మరోసారి బాలయ్య దురుసుతనం.. ఫోటో తీశాడని చేయి చేసుకున్నారే..!
06-03-202106-03-2021 17:45:16 IST
Updated On 06-03-2021 16:11:20 ISTUpdated On 06-03-20212021-03-06T12:15:16.366Z06-03-2021 2021-03-06T10:18:00.282Z - 2021-03-06T10:41:20.616Z - 06-03-2021

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దూకుడు గురించి తెలిసిందే..! గతంలో అభిమానుల మీద చేయి చేసుకున్న బాలయ్య మరోసారి అదే స్థాయిలో రెచ్చిపోయారు. హిందూపురంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓ వ్యక్తిపై ఎమ్మెల్యే బాలకృష్ణ చెయ్యి చేసుకున్నారు. హిందూపురం పట్టణంలోని శ్రీకంఠపురంలో ఓ ఇంటికి వెళ్లిన సమయంలో అక్కడ ఫోటో తీయడానికి అభిమాని ప్రయత్నించడంతో అతడిపై బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచారంలో భాగంగా 9వ వార్డు అభ్యర్థిని ఇంటికి వెళ్లారు బాలయ్య. ఇంట్లో కార్యకర్తలతో మాట్లాడుతుండగా… అభిమాని వీడియో తీశాడు. దీనిని గమనించిన బాలయ్య.. అభిమాని చెంప చెల్లుమనిపించారు. ఫోటో తీయవద్దంటూ వారించిన ఆయన అనంతరం అభిమాని చెంపచెల్లుమనిపించారు. డిలీట్ చెయ్ రా అంటూ బాలయ్య ఆగ్రహాన్ని ప్రదర్శించాడు. బాలయ్య కొడుతున్న వీడియోను అక్కడే ఉన్న కొందరు రికార్డు చేశారు. ప్రస్తుతం వీడియో వైరల్ అవుతోంది. డిలీట్ చెయ్.. డిలీట్ చెయ్ అంటూ పలువురు టీడీపీ నేతలు కూడా సదరు వ్యక్తికి చెప్పారు. ఇంతకూ ఆ వ్యక్తి ఏమి తీశాడా..? అని అందరూ ఎంక్వయిరీ చేస్తున్నారు. చంద్రబాబును హైదరాబాద్ పంపేందుకు పోలీసుల యత్నం..! నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. తన ప్రచారంలో భాగంగా వైసీపీ నేతలపై బాలకృష్ణ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తనకు ఎన్నో పనులు ఉన్నాయని, ఎంతో బిజీగా ఉంటూ కూడా తాను ప్రజాసేవ చేస్తున్నానని చెప్పారు. హైదరాబాదులోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎందరికో సేవ చేస్తున్నానని.. ఇదే సమయంలో సినిమాల ద్వారా ప్రజలకు వినోదాన్ని కూడా పంచుతున్నానని చెప్పారు. తాను తిడితే తనకన్నా ఎక్కువ బూతులు తిట్టేవారు ఎవరూ ఉండరని అన్నారు. తనకు సంస్కారం ఉందని... సంస్కారానికి కట్టుబడే తాను పద్ధతిగా వ్యవహరిస్తున్నాని చెప్పారు. వైసీపీ నేతలు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ఎద్దేవా చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం అభివృద్ధిని పక్కనపెట్టి వీడియో గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటున్నారని.. మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా జగన్ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ లను మూసివేసి వైసీపీ సర్కారు ప్రజల నోట్లో మట్టి కొట్టిందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడింది తమ పార్టీ మాత్రమేనని అన్నారు.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
16 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
12 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
14 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
19 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
21 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
a day ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా