newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నేడే ముఖ్యమంత్రులతో మోదీ సమావేశం.. ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో..?

08-04-202108-04-2021 10:34:16 IST
Updated On 08-04-2021 11:46:18 ISTUpdated On 08-04-20212021-04-08T05:04:16.399Z08-04-2021 2021-04-08T05:04:10.540Z - 2021-04-08T06:16:18.288Z - 08-04-2021

నేడే ముఖ్యమంత్రులతో మోదీ సమావేశం.. ఏ నిర్ణయం తీసుకోబోతున్నారో..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత్ లో కరోనా మహమ్మారి భీభత్సం ఇంకా కొనసాగుతూ ఉంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. దేశంలో క‌రోనా కేసుల సంఖ్య ఎక్కువగా న‌మోద‌వుతుండ‌డంతో అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ భేటీ కానున్నారు. ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు వర్చువల్ ప‌ద్ధ‌తిలో ఈ సమావేశం జ‌ర‌గ‌నుంది.

క‌రోనా విజృంభ‌ణ‌తో పాటు దేశ వ్యాప్తంగా కొన‌సాగుతోన్న‌ వ్యాక్సినేషన్ పై ఆయ‌న‌ చర్చించనున్నారు. క‌రోనా కేసులు భారీగా పెరిగిపోతోన్న నేప‌థ్యంలో కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయ‌న‌ దిశా నిర్దేశం చేయనున్నారు. ముఖ్య‌మంత్రుల నుంచి అభిప్రాయాలు తీసుకోనున్నారు. ఢిల్లీ స‌హా ప‌లు రాష్ట్రాల్లో క‌రోనా క‌ట్ట‌డికి క‌ర్ఫ్యూ, ఆంక్ష‌లు విధించ‌డం వంటి కీల‌క అంశాల‌పై ఆయ‌న చ‌ర్చించ‌నున్నారు. మ‌హారాష్ట్ర‌లో వైర‌స్ క‌ట్ట‌డి కోసం ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం  బృందాల‌ను పంపింది. క‌రోనా క‌ట్ట‌డి కోసం రాష్ట్రాల‌కు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది.

భారతదేశంలో గ‌త 24 గంటల్లో 1,26,789 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించింది. అదే సమయంలో ‌ 59,258  మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,29,28,574 కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 685 మంది కరోనా కారణంగా మృతి చెందారు. భారతదేశంలో మృతుల సంఖ్య 1,66,862 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,18,51,393 మంది కోలుకున్నారు. 9,10,319 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 9,01,98,673 మందికి వ్యాక్సిన్లు వేశారు. దేశంలో నిన్నటి వరకు మొత్తం 25,26,77,379 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. 

07-04-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. గడచిన 24 గంటల్లో 31,812 కరోనా పరీక్షలు చేపట్టగా 2,331 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 368 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. కృష్ణా జిల్లాలో 327, విశాఖ జిల్లాలో 298, చిత్తూరు జిల్లాలో 296, అనంతపురం జిల్లాలో 202 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 853 మంది కోలుకోగా... 11 మంది మహమ్మారికి బలయ్యారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే నలుగురు మృత్యువాతపడ్డారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 7,262కి పెరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 9,13,274 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,92,736 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 13,276 మంది చికిత్స పొందుతున్నారు.

నేటినుంచి ఢిల్లీలో రాత్రి కర్ఫ్యూ... అదే బాటలో మరికొన్ని రాష్ట్రాలు

తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   17 minutes ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   an hour ago


వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   15 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   11 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   13 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   15 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   18 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   19 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   21 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   a day ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle