newssting
Radio
BITING NEWS :
కిడ్నాపర్ల చెరనుంచి తప్పించుకున్న అమ్మాజీ స్వాజీ. డబ్బుల కోసం అమ్మాజీ స్వామీజీ కిడ్నాప్. షిరిడీ వెళ్దామని చెప్పి స్వామీజీని కిడ్నాప్ చేసి, 20 కోట్ల రూపాయలు - కిలో బంగారం డిమాండ్ చేసిన కిడ్నాపర్లు. ఇంతలో గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరి డాక్టర్ల ద్వారా పోలీసులకు కిడ్నాప్ గురించి సమాచారం. * ప్రొద్దుటూరులో ఉన్మాది దాడిలో గాయపడిన లావణ్యకు కొనసాగుతున్న చికిత్స. నిన్న రాత్రి ప్రొద్దుటూరు నుంచి రిమ్స్ ఆస్పత్రికి తరలింపు. నిందితుడు సునీల్ దాడిలో లావణ్య తల, చేతికి తీవ్రగాయాలు. ప్రస్తుతం లావణ్య ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు. * టీటీడీ నుంచి రామతీర్థానికి విగ్రహాల తరలింపు. రామతీర్థం ఆలయాన్ని పునర్నించాలని నిర్ణయించిన ప్రభుత్వం. ఆలయ పనులు పూర్తయ్యేంతవరకూ బాలాలయంలోనే విగ్రహాల ప్రతిష్ట. ఏడాదిలోగా రామతీర్థానికి పూర్వవైభవం తీసుకొస్తామన్న మంత్రి వెల్లంపల్లి. * విషమించిన ఆర్జేడీ నేత లాలూప్రసాద్ ఆరోగ్యం. రాంచీ రిమ్స్ ఆస్పత్రిలో లాలూకు కొనసాగుతున్న చికిత్స. లాలూ ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రికి చేరుకున్న కుటుంబసభ్యులు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చిందంటున్న వైద్యులు. * పాట్నాలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 10 ఫైరింజన్లు. అగ్నిప్రమాద స్థలానికి సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉండటంతో ఆందోళనలో స్థానికులు. * తమిళనాడు ముత్తూట్ ఫైనాన్స్ లో రూ.7 కోట్ల విలువైన బంగారం అపహరణ. హైదరాబాద్ లో దొరికిన బంగారం దొంగలు. మధ్యాహ్నం 3 గంటలకు మీడియా ఎదుట నిందితులను హాజరుపరచనున్న పోలీసులు. * పశ్చిమగోదావరి జిల్లా కొమిరేపల్లిలో 28కి చేరిన వింతవ్యాధి కేసులు. అనారోగ్యం నుంచి కోలుకోవడంతో 19 మంది డిశ్చార్జ్. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో 9 మంది బాధితులు. పూళ్లలో 36కి చేరిన వింతవ్యాధి కేసులు. ఇంటింటి సర్వే చేస్తున్న వైద్య సిబ్బంది. * అనంతపురం జిల్లా పుట్లూరులో దారుణం. ఐదేళ్ల చిన్నారిపై వీధికుక్కల దాడి. చిన్నారికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు. * ఏపీ పంచాయతీ ఎన్నికలకు మోగిన నగారా. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ. నాలుగు దశల్లో ఎన్నికల నిర్వహణ. ఈ నెల 27 నుంచి 29 వరకూ నామినేషన్లు, 31న ఉపసంహరణ. ఫిబ్రవరి 5న పోలింగ్.

ఎన్టీఆర్ జోలికి వచ్చారు.. కన్నెర్రజేసిన ఎంపీ రామ్మోహన నాయుడు

14-01-202114-01-2021 14:58:49 IST
2021-01-14T09:28:49.933Z14-01-2021 2021-01-14T04:05:33.551Z - - 24-01-2021

ఎన్టీఆర్ జోలికి వచ్చారు.. కన్నెర్రజేసిన ఎంపీ రామ్మోహన నాయుడు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో ఉన్న విగ్రహం.. దుండగుల దాడిలో ముక్కు విరిగిపోయింది. గడ్డం, భుజం, నుదుటిపైనా దాడి చేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఘటనపై స్థానిక టీడీపీ నాయకులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ గోవింద ఘటనా స్థలానికి చేరుకుని విగ్రహాన్ని పరిశీలించారు. దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. 

సంతబొమ్మాళిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు డిమాండ్ చేశారు. ధ్వంసమైన విగ్రహాన్ని పరిశీలించిన రామ్మోహన్‌నాయుడు అనంతరం మాట్లాడుతూ.. విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులపై సత్వరమే చర్యలు తీసుకోవాలని, లేకుంటే లక్షలాదిమంది కార్యకర్తలతో ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. రాష్ట్రాన్ని ఎంతోమంది పాలించారని, కానీ ఇలాంటి దుస్థితిని ఎన్నడూ చూడలేదని రామ్మోహన్‌నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావేదిక కూల్చివేతతో పాలన ప్రారంభమైందన్నారు. ఇప్పుడు దేవుళ్లు, రాజకీయ నాయకుల విగ్రహాలపై పడి రాష్ట్రాన్ని అల్లకల్లోలంగా మారుస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ ఘటనను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ట్విటర్‌లో తీవ్రంగా ఖండించారు. ‘దేవతా విగ్రహాలను ధ్వంసం చేస్తున్న వైసీపీ దుష్టులే ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. నిలబెట్టడం చేతకాని జగన్‌రెడ్డి గొప్ప వ్యక్తుల విగ్రహాలు కూల్చి వికృతానందం పొందుతున్నారు. సంతబొమ్మాళిలో ఎన్టీఆర్‌, ఎర్రన్నాయుడు విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి’ అని డిమాండ్‌ చేశారు. 

ఏపీలో చోటు చేసుకున్న ఆలయాల్లో విగ్రహాల విధ్వసం వెనుక రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్ వ్యూహాలు ఉన్నాయని టీడీపీ నేత డాక్టర్‌ ఎన్‌బీ సుధాకర్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ప్రశాంత్‌ వ్యూహంతో జగన్ ఇచ్చిన ఆదేశాలకు ఆయన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వం వహించడం వల్లే ఈ ఘటనలు చోటు చేసుకున్నాయని సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మిళిలో ఎన్టీఆర్, ఎర్రన్నాయుడు విగ్రహాల ముఖాలు చెక్కేయడం వెనుక అధికార పార్టీ హస్తం ఉందని సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. త్వరలో వైఎస్సార్ విగ్రహాలు ధ్వంసం చేసి ఆ నేరాన్ని తెలుగుదేశం పార్టీపై నెట్టేందుకు కట్ర పన్నుతున్నారని చెప్పారు.

నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ కాదు.. రాజకీయ నాయకుడే..

నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ కాదు.. రాజకీయ నాయకుడే..

   2 hours ago


నిమ్మగడ్డ మీటింగ్.. అలా షాక్ ఇచ్చిన అధికారులు..!

నిమ్మగడ్డ మీటింగ్.. అలా షాక్ ఇచ్చిన అధికారులు..!

   7 hours ago


తెలంగాణ పాలిటిక్స్ లోకి ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర రావు

తెలంగాణ పాలిటిక్స్ లోకి ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర రావు

   8 hours ago


అంబ‌టి రాంబాబు కొత్త రాగం.. సెంటిమెంట్ తో ఆయింట్ మెంట్

అంబ‌టి రాంబాబు కొత్త రాగం.. సెంటిమెంట్ తో ఆయింట్ మెంట్

   6 hours ago


ఎన్నిక‌ల‌కు వెళ్ల‌కుంటే.. ఏపీ స‌ర్కార్ కి సీరియ‌స్ ప్రాబ్ల‌మే.. ఎలాగో తెలుసా..?

ఎన్నిక‌ల‌కు వెళ్ల‌కుంటే.. ఏపీ స‌ర్కార్ కి సీరియ‌స్ ప్రాబ్ల‌మే.. ఎలాగో తెలుసా..?

   9 hours ago


అన్నా రాంబాబుపై జనసేనాని ఆగ్రహం.. అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వమంటూ హెచ్చరిక

అన్నా రాంబాబుపై జనసేనాని ఆగ్రహం.. అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వమంటూ హెచ్చరిక

   4 hours ago


వైసీపీ పతనానికి పంచాయతీ ఎన్నికలే నాంది అంటున్న చంద్రబాబు

వైసీపీ పతనానికి పంచాయతీ ఎన్నికలే నాంది అంటున్న చంద్రబాబు

   3 hours ago


లాలూ ప్రసాద్‌కు సిటీ స్కాన్.. ఆసుపత్రికి రబ్రీ, తేజస్వి రాక

లాలూ ప్రసాద్‌కు సిటీ స్కాన్.. ఆసుపత్రికి రబ్రీ, తేజస్వి రాక

   10 hours ago


ఇక నేను ఫైట్ చేస్తా- అన్నా హ‌జారే

ఇక నేను ఫైట్ చేస్తా- అన్నా హ‌జారే

   10 hours ago


ఆ ఒక్క సీటు చాలా ఇంపార్టెంట్.. రంగంలోకి రెడీ

ఆ ఒక్క సీటు చాలా ఇంపార్టెంట్.. రంగంలోకి రెడీ

   8 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle