వైసీపీ పతనం మొదలైంది.. చంద్రబాబు, నారా లోకేష్ కామెంట్లు
22-02-202122-02-2021 22:52:59 IST
Updated On 23-02-2021 10:34:08 ISTUpdated On 23-02-20212021-02-22T17:22:59.880Z22-02-2021 2021-02-22T17:21:10.506Z - 2021-02-23T05:04:08.786Z - 23-02-2021

రాష్ట్రంలో వైసీపీ పతనం ప్రారంభమైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై మాట్లాడుతూ వైసీపీ పతనానికి ఇది ఆరంభం మాత్రమేనని.. ఆ పార్టీని ఎవరూ కాపాడలేరని చెప్పారు. దుర్మార్గమైన వైసీపీ ప్రభుత్వం కొనసాగడానికి వీల్లేదని అన్నారు. పంచాయతీ ఎన్నికలు సక్రమంగా, ప్రశాంతంగా జరిగి ఉంటే టీడీపీకి మరో 10 శాతం ఫలితాలు పెరిగేవని చంద్రబాబు చెప్పారు. అదే జరిగి ఉంటే వైసీపీ ఇప్పుడే పతనమై ఉండేదని అన్నారు. అధికార దుర్వినియోగంపై ఆధారపడి వైసీపీ ఎక్కువ శాతం స్థానాలను గెలుచుకుందని.. పోలీసులు ఉంటేనే వైసీపీ నేతలు ప్రతాపం చూపుతారని ఎద్దేవా చేశారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు వీరోచితంగా పోరాడారని చంద్రబాబు ప్రశంసించారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా పోరాటం చేశారని అన్నారు. అన్ని చోట్లా ఏకగ్రీవాలు చేసుకోవాలనుకున్న వైసీపీ కుట్రలు సాగలేదని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలు సిసలైన గెలుపు టీడీపీదేనని ఆ పార్టీ నేత నారా లోకేశ్ చెప్పారు. ఎన్నికల్లో వైసీపీ నేతలు ఎన్ని చర్యలకు పాల్పడినా తమ పార్టీ నేతలు ఎదుర్కొని నిలిచారని చెబుతూ ట్వీట్లు చేశారు.'మన దేశానికి అర్ధరాత్రి స్వాతంత్య్రం వస్తే, నాలుగు విడతల పంచాయతీ ఎన్నికల్లో అర్ధరాత్రి జగన్‌రెడ్డి ఫ్యాక్షన్ పాలిటిక్స్‌కి స్వాతంత్య్రం వచ్చింది. టీడీపీ మద్దతుతో పోటీచేసే అభ్యర్థుల్ని చంపేశారు, నామినేషన్ వేయకుండా కిడ్నాప్ చేశారు. బెదిరించారు, భయపెట్టారు' అని లోకేశ్ ఆరోపించారు. 'డెమోక్రసీకి, జగన్ మోనోక్రసీకి మధ్య జరిగిన ఎన్నికల్లో కొంత తేడాతో సంఖ్యా విజయం వైసీపీదైనా అసలు సిసలు గెలుపు టీడీపీదే. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం జరగాల్సిన ఎన్నికలను వైఎస్ జగన్ తన రాజారెడ్డి రాజ్యాంగంతో అడ్డుకున్నారు' అని లోకేశ్ విమర్శించారు. 'కట్టేసి కొట్టారు, అయినా వెనక్కితగ్గని టీడీపీ అభ్యర్థులు లెక్కింపులో ముందంజలో వుంటే.. కరెంట్ నిలిపేశారు. కౌంటింగ్ కేంద్రాలకు తాళాలేశారు. పోలీసులతో బెదిరించారు. దాడులు చేశారు. టీడీపీ మద్దతుదారులు గెలిచిన చోట్ల రీకౌంటింగ్ పేరుతో వైసీపీ గెలుపు ప్రకటించుకున్నారు' అని నారా లోకేశ్ తెలిపారు. 'ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఎన్నడూ లేని విధంగా జగన్‌రెడ్డి అరాచకాలకు పాల్పడినా ధైర్యంగా ఎదురొడ్డి నిలిచి గెలిచిన టీడీపీ కార్యకర్తలు, నేతలు, అభిమానులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రజాస్వామ్యాన్ని రక్షించిన ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు' అని లోకేశ్ అన్నారు.

నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. బీజేపీపై మండిపడ్డ కేటీఆర్
7 hours ago

కేతిరెడ్డిపై ఫైర్ అయిన పరిటాల శ్రీరామ్..!
9 hours ago

కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తా, శత్రుత్వమా.. డైలమ్మాలో కార్యకర్తలు
10 hours ago

వైసీపీ రౌడీయిజానికి బ్రేకులేస్తాం
10 hours ago

ఇదేం అన్యాయం.. హర్ట్ అయిన విడదల రజనీ ఫ్యాన్స్
10 hours ago

రాంజీ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నాయకుల దిగ్భ్రాంతి
11 hours ago

హైదరాబాద్ పేరును మార్చేస్తామని అంటున్న బీజేపీ నేత
11 hours ago

పవన్ కి విశాఖలో అడుగు పెట్టే ధైర్యం లేదా
an hour ago

ఎంపీ గోరంట్ల మాధవ్ కు మహిళ నుండి ఊహించని ప్రశ్న
9 hours ago

డాక్టర్ చిరంజీవి కొల్లూరి కన్నుమూత..!
12 hours ago
ఇంకా