ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్..!
08-04-202108-04-2021 08:56:36 IST
Updated On 08-04-2021 09:47:57 ISTUpdated On 08-04-20212021-04-08T03:26:36.318Z08-04-2021 2021-04-08T03:26:32.480Z - 2021-04-08T04:17:57.239Z - 08-04-2021

ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను నిలిపేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల సంఘం డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేసింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు వెల్లడించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్వర్వులను డివిజన్ బెంచ్ కొట్టివేసింది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు తెలిపింది. దీంతో అధికారులు ఆఘమేఘాల మీద ఏర్పాట్లను చేసేశారు. పలు ప్రాంతాల్లో ఉదయం 7 గంటలకే పోలింగ్ మొదలైంది. ఓటర్లు, ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 515 జెడ్పీటీసీ, 7220 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 2గంటల వరకే పోలింగ్ జరుగుతుంది. జెడ్పీటీసీ ఎన్నికల బరిలో 2,058 మంది అభ్యర్థులు, ఎంపీటీసీ ఎన్నికల బరిలో 18,782 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పరిషత్ ఎన్నికల కోసం 27,751 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. మాస్క్ ధరించి ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలివస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో పోలీసు అధికారుల భారీ భద్రత ఏర్పాట్లను పూర్తి చేసింది. పరిషత్ ఎన్నికల కోసం 27,751 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే గుర్తించిన హింసాత్మక, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించారు. ప్రతి సబ్ డివిజన్లో ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్స్‌ను అందుబాటులో ఉంచారు. కొవిడ్ నిబంధనల అనుగుణంగా పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేసింది ఎస్ఈసీ. ఎన్నికల నిర్వహణకు అవసరమైన మాస్కులు, శానిటైజర్లు, థర్మల్ స్కానర్లు, గ్లోవ్స్‌లను పోలింగ్ స్టేషన్ల వారీగా సిద్ధం చేశారు. కొవిడ్ పాజిటివ్ బాధితులు ఓటేసేందుకు వీలుగా వారికి అవసరమైన పీపీఈ కిట్లు కూడా అందుబాటులో ఉంచారు. కరోనా బాధితులు పోలింగ్ చివరి గంటలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
16 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
13 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
15 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
19 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
a day ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
a day ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా