్దపడుతున్న వైఎస్ జగన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ మఖ్యమంత్రి తన మంత్రి వర్గంలో భారీ మార్పులకి సిద్దపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ద‌స‌రా పండుగ వరకు మంత్రి వ‌ర్గ ప్ర‌క్షాళ‌న చేసేందుకు సిఎం జగన్ సిద్ధ‌మ‌వుతున్నారని, ఇప్ప‌టికే మంత్రుల ప‌నితీరుపై ఆయ‌న నివేదిక‌లు తెప్పించుకున్న‌ట్లు తెలుస్తోంది. అధికారంలోకి వ‌చ్చిన రెండున్న‌రేళ్ల త‌ర్వాత మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఉంటుంద‌ని 2019లో జ‌గ‌న్ సీఎం అయిన‌ప్పుడే స్ప‌ష్టం చేశారు. ఇప్పుడా స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ వైసీపీ నేత‌ల్లో టెన్ష‌న్ పెరిగిపోతుంది. ఇప్ప‌టికే కొత్త మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ దిశ‌గా క‌స‌ర‌త్తులు చేస్తున్న జ‌గ‌న్‌.. ఆ దిశ‌గా నివేదిక‌లు తెప్పించుకున్న‌ట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఇప్పుడు ఉన్న మంత్రుల పని తీరుని దృష్టిలో పెట్టుకుని ఈ విస్తరణ చేపడుతున్నట్లు, ఇందులో భాగంగా మంత్రుల పనితీరు చాలా పూర్ గా ఉన్న మంత్రుల లిస్టు ఆయన టేబుల్ పై ఉన్నట్టు సమాచారం. 

ఈ లిస్టు ని ఆయన కూలంకుషంగా పరిశీలిస్తున్నాడని ఇప్పుడున్న మంత్రులాలో దాదాపు 11 మంది మంత్రుల‌కు ఉద్వాస‌న త‌ప్ప‌ద‌ని జోరుగా ప్ర‌చారం జరుగుతోంది. ఇక మంత్రుల పనితీరు పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నట్టు నివేదిక ద్వారా జగన్ తెలుసుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావు, సుచ‌రిత‌, తానేటి వ‌నితి, రంగ‌నాధ‌రాజు, శంక‌ర‌నారాయ‌ణ‌, పుష్ప శ్రీ, జ‌య‌రాం, నారాయాణ స్వామి, అనిల్ కుమార్‌, అవంతి శ్రీనివాస్‌, విశ్వ‌రూప్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ మంత్రుల‌కి ఉద్వాసన పలుకడం ఖాయమేనని వైసిపి వర్గాలలోనే వినిపిస్తోంది. ఇక వీరి స్థానంలో కొత్తగా అన్నా రాంబాబు, కోల‌గ‌ట్ల‌, పార్థసార‌థి, కారుమూరి నాగేశ్వ‌ర‌రావు, ప్ర‌సాద రాజు, రాజ‌న్న దొర లేదా బాల‌రాజులకి ఖచితంగా మంత్రి వర్గంలో చోటు దక్కవచ్చని తెలుస్తోంది. కాగా బిసి, రెడ్డి సామాజిక వర్గం నుండి సైతం కొందరిని మంత్రి వర్గంలో చోటు కల్పించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు. త్వరలోనే ఈ మంత్రి వర్గ ప్రక్షాలనకి జగన్ పూనుకోబోతున్నారని ఎపి లో ప్రచారం జోరుగా సాగుతోంది. 

టిఆర్ఎస్ పార్టీ లో చేరనున్న మోత్కుపల్లి నర్సింహులు

టిఆర్ఎస్ పార్టీ లో చేరనున్న మోత్కుపల్లి నర్సింహులు

   3 hours ago


రేవంత్ రెడ్డి పై అధిష్టానానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు..?

రేవంత్ రెడ్డి పై అధిష్టానానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు..?

   3 hours ago


పూర్తికాల అధ్యక్షురాలిగా నేనే ఉంటా: సోనియా గాంధీ

పూర్తికాల అధ్యక్షురాలిగా నేనే ఉంటా: సోనియా గాంధీ

   a day ago


కొత్త చీఫ్ కోసం కాంగ్రెస్ పార్టీ సమావేశం

కొత్త చీఫ్ కోసం కాంగ్రెస్ పార్టీ సమావేశం

   16-10-2021


మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఛత్తీస్‌గఢ్‌లో అనారోగ్యంతో మరణించారు

మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఛత్తీస్‌గఢ్‌లో అనారోగ్యంతో మరణించారు

   15-10-2021


టిఆర్ఎస్ పై విరుచుకుపడ్డ ఈటల రాజేందర్

టిఆర్ఎస్ పై విరుచుకుపడ్డ ఈటల రాజేందర్

   14-10-2021


ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ 400 సీట్లను గెలుచుకోగలదు: అఖిలేష్ యాదవ్

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ 400 సీట్లను గెలుచుకోగలదు: అఖిలేష్ యాదవ్

   15-10-2021


మహిళల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారు: మంత్రి ఆదిమూలపు సురేష్

మహిళల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారు: మంత్రి ఆదిమూలపు సురేష్

   14-10-2021


నామినేషన్ ని ఉపసంహరించుకున్న ఈటల జమున.. ఆ ముగ్గురి నామినేషన్ చెల్లదు.

నామినేషన్ ని ఉపసంహరించుకున్న ఈటల జమున.. ఆ ముగ్గురి నామినేషన్ చెల్లదు.

   14-10-2021


మంత్రి ఎర్రబెల్లిపై కొండా సురేఖ ఘాటు వ్యాఖ్యలు.. నీకు ఎంత మంది తండ్రులు అంటూ..

మంత్రి ఎర్రబెల్లిపై కొండా సురేఖ ఘాటు వ్యాఖ్యలు.. నీకు ఎంత మంది తండ్రులు అంటూ..

   13-10-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle