newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

నా పదవిని తొలగించలేదు.. తొలగించలేరంతే రఘురామ కౌంటర్

17-10-202017-10-2020 12:41:16 IST
2020-10-17T07:11:16.046Z17-10-2020 2020-10-17T07:11:13.857Z - - 25-10-2020

నా పదవిని తొలగించలేదు.. తొలగించలేరంతే రఘురామ కౌంటర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తనను పార్లమెంట్ లెజిస్లేటివ్ సబార్డినేట్ కమిటీ చైర్మన్‌ పదవినుంచి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తీసివేయడంపై వైకాపా నాయకులు పండుగ చేసుకోవడం ఎందుకని నర్సాపురం లోక్ సభ సభ్యుడు రఘురామ కృష్ణం రాజు ఎద్దేవా చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డిపై ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ లెజిస్లేటివ్ సబార్డినేట్ కమిటీ చైర్మన్‌గా ఉన్న రఘురామను తప్పించారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా సెల్ఫీ వీడియో రూపంలో స్పందించిన ఆయన.. తనను ఎవరూ తొలగించలేదని.. తొలగించలేరు కూడా అంటూ వ్యాఖ్యానించారు.

నా పదవిని ముష్టివేస్తే వైసీపీలో సంబరాలా?

‘మూడు నెలల క్రితమే పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ పదవి నుంచి నన్ను తొలగించాలని స్పీకర్‌కు వైసీపీ ఎంపీలు లేఖ ఇచ్చారు. అది ఏడాది పదవి కాలమని మధ్యలో తొలగించడం కుదరదని స్పీకర్ అప్పుడే చెప్పారు. నా పదవి కాలం అయిపోయింది కాబట్టి.. దానిని మా పార్టీకే చెందిన బాలశౌరికి ఇవ్వాలని పార్టీ లెటర్ ఇచ్చింది. రెడ్లుకు పదవులు ఇవ్వడం అయిపోయింది కాబట్టి.. ఆయన మతానికి చెందిన వారికి ఆ పదవి ఇచ్చారు. బాలశౌరికి ఆ పదవి ముష్టి వేసారు. అది తెలియని వైసీపీ సోషల్ మీడియా సంబరాలు చేసుకుంటున్నది’ అని ఎంపీ రఘురాజు అన్నారు.

అమరావతిపై రిఫరెండంగా ఎన్నికలు పెడితే 2 లక్షల మెజారిటీతో జగన్‌పైనే గెలుస్తా

అమరావతి రాజధాని అంటూ రిఫరెండంగా ఎన్నికలకు వెళ్తే సీఎం వైఎస్ జగన్‌పైనే 2 లక్షల మెజార్టీతో గెలుస్తాను. దమ్ముంటే జగన్ ఎన్నికలు వెళ్లాలి. ఇది అతిశయోక్తితో చెబుతున్నది కాదు. త్వరలో నాపై అనర్హత వేటు వేయిస్తామని పిచ్చి రాతలు రాయిస్తున్నారు. ఎవరు ఎవరిని తొలగిస్తారో త్వరలోనే తెలుస్తుంది. పదవి నుంచి తొలగించడమంటే అది వేరుగా ఉంటుంది.. అది ప్రజలే చూస్తారు. నన్ను ఎవరూ తొలగించలేరు.. వైసీపీ పెద్దలకు సవాల్ విసురుతున్నాను అని రఘురాజు చెప్పుకొచ్చారు.

కోర్టు ధిక్కార నేరమే జగన్‌ పదవి పోతుందన్న రఘురామ

కోర్టు ధిక్కార నేరానికి పాల్పడిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తన పదవిని కోల్పోవలసి వస్తుందని వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు. కోర్టు ధిక్కార నేరానికి పాల్పడినవారెవరైనా వారు కొనసాగుతున్న పదవుల్లో ఉండే అర్హతను కోల్పోతారని వ్యాఖ్యానించారు.  ఆయన శుక్రవారం డిల్లీలో విలేకరులతో మాట్లాడారు. 

జగన్‌ ఆత్మపరిశీలన చేసుకుని.. తాను చేసిన తప్పిదాన్ని తెలుసుకుని.. న్యాయవ్యవస్థకు క్షమాపణలు చెబితే తన పదవిని నిలబెట్టుకునే అవకాశం ఉండొచ్చని, లేదంటే  ప్రత్యామ్నాయంగా తన స్థానంలో వేరే వ్యక్తిని సీఎంగా పెట్టుకోవడానికి సిద్ధపడాల్సి వస్తుందని తెలిపారు. జగన్‌ స్థానంలో ఆయన తల్లి విజయలక్ష్మి లేదా సతీమణి భారతి సీఎం కావొచ్చన్నారు. 

న్యాయవ్యవస్థపై పదేపదే ప్రభుత్వం, పాలక పెద్దలు దాడికి దిగడం సమంజసం కాదు. రాజధాని అమరావతి భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందన్న ఆరోపణలన్నీ అసత్యాలే. ఈ ఆరోపణలను ఒక న్యాయమూర్తికి కుట్రపూరితంగా ఆపాదించడం ఎంతవరకు సమంజసం న్యాయవ్యవస్థపై జగన్‌ ప్రభుత్వం చేస్తున్న దాడిని తీవ్రంగా నిరసిస్తూ.. దేశవ్యాప్తంగా న్యాయవాదులు ఉద్యమం చేపట్టే అవకాశాలున్నాయి’ అని చెప్పారు. 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle