గాలివాటంగానే మూడు సార్లు బాబు సీఎం : విజయసాయిరెడ్డి
01-12-202001-12-2020 13:18:57 IST
Updated On 01-12-2020 13:43:13 ISTUpdated On 01-12-20202020-12-01T07:48:57.016Z01-12-2020 2020-12-01T07:48:50.224Z - 2020-12-01T08:13:13.389Z - 01-12-2020

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. రైతులకు కోసం చంద్రబాబు చేస్తోన్న డిమాండ్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘నువ్వు రైతుల కోసం అంటూ చేసే డ్రామాలు, పగటి వేషాలను ఎవరూ నమ్మరు బాబూ. వ్యవసాయం దండగన్నావ్, బషీర్ బాగ్ లో రైతులపై కాల్పులు జరిపించావ్, గతంలో రైతుల ఆత్మహత్యలకు ఏపీని రాజధానిగా మార్చేశావ్. వైఎస్సార్ ఉచిత విద్యుత్ అంటే తీగలపై బట్టలు ఆరేసుకోవాలా? అని వెటకారం చేశావ్. గిట్టుబాటు ధర అడిగితే కొవ్వెక్కి పంటలు పండిస్తున్నారని కూశావ్’ అని ట్విటర్ వేదికగా విజయసాయిరెడ్డి ధ్వజం ఎత్తారు. రైతులను మోసం చేసి, వాళ్లకి నువ్వు ఎగ్గొట్టిన బకాయిలను జగన్ గారు చెల్లిస్తున్నారన్నారు. ఏపీలో ఇప్పుడు ఉన్నది రైతు ప్రభుత్వం అని చెప్పారు. ఇక చంద్రబాబు మూడు సార్లు సీఎం అయ్యింది గాలివాటంగానేనని ఎద్దేవా చేశారు. ఒకసారి ఎన్టీఆర్ ను గెలిపిస్తే వెన్నుపోటు పొడిచి పదవి లాక్కున్నారు. 1999, 2014లో బీజేపీ ప్రభంజనంలో బయటపడ్డారు. గాలికి కొట్టుకొచ్చింది ఎవరు? 50% ఓట్లు, 151 సీట్లతో ప్రజలు జగన్ గారిని ఆశీర్వదిస్తే గాలికి గెలిచినట్టా?’ అని విజయసాయిరెడ్డి అని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి.

పంచాయితీ కోసం టీడీపీ పంచసూత్రాలు
43 minutes ago

రామ తీర్థానికి కొత్త కళ
an hour ago

బరిలోకి దిగిన జనసేన.. పవన్ వర్సెస్ జగన్ ఫైట్
an hour ago

ఏకగ్రీవాల్లోనూ.. ఎవరి దారి వారిదేనా..
2 hours ago

కర్నాటకలోని మరాఠీ ప్రాంతాలు మావే.. ఉద్ధవ్ వ్యాఖ్యతో వివాదం
4 hours ago

జాతీయ జెండాను అవమానిస్తే సహించం.. కాంగ్రెస్‌పై బీజేపీ ఆరోపణ
7 hours ago

ఏకగ్రీవాలపై పేపర్ ప్రకటన.. ఎవరిని అడిగి ఇచ్చారని సంజాయషి ఇవ్వాల్సిందే..
8 hours ago

రైతుల ఉద్యమంలో విధ్వంసకారులు.. 200 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
8 hours ago

వైసీపీలో గ్రూపుల కొట్లాట.. ఏకగ్రీవం కోసం ఫైటింగ్ లు
6 hours ago

ఏకగ్రీవం తొలి బోణీ కొట్టిన వైసీపీ..
9 hours ago
ఇంకా