newssting
Radio
BITING NEWS :
ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు కుమారుడు ఆత్మహత్యాయత్నం. అర్థరాత్రి విజయవాడ ఆంధ్రా ఆస్పత్రికి తరలింపు. ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్న వైద్యులు. బ్రెయిన్ స్ట్రోక్ తో ఆస్పత్రిలో చేర్పించామని చెప్తున్న కుటుంబ సభ్యులు. 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమన్న వైద్యులు. * ఏపీ మునిసిపల్ ఎన్నికల్లో అత్యధిక ఏకగ్రీవాలు చేసిన వైసీపీ. వైసీపీ -570, టీడీపీ -5, బీజేపీ -1, ఇతరులు -2 ఏకగ్రీవాలు. * విశాఖలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం. విజయవాడ నుంచి విశాఖకు తరలనున్న కమాండ్ కంట్రోల్ రూమ్. విశాఖలోని ప్రభుత్వ భూమిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. * నెల్లూరు జాయింట్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందిపై కేసు నమోదు. పదోన్నతి కల్పిస్తామని చెప్పి మోసం చేశారని అంగన్ వాడీ కార్యకర్త ఫిర్యాదు. జేసీ సీసీ శ్రీకాంత్, సిబ్బంది దయాకర్, వికాస్ పై కేసు నమోదు. జేసీ భార్య ఇంట్లో పనిచేయించుకుంటున్నారంటూ ఫిర్యాదు. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన. * రాజకీయాలపై సంచలన ప్రకటన చేసిన జయ నెచ్చెలి శశికళ. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన చిన్నమ్మ. శశికళ ప్రకటనతో నిరాశ చెందిన అభిమానులు. ఇది బీజేపీ స్క్రిప్ట్ అంటున్న శశికళ మద్దతుదారులు. * సీఎం జగన్ కు ఏపీ సీపీఎం కార్యదర్శి రామకృష్ణ లేఖ. రేపటి రాష్ట్ర బంద్ కు సహకరించాలని సీఎంకు వినతి. విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్ కు పిలుపునిచ్చిన సీపీఐ.

మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్.. మార్చి 10న పోలింగ్

15-02-202115-02-2021 11:58:36 IST
Updated On 15-02-2021 17:37:01 ISTUpdated On 15-02-20212021-02-15T06:28:36.120Z15-02-2021 2021-02-15T03:02:34.224Z - 2021-02-15T12:07:01.500Z - 15-02-2021

మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్.. మార్చి 10న పోలింగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో పాలిటిక్స్ ఇప్పుడు మామూలుగా లేవు క‌దా. లీడ‌ర్లంతా ఊళ్ల బాట ప‌ట్టారు. ప్ర‌తి ఓటూ అవ‌స‌ర‌మేరా అంటూ.. జ‌నాల్ని బుజ్జ‌గిస్తున్నారు. గ్రామాల్లో జ‌రిగే ఓట్లు కాబ‌ట్టి.. ఓటు బ్యాంకు పెంచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అందుకే.. ఇప్పుడు పొలిటిక‌ల్ హీట్ ఫుల్ గా పెరిగింది. కానీ.. రాజ‌కీయ వేడి ఏపీలో ఇప్పుడే త‌గ్గేలా లేదు. ఎందుకంటే.. పంచాయితీ ఎన్నిక‌లు అలా అయిపోయీ అయిపోగానే.. మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కి ముహూర్తం ద‌గ్గ‌రికి వ‌స్తుంది క‌దా.

ఎందుకంటే ఎస్ఈసీ నిమ్మ‌‌గడ్డ ర‌మేశ్ కుమార్.. ఎన్నిక‌ల విష‌యంలో చాలా ఫోక‌స్డ్ గా ఉన్నారు. పంచాయితీ ఎన్నిక‌ల‌ను ఎలా అయితే ప‌ట్టుబ‌ట్టి.. ప‌గ‌డ్బంధీగా నిర్వ‌హిస్తున్నారో.. మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌కి కూడా ముహూర్తం పెట్టేసి.. ప‌క్కా ప్లానింగ్ తో ప‌ర్ ఫెక్ట్ గా నిర్వ‌హించాల‌ని చూస్తున్నారు. త‌ను ప‌ద‌వి నుంచి దిగిపోయేలోగా.. పంచాయితీ ఎన్నిక‌ల‌తో పాటు.. మున్సిప‌ల్ ఎన్నిక‌లు కూడా నిర్వ‌హించాల‌ని టార్గెట్ గా ఉన్న‌ట్లున్నారు. ఏపీ స‌ర్కార్ కూడా తాము ఎన్నిక‌ల‌కు రెడీ అంటోంది. పంచాయితీ ఎన్నిక‌ల టైంలో లేని పోని ఇష్యూస్ అన్నీ క్రియేట్ చేసిన ఏపీ స‌ర్కార్ ఇప్పుడు మాత్రం.. ఇంక గొడ‌వ ఎందుకులే అనుకున్న‌ట్లు క‌నిపిస్తోంది.

ఇక నిమ్మ‌గ‌డ్డ కూడా ఏ మాత్రం లేట్ చేయ‌కుండా.. మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌పై కూడా ఫోకస్ చేశారు నిమ్మ‌గడ్డ ర‌మేశ్ కుమార్. 12 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 75 మున్సిపల్‌, నగర పంచాయతీ ఎన్నికలకు సోమవారం షెడ్యూల్ విడుదలైంది. షెడ్యూల్‌ ప్రకారం మార్చి 10న మున్సిపల్‌ ఎన్నికలు జరగనున్నాయి.  ఇప్పుడు పంచాయితీ ఎన్నిక‌ల వెద‌ర్ ఉంది క‌దా.. వాన‌కి గాలి తోడైన‌ట్లు.. ఇదే టైంలో.. మున్సిప‌ల్ ఎన్నిక‌లు కూడా జ‌ర‌గ‌బోతున్నాయి. ఈనెల 21న పంచాయితీ ఎన్నిక‌లు పూర్త‌వుతాయి. 14న మున్సిప‌ల్ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు జరగనుంది. మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియను కొనసాగిస్తూ ఈసీ తాజా నోటిఫికేషన్‌ జారీ చేసింది. గతంలో నిలిచిన ప్రక్రియ నుంచే కొనసాగించేలా ఉత్తర్వుల్లో పేర్కొంది. మార్చి 3న మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇచ్చారు.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle